Manchu Manoj: మంచు మనోజ్‌పై కొందరు అభిమానులు చేస్తున్న కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఆ కామెంట్స్ ఏంటో తెలుసా? ‘మనోజ్ సార్.. మీరు పూర్తిగా మారిపోయారు సార్’ అంటూ ఒకటే కామెంట్స్. ఎందుకో తెలుసా? మొన్నటి వరకు అన్న విష్ణు (Vishnu Manchu) అంటే సముద్రంలో సునామీ వస్తే ఎలా ఉంటుందో.. అలా ఉప్పొంగిన మంచు మనోజ్.. ఇవాళ అన్న సినిమాను సపోర్ట్ చేస్తూ.. మీడియా మైకుల ముందు మాట్లాడుతున్న మాటలు విని అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇంత సడెన్‌గా ఈ మార్పు ఏంటి? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి కొన్ని రోజుల ముందు వరకు వారి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే వైరం ఉండేది. అది పోలీసు కేసుల వరకు వెళ్లింది. పబ్లిక్‌గా వారు దూషించుకునే స్థాయిలో వారి ఫ్యామిలీలో గొడవలు జరిగాయి. పోలీసులు వార్నింగ్‌లు కూడా ఇచ్చారు. ఆ సమయంలో ‘కన్నప్ప’ (Kannappa) సినిమాను కూడా టార్గెట్ చేస్తూ, మంచు మనోజ్ కామెంట్స్ చేశారు.
Also Read- Kannappa Review: ‘కన్నప్ప’ మూవీ జెన్యూన్ రివ్యూ
ముఖ్యంగా ‘శివయ్యా’ డైలాగ్‌పై ఆయన చేసిన కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి కూడా. ఆ తర్వాత కొన్ని రోజులుకే ఆయన మారిపోయాడు. అయితే అప్పుడు అన్న విష్ణు కోసం మారలేదు. ఆ సినిమాలో పెద్ద పెద్ద వాళ్లు నటిస్తున్నారు కాబట్టి, వారి కోసం ఇకపై సినిమాను టార్గెట్ చేయను అని వివరణ కూడా ఇచ్చాడు. ఇప్పుడు విడుదల రోజే సినిమా చూసి, కన్నీళ్లు పెట్టుకుని మరీ అన్నకు జై కొడుతున్నాడు. ఇంతకీ మంచు మనోజ్ ఏమన్నాడంటే..
కన్నప్ప వెయి రేట్లు బాగుంది – మంచు మనోజ్ #KannappaMovie #KannappaReview #ManchuManoj #VishnuManchu #MohanBabu #Prabhas𓃵 #BIGTVCinema @HeroManoj1 @iVishnuManchu @themohanbabu @kannappamovie pic.twitter.com/xX7I3F0hH0
— BIG TV Cinema (@BigtvCinema) June 27, 2025
‘‘సినిమా చాలా బాగుంది. ఇలా ఉంటుందని అస్సలు ఊహించలేదు. ముఖ్యంగా చివరి 20 నిమిషాలు ప్రభాస్ అన్న, అలాగే అన్న కూడా యాక్టింగ్ ఇరగ దీశారు. ఇంతా బాగా చేస్తారని అస్సలు ఊహించలేదు. నాన్న యాక్టింగ్ గురించి నేను చెప్పేటంతడి వాడిని కాదు. చివరి 20 నిమిషాలు కళ్లలో నీళ్లు వచ్చేశాయి. ప్రభాస్ అన్న ఎంటరైన తర్వాత సినిమా నెక్ట్స్ లెవల్‌కి వెళుతుంది. ప్రతి పాత్ర చాలా అద్భుతంగా చేశారు. నేను అనుకున్నదానికంటే 1000 రెట్లు సినిమా బాగుంది. ఈ సినిమా కోసం ఇంతగా ఎఫర్ట్ పెట్టిన అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని, సినిమాకు పెట్టిన డబ్బు వెయ్యింతలు తిరిగి రావాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను..’’ అంటూ మంచు మనోజ్ మీడియా మైకుల ముందు చెప్పుకొచ్చారు.
మంచు మనోజ్ మాట్లాడుతున్న ఈ వీడియోను రిపీటెడ్ మోడ్‌లో సోషల్ మీడియా దంచుతుంది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని అంటుంటారు. ఆ డైలాగ్ మంచు ఫ్యామిలీకి కూడా వర్తిస్తుందని కొందరు ఈ వీడియోలకు కామెంట్స్ చేస్తుండటం విశేషం. నిజమే మరి, ఫ్యామిలీ అన్న తర్వాత చిన్న చిన్న గొడవలు జరగడం సహజం.. కొన్నాళ్లకు మళ్లీ కలిసిపోవడం కూడా కామనే. మరి వీరి కలయిక ఈ సినిమా వరకేనా? అసలు మ్యాటర్ అలాగే ఉందా? అనేది ఇంకొన్ని రోజులు పోతే కానీ తెలియదు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు