Bandi Sanjay:పేదరికం ఉన్నంత కాలం నక్సలిజం ఉంటుందని, ఆపరేషన్ కగార్(Operation Kagar)ను ఆపి నక్సలైట్లతో చర్చలు జరపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), మాజీ సీఎం కేసీఆర్(KCR) చెప్పడం హాస్యాస్పదమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(Bandi Sanjay Kumar) అన్నారు. నక్సలైట్లతో గతంలో చర్చలు జరిపిన కాంగ్రెస్(Congress) ఏం సాధించిందని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నంత కాలం నక్సలైట్ల నిషేధం విధించిన కేసీఆర్ అధికారం పోగానే చర్చలంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని మండిపడ్డారు. కరీంనగర్ లో ఏబీవీపీ(ABVP) ఆధ్వర్యంలో ఏర్పాటు ‘నక్సల్స్ నరమేధం-మేధోమథనం’ పేరిట నిర్వహించిన చర్చకు కేంద్ర మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నక్సలైట్ల సమస్య సామాజిక కోణంగా చూడాలని మాట్లాడుతున్న పౌర హక్కులు, మానవ హక్కుల సంఘం నేతలు మాట్లాడటం సిగ్గుచేటన్నారు.
నక్సల్స్ దురాగతాలవల్ల
నక్సలైట్ల చేతిలో వేలాది మంది అమాయక ప్రజలు చనిపోయినప్పుడు సామాజిక కోణం గుర్తుకురాలేదా? అని బండి ప్రశ్నించారు. నక్సల్స్ దురాగతాలవల్ల దాదాపు 50 వేల మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 9 వేల మంది పోలీసులు నక్సల్స్ తూటాలకు బలయ్యారని వాపోయారు. ఆపరేషన్ కగార్(Operation Kagar)ను ఆపే ప్రసక్తే లేదని, నక్సలైట్లను ఏరిపారేసే కార్యక్రమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. 2026 మార్చి నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించి ‘నక్సల్ ముక్త్ భారత్’ గా మార్చి తీరుతామని ఉద్ఘాటించారు.
రాజకీయాల్లోకి రాకుండా ఏబీవీపీలో ఫుల్ టైమర్ గా ఉంటూ సేవలందించాలని గతంలో భావించానని, విద్యార్థి సమస్యలపై పోరాడుతున్న తనపై అనేక కేసులుండటంతోనే రాజకీయాల్లోకి వచ్చి పోరాటాలు చేయాల్సి వచ్చిందన్నారు. యూపీఏ హయాంలో 200 జిల్లాలకు విస్తరించిన నక్సలిజం.. ప్రధాని మోడీ(Modhi) హయాంలో 12 జిల్లాలకే పరిమితమైందన్నారు. నక్సలిజం నరమేథంతో విద్య, ఆరోగ్యం, టెలికం, రవాణా రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆయన వివరించారు.
Also Read: Hyderabad Rains: భారీ వర్షాలు.. ఇందిరమ్మ టిఫిన్స్ కార్యక్రమం వాయిదా
నక్సలైట్లు ఉన్నచోటే పేదరికం
నక్సలైట్ల ఆగడాలు దారుణంగా ఉన్నా రాహుల్ గాంధీ(Rahu Gandhi), రేవంత్ రెడ్డి(Revanth Reddy), కేసీఆర్(KCR) వంటి వారు మాత్రం పేదరికం ఉన్నంత కాలం నక్సలిజం ఉంటుందని, వాళ్లతో చర్చలు జరపాలని, ఆపరేషన్ కగార్ నిలిపేయాలని మాట్లాడుతున్నారని బండి మండిపడ్డారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే నక్సలైట్లు ఉన్న చోటే అత్యధికంగా పేదరికం ఎందుకు ప్రబలిందని, నిజం చెప్పాలంటే నక్సలైట్లు ఉన్నచోటే పేదరికం, హింస ఎక్కువైందని యాన పేర్కొన్నారు. నక్సలిజం సామాజిక సమస్యగా చూడాలంటూ మానవ హక్కుల, పౌర హక్కుల సంఘం నాయకులు మాట్లాడటం ఆశ్చర్యమేస్తోందని ఆయన ఎద్దేవాచేశారు.
బాక్సైట్ తవ్వకం కోసమే చత్తీస్ గఢ్(Chhattisgarh) లో నక్సలైట్లను చంపుతున్నారని అర్బన్ నక్సలైట్లు కొందరు ఈ మధ్య విపరీతమైన దుష్ప్రచారం చేస్తున్నారని బండి ఫైరయ్యారు. గనుల తవ్వకాలు 1947 నుంచి జరుగుతున్నాయని, నక్సలిజం తీవ్రంగా ఉన్న సమయంలో కూడా తెలంగాణ((Telangana), చత్తీస్ గఢ్ ప్రాంతాల్లో గనుల తవ్వకాలు జరిగాయని ఆయన గుర్తుచేశారు. తాము బ్యాలెట్ తోనే సమాధానం చెప్పాలంటుంటే వాళ్లు మాత్రం బుల్లెట్ తో జవాబిస్తామంటున్నారన్నారు. ప్రజాస్వామ్యమనే ఒరలో బ్యాలెట్, బుల్లెట్ ఒకేచోట ఇమడలేవని సంజయ్ పేర్కొన్నారు.
Also Read: Bhatti Vikramarka: ఖమ్మంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆసక్తికర వ్యాఖ్యలు