Naveen Yadav: ఒక వైపు రియల్ వ్యాపారం చేసుకుంటూనే ప్రజాప్రతినిధి కావాలన్న కొరిక. ఎన్నో రాజకీయ ఒడిదుడుకులు, వ్యూహాలు, ప్రతి వ్యూహాలు, రకరకాల సమీకరణలు ఫలించి ఎట్టకేలకు వల్లాల శ్రీశైలం యాదవ్(Srisailam Yadav) కుటుంబం నుంచి ఒకరికి అసెంబ్లీలో సీటు దక్కింది. మూడు పర్యాయాలుగా జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన న ‘విన్’ యాదవ్ కు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం వరించింది. 42 ఏళ్ల వయస్సులోనే ఆయన అసెంబ్లీకి వెళ్తున్నారు. వల్లాల చిన్న శ్రీశైలం యాదవ్ ఎమ్మెల్యే కావాలన్న తన కలను తన తనయుడి రూపంలో నిజం చేసుకున్నారు. చాలా మంది ఎన్నో కలలు కంటారు. కానీ తమ కలలను తమ వారసులతో నిజం చేసుకోవాలని భావించే వారు చాలా అరుదు. తమ కలను తన వారసుడితో నిజం చేసుకున్న అతి తక్కువ మంది జాబితాలో చిన్న శ్రీశైలం యాదవ్ స్థానం సంపాదించారు. 40 ఏళ్ల క్రితం చిన్న శ్రీశైలం యాదవ్ రాజకీయాలకు ఆకర్షితులై కాంగ్రెస్(Congress) పార్టీలో చేరారు. హైదరాబాద్ బ్రదర్ గా పేరుగాంచిన పి. జనార్థన్ రెడ్డి(P. Janardhan Reddy) శిష్యుడిగా నగరవాసులకు ఆయన సుపరిచితులే. యూసుఫ్ గూడలో పుట్టి పెరిగి, లోకల్ గా బాగా పట్టుకున్న నేతగా ఎదిగారు. ఎన్నో జఠిలమైన సమస్యలను తాను ఆయన పరిష్కరించారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారిగా..
కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే(MLA) టికెట్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా, అదృష్టం ఫలించక, చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ముఖ్యమంత్రిగా ఉన్నపుడు రికార్డు స్థాయి జనంతో భారీ ఊరేగింపుతో తెలుగు దేశం పార్టీలో చేరారు. అప్పటి రాజకీయ సమీకరణలు ఫలించక ఆయన ప్రయత్నాలనీ విఫలమై ఆశించిన ఎమ్మెల్యే టికెట్ దక్కలేదు. అయినా ఆయన ఏ మాత్రం నిరాశ, నిస్పృహాలకు గురి కాకుండా లోకల్ గా అందరికీ అందుబాటులో ఉంటూ, సోషల్ వర్క్ ను కొనసాగించారు. రియల్ ఎస్టేట్(Real estate) వ్యాపారిగా ఆయన మంచి పేరు సంపాదించుకున్నారు. ప్రజాసేవ చేస్తూనే తన కొడుకునైనా ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న శ్రీశైలం యాదవ్ తన బాటలోనే తన తనయుడ్ని తీసుకువచ్చారు. తనయుడ్ని స్థానిక సమస్యలను పరిష్కరించటంలో, జూనియర్ ఆర్టిస్టులకు అండగా నిలవటంతో పాటు ట్రాన్స్ జెండర్లకు అనేక సేవలు చేయటంలో నిమగ్నం చేశారు. 2023లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా గెలిచిన మాగంటి గోపీనాధ్(Maganti Gopinath) హఠాన్మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇపుడు అరుదైన చాన్స్ రావటంతో శ్రీశైలం కుమారుడు వల్లాల నవీన్ యాదవ్(Valla Naveen Yadav) చక్కటి వ్యూహాంతో మ్మెల్యేగా అఖండ విజయం సాధించారు. ఈ విజయంతో కాంగ్రెస్ పార్టీ సిటీలోని రెండో ఎమ్మెల్యే సీటును తన ఖాతాలో వేసుకుంది. 2024 జూన్ లో జరిగిన కంటోన్మెంట్ నియోజకవర్గం ఉప ఎన్నికలో విజయం సాధించిన కాంగ్రెస్ ఇపుడు జూబ్లీ హిల్స్ లో కూడా విజయఢంకా మోగించటంతో గ్రేటర్ హైదరాబాద్(Hyderabad) లోని కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో మరింత జోష్ నింపింది.
ఇద్దరి కల.. రెండు పార్టీల వ్యూహాం
తొలుత నవీన్ యాదవ్ ఎంఐఎం(MIM) పార్టీలో చేరి జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వరుసగా ఆయన రెండు సార్లు ఓటమి పాలయ్యారు. నాడు నవీన్(Naveen) రాజకీయ ఆరంగేట్రమ్ చేసి ఎంఐఎం పార్టీ మద్దతుతో, తండ్రి శ్రీశైలం యాదవ్ ఆశించిన కాంగ్రెస్(Congress) టికెట్ తో నవీన్ విజయం సాధించారు. తండ్రి కొడుకుల కలను అధికార కాంగ్రెస్, మిత్రపక్షమైన ఎంఐఎం(MIM) పార్టీల వ్యూహాం ఆయన విజయానికి సోపానాలు వేశాయి. దీనికి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఎలక్షన్ స్కెచ్, మంత్రులు ముమ్మరం ప్రచార కార్యక్రమాలు కూడా తోడే భారీ మెజార్టీతో నవీన్ గెలుపుకు దోహదం చేశాయి. ఎంఐఎం పార్టీ నుంచే నవీన్ తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించటంతో ఆయన విజయం కోసం ఎంఐఎం పార్టీ ఎన్నికల బరిలో అభ్యర్థిని దింపకుండానే హస్తం పార్టీ మిత్రపక్ష పార్టీగా కాంగ్రెస్ జెండాలు చేతబూని నవీన్ గెలుపు కోసం చేసిన ప్రచారం ఫలించింది. గతంలో ఏ పార్టీ నుంచి పోటీ చేసి నవీన్ ఓటమి పాలయ్యారో ఇపుడు అదే పార్టీ సపోర్టుతో విజయం సాధించి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్లనున్నారు.
Also Read: Breast Cancer: యువతుల్లో పెరుగుతోన్న బ్రెస్ట్ క్యాన్సర్.. కారణాలు ఇవే
