Maithili Thakur: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అనేక కొత్త రికార్డులకు తెర లేపాయి. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ(NDA) కూటమి అభ్యర్థి మైథిలీ ఠాకూర్(Maithili Thakur)కేవలం 25 సంవత్సరాల వయసులోనే విజయం సాధించి, రాష్ట్రంలో అత్యంత పిన్న వయస్కురాలైన ఎమ్మెల్యేగా చరిత్ర సృష్టించారు. మైథిలీ ఠాకూర్, సుప్రసిద్ధ జానపద గాయనిగా, సోషల్ మీడియా సెలబ్రిటీగా బిహార్‌లో మంచి పేరు సంపాదించారు. ఎన్నికల ప్రచార సమయంలో ఆమెకు యువత, మహిళల నుంచి భారీ మద్దతు లభించింది. ఆమె మైథిలీ సంస్కృతి, స్థానిక సంప్రదాయాలను బలంగా ప్రతిబింబిస్తూ చేసిన ప్రచారం ఓటర్లను ఆకర్షించింది.
Also Read: Kavitha: ఘనపూర్ ప్రాజక్టు ఎత్తు పెంపు పనులు వెంటనే ప్రారంభించాలి : కవిత
రాజకీయాల్లోకి యువత
తన చురుకైన ప్రచారం, సామాజిక మాధ్యమాల ద్వారా యువ ఓటర్లతో కనెక్ట్ కావడం ఆమె విజయానికి కీలక కారణమయ్యాయి. బిహార్(Bihar)లో సీఎం నితీశ్ కుమార్(CM Nitish Kumar) నాయకత్వంలోని ఎన్డీఏ కూటమిలో భాగమైన మైథిలీ గెలుపు, రాష్ట్ర రాజకీయాల్లో యువత పాత్ర పెరుగుతోందనడానికి నిదర్శనం. యువ ఓటర్లు నితీశ్, ప్రధాని నరేంద్ర మోదీ(PM Modhi)ల అభివృద్ధి అజెండాను విశ్వసించారని ఈ విజయం సూచిస్తుంది. మైథిలీ కేవలం ఎన్నికల బరిలో విజయం సాధించడమే కాకుండా, రాబోయే ఐదేళ్లలో రాష్ట్రానికి మరింత చైతన్యం తీసుకువచ్చే యువ నాయకత్వంలో ఒకరిగా గుర్తింపు పొందారు.
Also Read: Naveen Yadav: నెరవేరిన 40 ఏళ్ల కల.. వల్లాల కుటుంబం నుంచి నవీన్ గెలుపు

