Telangana Ministers: మంత్రుల బెర్త్ లపై ఢిల్లీలో బిగ్ డిస్కషన్ జరుగుతుంది. రెండో రోజు కూడా సీఎం రేవంత్ రెడ్డి శాఖలపై చర్చించారు. కేసీతో ఇప్పటికే డిస్కషన్ చేయగా, మంగళవారం ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో కూడా చర్చించారు. కొత్త మంత్రులకు శాఖలు కేటాయింపుతో పాటు పాత మంత్రుల్లోని కొందరి శాఖల మార్పు కూడా భారీగా ఉండే ఛాన్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. దీనిలో భాగంగానే ఢిల్లీలో డీప్ డిస్కషన్ జరుగుతున్నట్లు పార్టీ నేతలు చెప్తున్నారు. పైగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. దీంతో ఆయన అక్కడకు వెళ్లారు. ఏఐసీసీ పెద్దలతో ప్రత్యేకంగా భేటీ అయినట్లు సమాచారం. కొత్త మంత్రులకు మాత్రమే శాఖలు కేటాయింపులకు ఏఐసీసీ నుంచి సీఎం కు కమ్యూనికేట్ జరిగేది. కానీ సీఎం రెండు రోజుల పాటు హస్తినలోనే ఉండడం, హుటాహుటిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లడం వంటి పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. కేబినెట్ లో భారీ మార్పులు లేదా కుదుపు ఉండవచ్చనే చర్చ కూడా తెరమీదకు వచ్చింది. పార్టీ నేతలతో పాటు పాత మంత్రులు కూడా ఢిల్లీ నిర్ణయాలపై ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. సీఎం వచ్చిన తర్వాతనే తమ శాఖల మార్పు, కొత్త మంత్రులకు కేటాయింపులు వంటి వాటిపై స్పష్టత వస్తుందని ఓ సీనియర్ మంత్రి తెలిపారు.
Also Read: HYDRA Commissioner: చింతల్ బస్తీలో నాలా ఆక్రమణలపై.. హైడ్రా కమిషనర్ ఫైర్!
నేడు శాఖలు ఖరారుకు ఛాన్స్?
కొత్త మంత్రుల శాఖలతో పాటు పాత మంత్రుల డిపార్ట్ మెంట్ల షప్లింగ్ పై మంగళవారం ప్రకటన ఉండే ఛాన్స్ ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు ద్వారా తెలిసింది. ప్రస్తుతం రేవంత్‌రెడ్డి 11 శాఖలు ఉండగా కీలకమైన మున్సిపల్, హోం, విద్యాశాఖలు వంటి కీలకమైన డిపార్ట్ మెంట్లకు స్వయంగా సీఎం బాస్ గా ఉన్నారు. ఈ కీలక శాఖలు ఎవరికి ఇవ్వాలి? లేదా సీఎం వద్దే కంటిన్యూ చేయాలా? తదితర అంశాలపై స్పష్టత ఇవ్వనున్నారు. కొత్త మంత్రులకు మాత్రం ఈ కీలకమైన శాఖలు కేటాయించే అవకాశం తక్కువగానే ఉంటుందని పార్టీ నేతలు భావిస్తున్నారు.కేబినెట్ బెర్త్ ల అంశంలో కూడా ఈక్వాలిటీ అనే నినాదంతో ఎంపిక చేయాలని పార్టీ భావిస్తుందని ఓ నేత చెప్పుకొచ్చారు.
కో ఆర్డినేషన్ ఈజీ కోసం?
మంత్రుల శాఖలను పూర్తిగా ప్రక్షాళన చేయనున్నారు. శాఖల సమన్వయం ఈజీగా ఉండేలా ఒక శాఖకు, మరో శాఖకు లింక్ ఉండే వాటిని ఒకే మంత్రి కి కేటాయించేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు. ప్రస్తుతం కొన్ని శాఖల మధ్య సమన్వయం కొరవడుతుందని, దీని వలన సమస్యలు, వాటి పరిష్కారాల్లో జాప్యం ఏర్పడుతుందనేది ప్రభుత్వం భావన. దీంతో ఈ సారి శాఖల కేటాయింపు ఫర్ ఫెక్ట్ గా ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. దీని వలన ఆఫీసర్ల రివ్యూస్, డెవలప్ మెంట్ ప్రోగ్రామ్స్ కూడా స్పీడప్ కానున్నాయి.
Also Read: Kangana Ranaut: హనీమూన్ మర్డర్ కేసుపై కంగనా సంచలన వ్యాఖ్యలు