Kiran Kumar Reddy: పదేళ్ల లో ఆటోడ్రైవర్లను పట్టించుకొని కేటీఆర్.. ఇప్పుడు కొత్త అవతారం ఎత్తుకొని ఆటోల్లో ఎన్నికల ప్రచారం చేస్తున్నాడని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(MP Chamala Kiran Kumar Reddy) ఫైర్ అయ్యారు. ఆయన గాంధీభవన్ లో మాట్లాడుతూ.. గడిచిన 10 ఏళ్ళ లో బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం ఆటోడ్రైవర్లపై దాదాపు రూ. 42 కోట్ల రూపాయల చలాన్లు విధించారన్నారు. ఇది దారుణమన్నారు. ఎన్నికల సమయంలో నాటకాలు చేస్తున్నాడని మండిపడ్డారు. ఇక ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళల పై వంటిటి భారం తగ్గించేందుకు గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించామన్నారు. మహిళల కు ఆర్టీసీ బస్(RTC) ఉచిత ప్రయాణం అందిస్తున్నామన్నారు. 10 ఏళ్ళ పాలన తరువాత తెలంగాణ(Telangana) రాష్ట్రం పూర్తిగా చీకటి అయ్యిందని బీఆర్ఎస్(BRS) పార్టీ నేతలు అంటుంటే విడ్డురంగా ఉన్నదన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సన్న బియ్యం అందించిన ఘనత కాంగ్రెస్ దే నని చెప్పారు. ఇందిరమ్మ ఆసరా పెన్షన్లు, ఉద్యోగాలు, కబ్జాలు కాపాడటం, వంటివన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జరుగుతున్నాయన్నారు. చెరువులు కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టిందన్నారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పులు పాలు చేసి నాశనం చేశారన్నారు. కాంగ్రెస్ సర్కార్ ఒక్కో వ్యవస్థను చక్కదిద్దుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి ఉన్నారు.
కేటీఆర్ పై బండి సుధాకర్ గౌడ్ ఫైర్
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు ఆకాశంలోనివిమానాల్లో విహరించిన ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఇవాళ అధికారం పోగానే ఆటోల్లో తిరగడం, ఆటో డ్రైవర్ల గురించి మాట్లాడటం హాస్యాస్పదమని టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా రహమత్ నగర్ న్యూటన్ పబ్లిక్ స్కూల్ ప్రాంతంలోని వాడవాడలా ఆయన ఇంటింటి ప్రచారం చేశారు. ఈ ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఎన్నికల సమయంలో వాగ్దానం చేసిందన్నారు. ఇందులో భాగంగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించి, విజయవంతంగా అమలు చేస్తున్నారన్నారు. పేద మహిళలకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారిందని, ప్రభుత్వానికి మంచిపేరు వస్తున్నదన్నారు. అదేవిధంగా బడుగు, బలహీన వర్గాల పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, సన్నబియ్యం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, సబ్సిడీపై గ్యాస్ సిలిండర్లు తదితర అనేక సంక్షేమ పథకాలను సక్సెస్ ఫుల్ గా అమలు చేస్తుంటే, చూసి ఓర్వలేని ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని బండి సుధాకర్ గౌడ్ పేర్కొన్నారు.
Also Read: Huzurabad: హుజూరాబాద్‌లో కాంగ్రెస్ నేత సుడిగాలి పర్యటన.. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
బీఆర్ఎస్ హయాంలో..
సంక్షేమం అంటేనే కాంగ్రెస్ పార్టీ… కాంగ్రెస్ పార్టీ అంటే విలువల కోసం, ఇచ్చిన మాట కోసం పనిచేసే ప్రభుత్వం అని ప్రతిపక్షాలు గుర్తెరిగి మాట్లాడాలని ఆయన హితవు పలికారు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసి, దండుపాళ్యం బ్యాచ్ లాగా దోచుకొని, దాచుకున్న ఘనత కేటీఆర్ కుటుంబానిదేనన్నారు. ప్రజల బాగు కోసం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ఓట్లు వేసి, భారీ మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత ఈ నియోజకవర్గ ప్రజలపైనే ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీపై, ప్రభుత్వంపై అవాకులు, చెవాకులు పేలుతున్న బీఆర్ఎస్, బీజేపీ నాయకులకు ప్రజలు తమ ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని బండి సుధాకర్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈ ఇంటింటి ప్రచారంలో ఆయన వెంట ప్రముఖ సంఘ సేవకులు పీటర్ పాల్, మౌనిక, శ్యాం, బండి జగదీశ్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: Fake VRA: తహసిల్దార్ కార్యాలయంలో ఫేక్ ఉద్యోగి.. ఇతడెవరో?
