KTR: పోగు బంధంతో ఫోన్ బంధం.. సిరిసిల్ల నేతన్న అద్భుత సృష్టి..!
KTR (imagecredit:swetcha)
Telangana News

KTR: పోగు బంధంతో ఫోన్ బంధం.. సిరిసిల్ల నేతన్న అద్భుత సృష్టి..!

KTR: సిరిసిల్ల నేతన్నల నైపుణ్యం మరోసారి ప్రపంచానికి తెలిసింది. సాంకేతికతను, మగ్గాన్ని జోడించి సిరిసిల్లకు చెందిన ప్రముఖ నేతన్న నల్ల విజయ్ కుమార్(Nalla Vijay Kumar) రూపొందించిన ‘క్యూఆర్ కోడ్’(QR code) శాలువాను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) శనివారం తన నంది నగర్ నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ ప్రతిభను కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు.

శాలువా ప్రత్యేకతలు

“పోగు బంధంతో ఫోన్ బంధం” అనే కాన్సెప్ట్‌తో ఈ శాలువాను రూపొందించారు. శాలువాపై నేసిన క్యూఆర్ కోడ్‌ను మొబైల్ ఫోన్(Mobile Phone)‌తో స్కాన్ చేయగానే తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ప్రముఖ దేవాలయాలు, చారిత్రక కట్టడాలు మనకు కనిపిస్తాయి. అంతేకాకుండా, కేసీఆర్(KCR) హయాంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టుల గొప్పతనాన్ని, యాదాద్రి ఆలయ వైభవాన్ని తెలిపేలా ఈ కోడ్‌ను తీర్చిదిద్దారు. కేవలం 15 రోజుల వ్యవధిలో ఇంతటి అద్భుతమైన శాలువాను విజయ్ కుమార్(Vijay Kumar) రూపొందించడం విశేషం.

Also Read: Fake Journalists: ఫ్లయింగ్ స్క్వాడ్ ముసుగులో బలవంతపు వసూళ్లు.. సిగ్నేచర్ స్టూడియో యాంకర్ అరెస్ట్!

ఆలోచనతోనే ఈ క్యూఆర్ కోడ్

నేతన్న నల్ల విజయ్ కుమార్ మాట్లాడుతూ.. “మా నాన్న గతంలో అగ్గిపెట్టెలో పట్టే చీరను తయారు చేశారు. ఆయనే నాకు స్ఫూర్తి. గతంలో నేను రంగులు మారే చీరను, అగ్గిపెట్టెలో పట్టే చీరను తయారు చేసినప్పుడు, అప్పటి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఉగాది పురస్కారం అందుకోవడం నా అదృష్టం. కేసీఆర్ తెలంగాణ(Telangana)కు చేసిన అభివృద్ధిని, మన వారసత్వ సంపదను పదిమందికి తెలియజేయాలనే ఆలోచనతోనే ఈ క్యూఆర్ కోడ్ శాలువాను రూపొందించాను. సిరిసిల్ల ఎప్పుడూ కొత్త ఆవిష్కరణలకు అడ్డా అని నిరూపించడమే నా లక్ష్యం,” అని తెలిపారు.ఈ అద్భుత ఆవిష్కరణను కేటీఆర్ ద్వారా కేసీఆర్ కి అందించాలనే తన కోరికను విజయ్ వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన కేటీఆర్, తప్పకుండా ఈ శాలువాను కేసీఆర్ గారికి అందజేస్తానని హామీ ఇచ్చారు. నేతన్నలకు కేటీఆర్ ఎల్లప్పుడూ అండగా ఉంటూ ప్రోత్సహిస్తున్నారని, భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలు సృష్టిస్తామని విజయ్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర(Vaddiraju Ravichandra), పార్టీ జనరల్ సెక్రటరీ రావుల చంద్రశేఖర్ రెడ్డి, సీనియర్ నాయకులు జాన్సన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Also Read: Telangana DGP: ఉప్పల్‌లో సీఎం – మెస్సీ మ్యాచ్.. కీలక సూచనలు చేసిన డీజీపీ శివధర్ రెడ్డి

Just In

01

Panchayat Elections: ఓట్ల పండుగకు పోటెత్తుతున్న ఓటర్లు.. పల్లెల్లో రాజకీయ వాతావరణం

Dandora Movie: శివాజీ ‘దండోరా’ సినిమా నుంచి టైటిల్ సాంగ్ విడుదలైంది.. చూశారా మరి..

Akhil Vishwanath: కేరళ స్టేట్ అవార్డు నటుడు అఖిల్ విశ్వనాథ్ కన్నుమూత.. 30 ఏళ్లకే..

Prof Kodandaram: విత్తన ధృవీకరణ జరిగితేనే రైతుకు నాణ్యమైన విత్తనం: ప్రొఫెసర్ కోదండరాం

SP Balasubrahmanyam: రేపే ఎస్ పి. బాల సుబ్రహ్మణ్యం విగ్రహం ఆవిష్కరణ.. ముఖ్య అతిథిగా..!