TG Congress
Politics

Congress: కాంగ్రెస్ పాలనపై ఖర్గే రివ్యూ.. ఏం జరగనుంది?

  • వచ్చే నెల 4న హైదరాబాద్‌కు రాక
  • ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభ
  • హామీలు, గ్యారంటీలపై ముఖ్య నేతలతో చర్చ
  • ఈ నెల 30న సీఎల్పీ మీటింగ్
  • ఎజెండా, మినిట్స్ ప్రిపరేషన్
  • స్థానిక సంస్థలపై కూడా చర్చించే ఛాన్స్

Congress: కాంగ్రెస్ పాలనపై ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే రివ్యూ చేయనున్నారు. రాష్ట్రంలో గడిచిన 19 నెలల పాలనపై స్క్రీనింగ్ చేయనున్నారు. ఇచ్చిన హామీలు, గ్యారంటీల ఇంప్లిమెంటేషన్‌పై ఆరా తీయనున్నారు. ఈ మేరకు వచ్చే నెల 4న ఏఐసీసీ ప్రెసిడెంట్ హైదరాబాద్‌కు రానున్నట్లు సమాచారం. ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభకు కూడా పార్టీ ప్లాన్ చేస్తున్నది. ఆ మీటింగ్ తర్వాత రాష్ట్రంలోని ముఖ్యనేతలు, క్యాబినెట్ మంత్రులతో ఖర్గే ప్రత్యేకంగా మాట్లాడనున్నారు. ప్రభుత్వ పథకాల అమలు, మంత్రుల పనితీరు, ప్రజల నుంచి వస్తోన్న రెస్పాన్స్ వంటి విషయాలపై ఖర్గే అడిగి తెలుసుకోనున్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు తాజాగా ప్రకటించిన కమిటీల పని విభజన వంటి అంశాలపై కూడా చర్చించనున్నారు. దీనిలో భాగంగానే ఈనెల 30 సీఎల్పీ సమావేశం కూడా నిర్వహించే ఛాన్స్ ఉన్నది. ఆ మీటింగ్‌లో ఖర్గే టూర్ షెడ్యూల్, ఎజెండా, మినిట్స్, కార్యక్రమాలన్నీ ఫిక్స్ కానున్నట్లు పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత వెల్లడించారు.

నేడో, రేపో.. కార్పొరేషన్ చైర్మన్లు?

ఖర్గే మీటింగ్ కంటే ముందే కార్పొరేషన్ చైర్మన్ల ను ప్రకటించాలని పార్టీ నిర్ణయం తీసుకున్నది. నేడో, రే పో మరి కొన్ని కార్పొరేషన్ చైర్మన్ల జాబితాను ప్రకటించనునట్లు తెలిసింది. తొలి విడత 37 మందితో లిస్టు రిలీజ్ చేశారు. వాళ్లు పదవీ బాధ్యతలు స్వీకరించి దాదాపు ఏడాది కావొస్తుంది. పలు మార్లు రెండో జాబితా ప్రకటించాలని ప్రయత్నించినా, క్యాస్ట్, జిల్లా, పార్టీ ఈక్వేషన్స్ సెట్ కాక పెండింగ్‌లో ఉంచారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నందున వెంటనే ప్రకటించాలని ఇటీవల ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్​ మహేశ్​ కుమార్ గౌడ్‌కు ఆదేశాలిచ్చారు. ఇప్పటికే లిస్టు ఓకే చేసిన ప్రభుత్వం, అధికారిక ప్రకటనను విడుదల చేయనున్నది.

Read Also- Manchu Manoj: మనోజ్ సార్.. మీరు మారిపోయారు! లేకపోతే ఇదేంటి?

నేతలకు క్లాస్?

సమన్వయం లేక పార్టీలో నేతల మధ్య ఇంటర్నల్ ఇష్యూస్ పెరుగుతున్నాయి. దీని వలన పార్టీ బ్లేమ్ అవుతున్నది. ఇప్పటికే అనేక సార్లు ఏఐసీసీ నేతలు వార్నింగ్ లు ఇచ్చారు. పార్టీలోని అంతర్గత విషయాలను బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కానీ రిపీటెడ్ గా పార్టీలో కోల్డ్ వార్ లు కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో ఖర్గే ఈ అంశంపై కూడా చర్చించే ఛాన్స్ ఉన్నట్లు తెలిసింది. ఇటీవల ఉమ్మడి వరంగల్ లో జిల్లాలో కొండ ఫ్యామిలీ వ్యాఖ్యలపై ఖర్గే రిపోర్టు తెప్పించుకున్నట్లు తెలిసింది. దీంతో పాటు గతంలో మరి కొన్ని నియోజకవర్గాల్లోని ఇష్యూస్, క్రమ శిక్షణ కమిటీ గుర్తించిన సమస్య వంటి వాటిపై కూడా ఖర్గే డిస్కషన్ చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ నేతలు వివరిస్తున్నారు.

Read Also- Mohammed Siraj: సిరాజ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన దిగ్గజ మాజీ క్రికెటర్

Just In

01

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే