Breast Cancer ( Image Source: Twitter)
లైఫ్‌స్టైల్

Breast Cancer: యువతుల్లో పెరుగుతోన్న బ్రెస్ట్ క్యాన్సర్.. కారణాలు ఇవే

Breast Cancer: మన దేశంలో బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దేశంలో అత్యంత సాధారణంగా గుర్తింపబడే క్యాన్సర్‌గా బ్రెస్ట్ క్యాన్సర్ మొదటి స్థానంలో నిలిచింది. క్యాన్సర్‌ సంబంధిత మరణాల్లో కూడా ఇది ప్రధాన కారణంగా మారింది. స్వీయ పరీక్షలు (Self-Examination), వైద్యుల వద్ద మాన్యువల్ క్లినికల్ పరీక్షలు, రెగ్యులర్ మామోగ్రఫీ చేయించుకోవడం. ఇవి బ్రెస్ట్ క్యాన్సర్‌ను అరికట్టడంలో అత్యంత ప్రభావవంతమైన మార్గాలుగా చెబుతున్నారు. అసలు ఇది ఎందుకో వస్తుందో? దానికి గల కారణాలు ఇక్కడ తెలుసుకుందాం..

1. బ్రెస్ట్‌లో ఉండే ప్రతి గడ్డ కూడా క్యాన్సర్ కాదు

బ్రెస్ట్‌లో గడ్డ కనిపించడం భయంకరంగా అనిపించవచ్చు. అయినప్పటికీ, యువతుల్లో కనిపించే ఎక్కువశాతం గడ్డలు సాధారణంగా హానికరం కానివే (Benign). అయితే, 40 ఏళ్లు దాటిన మహిళలు బ్రెస్ట్‌లో ఏ కొత్త గడ్డ కనిపించినా వెంటనే పరీక్ష చేయించుకోవాలి. యువ వయసులో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి వయసుతో సంబంధం లేకుండా అప్రమత్తత అత్యవసరం.

2. కేవలం 5–10% బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు వారసత్వం వల్లనే

బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న మహిళల్లో ఎక్కువ మంది ఈ వ్యాధిని వారసత్వంగా పొందలేదు. కుటుంబంలో వారసత్వం ఉన్నా ప్రమాదం పెరుగుతుంది. కానీ ఇది వ్యాధి తప్పనిసరిగా వస్తుందని కాదు. దగ్గరి బంధువుల్లో (తల్లి, అక్క, చెల్లి, కుమార్తె) ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే ప్రమాదం రెట్టింపు అవుతుంది. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ దగ్గరి బంధువులకు ఉంటే ప్రమాదం మూడు రెట్లు పెరుగుతుంది. ఇలాంటి సందర్భాల్లో ముందుగానే స్క్రీనింగ్ ప్రారంభించడం, అవసరమైతే జెనెటిక్ టెస్టింగ్ చేయించడం మంచిది.

3. బ్రెస్ట్ మొత్తం తొలగించడం (Mastectomy) మాత్రమే శస్త్రచికిత్సా మార్గం కాదు

అనేక మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందంటే తప్పనిసరిగా బ్రెస్ట్‌ను పూర్తిగా తొలగించుకోవాల్సిందే అనుకుంటారు. ఇది తప్పు. ఇప్పుడున్న వైద్యపద్ధతులతో పాక్షిక మాస్టెక్టమీ లేదా లంపెక్టమీ వలన కేవలం క్యాన్సర్ ఉన్న భాగాన్ని మాత్రమే తొలగిస్తారు.

4. పురుషులకు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది

పురుషుల్లో బ్రెస్ట్ క్యాన్సర్ చాలా అరుదుగా (0.5–1%) కనిపించినప్పటికీ వచ్చే అవకాశముంది. కుటుంబంలో క్యాన్సర్ ఉండటం, ఈస్ట్రోజన్‌ స్థాయిలు పెరగడం వంటి పరిస్థితులు ప్రమాదాన్ని పెంచుతాయి. పురుషులు కూడా బ్రెస్ట్‌లో ఉండే మార్పులను గమనిస్తూ, సందేహం ఉన్నప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించాలి.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా డాక్టర్ లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Just In

01

Akhanda 2: బాలయ్య ‘అఖండ 2’ తాండవం సాంగ్ వచ్చేసింది.. ఏం కొట్టాడు భయ్యా థమన్..

Revanth On JubileeHills Result: జూబ్లీహిల్స్‌ ఫలితంపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.. పక్కనే కొత్త ఎమ్మెల్యే నవీన్

Telangana Govt: పత్తి, వరి పంటల కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధం.. ఈ యాప్‌లో మీ పంట వివరాల నమోదు చేసుకోవాలి!

Bihar CM Race: బీహార్‌‌లో మొదలైన సీఎం రేస్!.. జేడీయూ ట్వీట్ డిలీట్.. బీజేపీ సీఎం అభ్యర్థి ఆయనేనా?

JetLee movie: కమెడియన్ సత్య కొత్త మూవీ టైటిల్ ఇదే.. అప్పుడే నవ్వించడం స్టార్ట్ చేశాడుగా..