Ramchander Rao: జూబ్లీహిల్స్‌లో టీడీపీ కేడర్ మద్దతిస్తుంది
Ramchander Rao (image credit: twitter)
Political News

Ramchander Rao: జూబ్లీహిల్స్‌లో టీడీపీ కేడర్ మద్దతిస్తుందని భావిస్తున్నాం.. రాంచందర్ రావు కీలక వ్యాఖ్యలు

Ramchander Rao: ఎన్నికల్లో గెలుపోటములు సహజమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు (Ramchander Rao) తెలిపారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక్లో డోర్ టు డోర్ ప్రచారం చేపడుతామని వివరించారు. ఓడిపోయిన వారికి టికెట్ ఇవ్వకూడదనే రూల్ ఏంలేదని ఆయన పేర్కొన్నారు. విజయం ప్రజల తీర్పుపై ఆధారపడి ఉంటుందన్నారు. అధిష్టానం అన్నీ ఆలోచించే అభ్యర్థిని ఖరారు చేసిందని రాంచందర్ రావు వివరించారు. టికెట్ ఇవ్వనోళ్లకు ఎలాంటి అన్యాయం జరగలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ చేసిన మోసాన్ని ప్రజలకు వివరిస్తామన్నారు.

Also Read: Ramchander Rao: స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటాలి.. రాంచందర్ రావు కీలక వాఖ్యలు

ఇకపోతే బీఆర్ఎస్ కారు పంచర్ అయ్యింది

కాంగ్రెస్ కు అభ్యర్థులు దొరక్క ఎంఐఎం అభ్యర్థిని బరిలోకి దింపిందని, దీన్ని ప్రజలకు వివరిస్తామని తెలిపారు. ఇకపోతే బీఆర్ఎస్ కారు పంచర్ అయ్యిందని, బ్రేకులు పోయాయని, కారు గ్యారేజీలో పడిందంటూ రాంచందర్ రావు ఎద్దేవాచేశారు. బీఆర్ఎస్ అవినీతిని ప్రజలకు వివరిస్తామన్నారు. బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరుతామన్నారు. బీసీలపై బీజేపీకి ఉన్న చిత్తశుద్ధి కాంగ్రెస్, బీఆర్ఎస్ కు లేవనేది ప్రజలకు తెలుసన్నారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్ చేస్తున్న మోసాలే తమకు ఓట్లు తెచ్చిపెడతాయి 

ప్రజలు అభ్యర్థిని చూడరని, పాలసీని చూస్తారని వివరించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ చేస్తున్న మోసాలే తమకు ఓట్లు తెచ్చిపెడతాయన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలుకు ఈనెల 18న బీసీ సంఘాలు తలపెట్టిన బంద్ కు బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఆయన స్పష్టంచేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ తోనే తమకు పోటీ అన్నారు. టీడీపీ కేడర్ తమకు మద్దతిస్తుందని భావిస్తున్నట్లు రాంచందర్ రావు ఆశాభావం వ్యక్తంచేశారు. తొలుత మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి రాంచందర్ పూలమాల వేసి నివాళులర్పించారు.

Also Read: Ramchander Rao: జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి ఎంపికకు త్రీ మెన్ కమిటీ.. ముఖ్య నేతలు వీళ్ళే!

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..