Ramchander Rao: కాంగ్రెస్ పాలన వైఫల్యాలు బీజేపీ చార్జ్ షీట్
Ramchander Rao ( image credit: swetcha reporter)
Political News

Ramchander Rao: కాంగ్రెస్ పాలన వైఫల్యాలు మోసాలపై బీజేపీ చార్జ్ షీట్ రిలీజ్ : రాంచందర్​ రావు

Ramchander Rao: రాష్ట్రంలో 23 నెలల కాంగ్రెస్ పాలన వైఫల్యాలు, మోసాలపై బీజేపీ చార్జ్ షీట్ రిలీజ్ చేసింది. ఇందులో ప్రధానంగా 7 అంశాలను ప్రస్తావించంది. మహిళలకు మహా మోసం, పేదలపై భస్మాసుర హస్తం, బీసీల నోట్లో మట్టి, ఎస్సీ, ఎస్టీ లకు వంచన, యువత ఆశలు ఆవిరి, ఉద్యోగులు, ఉపాధ్యాయులపై ఉదాసీనత, భాగ్యనగరoపై నిర్లక్ష్యం వంటి అంశాలున్నాయి. ఈమేరకు నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు (Ramchander Rao)  చార్జ్ షీట్ ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్కార్.. ప్రజలకు భస్మాసుర హస్తంగా మారిందని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని, అలాంటిది ఏ ముఖంతో ప్రజల దగ్గరికి వెళ్లి ఓట్లడుగుతున్నారని ప్రశ్నించారు. 2023 ఎన్నికల ముందు విడుదల చేసిన 60 పేజీల మేనిఫెస్టోలో 420 హామీలు చేశారని, మరో 13 ముఖ్య వాగ్ధానాలు ఉన్నాయని చెప్పారు.

Also Read: Ramchander Rao: బీజేపీకి భయపడే సీఎం స్వయంగా ప్రచారానికి దిగారు.. రాంచందర్ రావు కీలక వ్యాఖ్యలు

ఒక్క హామీ అమలు చేయలేదు 

అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ప్రకటించారని, కానీ దాదాపు వెయ్యి రోజులైనా ఒక్క హామీ అమలు చేయలేదని ఫైరయ్యారు. సర్కార్ వైఫల్యాలను ప్రజల ముందు స్పష్టంగా పెడుతున్నామని, ప్రభుత్వం తన పనితీరు గురించి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం విద్యార్థులు, ఆరోగ్యశ్రీ బకాయిల కారణంగా రోగులు, అలాగే రుణమాఫీ కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో విద్యార్థుల చదువులు ఆగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి, చివరకు ప్రజలే ప్రభుత్వాన్ని మాఫీ చేసే పరిస్థితి తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు.

ఇదంతా కేవలం ఓట్ల కోసం

విద్యార్థినులకు ఉచిత స్కూటీలు ఇస్తామని చెప్పి, కనీసం సైకిల్ కూడా ఇవ్వలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు. ఇదంతా కేవలం ఓట్ల కోసం వేసిన రాజకీయ నాటకం మాత్రమేనని అన్నారు. బీసీ డిక్లరేషన్ హామీలను సైతం ఓట్ల కోసం వేసిన వల అని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జవాన్ల త్యాగాలు, జాతీయ భద్రత వంటి అంశాలపై చేసిన వ్యాఖ్యలను రాచందర్​ రావు తీవ్రంగా ఖండించారు. ఈ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని ధ్వజమెత్తారు.

బహిరంగంగా క్షమాపణ చెప్పాలి

కాంగ్రెస్ నేతలు వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని రాంచందర్ రావు డిమాండ్ చేశారు. అనంతరం ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. అధికారంలోకి వస్తే కేసీఆర్ అవినీతి చేసిన రూ.లక్ష కోట్లు కక్కిస్తామన్నారని, ప్రజలకు పంచుతామని అన్నారని, మరి ఏమైందని ప్రశ్నించారు. ఇప్పటి వరకు కేసీఆర్ కుటుంబం నుంచి ఎంత కక్కించారో శ్వేతపత్రం రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. మేనిఫెస్టోలోని మొదటి పేజీలోని హామీలే అమలు కాలేదన్నారు. అందుకే కాంగ్రెస్ ను బొంద పెట్టేందుకు ప్రజలు చూస్తున్నారని పేర్కొన్నారు. ఎంఐఎం ఎవరి కోసం ప్రచారం చేస్తుందనేది జూబ్లీహిల్స్ ప్రజలు గమనించాలని రఘునందన్ రావు కోరారు.

రైతులపై నిర్లక్ష్యం

ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ మాట్లాడుతూ కాంగ్రెస్ రైతులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కేంద్రం ఇచ్చిన పైసలను వాడుకోలేని చేతగాని దద్దమ్మలని ఫైరయ్యారు. మళ్లీ కేంద్రంపై నెపం వేస్తున్నారని ధ్వజమెత్తారు. విపత్తు నిధులు రాష్ట్రం వద్ద రూ.1911 కోట్లు ఉన్నాయని, ఈ సంగతి మర్చిపోయారా? అంటూ ప్రశ్నించారు. వాటిని ఎందుకు ఖర్చు చేయడం లేదని నగేశ్ నిలదీశారు. గతేడాది పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు. అన్నీ కేంద్రమే ఇస్తే ఇక కాంగ్రెస్ పాలన ఎందుకని ప్రశ్నించారు. తక్షణమే రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.

భూమిని ప్రభుత్వం వేలం

చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ హయాంలో సీతారాంపూర్ సీతారాముల స్వామి గుడికి చెందిన 1100 ఎకరాల ఎండోమెంట్స్ భూమిని ప్రభుత్వం నోటిఫై చేసి వ్యాపారులకు అమ్మేసిందని, ఇది పూర్తిగా అక్రమమని ఆరోపించారు. ఎండోమెంట్స్ భూమిని ప్రభుత్వం వేలం వేసి అమ్మడం చట్టవిరుద్ధమని, అయినా బీఆర్‌ఎస్ ప్రభుత్వం అలా చేసిందని ఫైరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఆ భూమిని తిరిగి దేవాదాయ శాఖకు అప్పగించాలని, రిజిస్ట్రేషన్ రద్దుచేసి పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కానీ కాంగ్రెస్ చేయడంలేదన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని దీన్నిబట్టి అర్థమవుతోందన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తాము ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేస్తూ కాంగ్రెస్, ఎంఐఎం దుర్మార్గాలను, ఆగడాలను, మోసాలను, వైఫల్యాలను ప్రజలకు వివరిస్తున్నామన్నారు. బీజేపీని గెలిపించాలని కోరారు.

Also Read: Ramchander Rao: జూబ్లీహిల్స్‌లో టీడీపీ కేడర్ మద్దతిస్తుందని భావిస్తున్నాం.. రాంచందర్ రావు కీలక వ్యాఖ్యలు

Just In

01

The Raja Saab: ‘సహన సహన..’ సాంగ్ వచ్చేసింది.. ఈ పాట ఓకే!

MLA Krishnamohan Reddy: కేవలం అభివృద్ధి కోసమే సీఎంను కలిసాను: ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

Murder Case: తన మామను హత్య చేశాడని పగబట్టి.. ప్రతీకారం తీర్చుకున్న అల్లుడు

Tamil Nadu Crime: తూత్తుకుడిలో దారుణం.. భర్త ముందే భార్యపై అత్యాచారం..!

YouTube Reporter Arrest: యూ ట్యూబ్ ఛానల్‌ను అడ్డం పెట్టుకుని వసూళ్లు చేస్తున్న​ రిపోర్టర్‌ అరెస్ట్..!