Aadi Srinivas Slams KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR) వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తీవ్రంగా స్పందించారు. సోమవారం సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, ‘నువ్వు యువరాజుగా ఉన్నప్పుడే నీ మెజారిటీ 89 వేల నుంచి 27 వేలకు దిగజారింది. 2009లో కేటీఆర్ నువ్వు గెలిచింది కేవలం 175 ఓట్ల తేడాతో అది మరిచిపోకు. మీ సొంత చెల్లి మీ పార్టీని వదిలిపోయారు. కవిత కామెంట్స్‌కు కనీసం సమాధానం చెప్పుకోలేకపోతున్నారు. రూ.8లక్షల కోట్ల అప్పుతో రాష్ట్రాన్ని పెట్టిపోయావు. మీరు పదేళ్ళలో పది రేషన్ కార్డులు ఇవ్వలేదు. వేములవాడ మార్కెట్ కమిటీ ఛైర్మన్ గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే, చంపడానికి యత్నిస్తున్న మీరు హత్యా రాజకీయాల గూర్చి మాట్లాడతారా? దళిత నాయకునిపై దాడి చేసింది. మీ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందనే అక్కసుతో కదా కేటీఆర్?’ అని ప్రశ్నించారు.
Also Read: KTR: పోగు బంధంతో ఫోన్ బంధం.. సిరిసిల్ల నేతన్న అద్భుత సృష్టి..!
పేర్లు చెబుతావా?
రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఖతం అయ్యిందని పేర్కొన్నారు. సిరిసిల్ల జిల్లాలో మొదటి, రెండవ విడతల్లో బీఆర్ఎస్ ఓడిపోయిందని, కేటీఆర్ కేవలం పరువు కోసం, మూడో విడత ప్రచారం కోసమే ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారని విమర్శించారు. ‘జిల్లాలో 83 సీట్లు గెలిచామని గొప్పలు చెప్పుకుంటున్నారు. జిల్లాలో 80 దాటలేదు 60 దగ్గరే బీఆర్ఎస్ ఆగింది. 83 సీట్లు గెలిచినట్లయితే, పేర్లు చెప్తావా కేటీఆర్? ఎన్నికల్లో గెలువలేక తప్పుడు అంకెల గారడీతో కేటీఆర్ పరువు నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. రెండు విడతల్లో రాష్ట్రంలో, జిల్లాలో కాంగ్రెస్ దే హవా. మొదటి, రెండో దశల్లో కాంగ్రెస్ మెజారిటీ స్థానాలు సాధించింది. మూడవ దశలో కూడా మేమే మెజారిటీ స్థానాలు సాధిస్తాం. కాంగ్రెస్ ద్వారానే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని, రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీని ప్రజలు ఆశీర్వదిస్తుంటే కేటీఆర్ చూస్తూ ఓర్వలేక పోతున్నారు’ అని ఆది వెల్లడించారు.
Also Read: KTR: రైతు ప్రయోజనాలే పునాదిగా నూతన బిల్లు ఉండాలి.. కేంద్ర ప్రభుత్వానికి కేటీఆర్ సూచనలు!

