Volodymyr-Zelenskyy
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Zelensky: భారత్‌పై ట్రంప్ విధించిన సుంకాలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తొలిసారి స్పందన

Zelensky: భారత వస్తువులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన వాణిజ్య సుంకాలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Zelensky) తొలిసారి స్పందించారు. రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై సుంకాలు విధించడాన్ని ఆయన సమర్థించారు. ఈ చర్యను ‘సరైన ఆలోచన’గా ఆయన వ్యాఖ్యానించారు. రష్యా చేస్తున్న ఇంధన వాణిజ్యం.. ఉక్రెయిన్‌పై పుతిన్ ప్రయోగిస్తున్న ఆయుధమని ఆయన అభివర్ణించారు. రష్యాతో ఒప్పందాలు కుదుర్చుకొని ఇంధన కొనుగోలు కొనసాగిస్తున్న దేశాలపై సుంకాలు విధించడం సరైన ఆలోచనగా తాను భావిస్తున్నానని ఆయన అన్నారు. అందుకే, రష్యా ఎగుమతులను నిలిపివేయాల్సిన అవసరం ఉందని జెలెన్‌స్కీ పేర్కొన్నారు. ఇటీవల ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చైనాలో భేటీ కావడంపై ప్రశ్నించగా ఆయన ఈ విధంగా స్పందించారు. ఈ మేరకు అమెరికా మీడియా సంస్థ ‘ఏబీసీ’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో జెలెన్‌స్కీ మాట్లాడారు.

Read Also- Vande Bharat Sleeper Train: కళ్లు చెదిరే సౌకర్యాలతో.. వందే భారత్ స్లీపర్ రైలు.. పండగే పండగ!

యూరోపియన్ దేశాలపైనా మండిపాటు

రష్యాతో వాణిజ్య సంబంధాలు ఇంకా కొనసాగిస్తున్న యూరోపియన్ భాగస్వామ్య దేశాలపై కూడా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మండిపడ్డారు. ‘‘ మనమంతా కలిసి పుతిన్‌పై మరింత ఒత్తిడి పెంచాలి. అమెరికా వైపు నుంచి ఒత్తిడి పెరగాల్సిన అవసరం ఉంది. యూరోపియన్ దేశాల విషయంలో ట్రంప్ సరైన విధానంలో వ్యవహరిస్తున్నారని భావిస్తున్నాను. భాగస్వాములు అందరికీ రుణపడి ఉంటాను. అయితే, కొన్ని దేశాలు ఇంకా రష్యాతో వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తున్నాయి. ముడిచమురు, గ్యాస్‌ను కొనుగోలు చేస్తున్నాయి. ఇది సబబు కాదు. రష్యా నుంచి ఎలాంటి ఇంధనాన్నీ కొనుగోలు చేయకూడదు. రష్యాతో ఇంకా వాణిజ్యాన్ని కొనసాగిస్తున్న దేశాలపై సుంకాల విధింపు సరైన నిర్ణయమేనని నేను భావిస్తున్నాను. ఆ హంతకుడిని ఆపాలంటే ఇదొక్కటే మార్గం. అతడిని (పుతిన్) ఆపివేయాలి, అంటే, ఆయుధాన్ని లేకుండా చేయాలి. ఇంధనమే అతడి ఆయుధం’’ అని జెలెన్‌స్కీ వ్యాఖ్యానించారు.

Read Also- All India Prison Duty Meet 2025: తెలంగాణలో ఆలిండియా ప్రిజన్​ డ్యూటీ మీట్.. ఎప్పుడంటే..?

కాగా, రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నారనే కారణాన్ని చూపుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత్ వస్తువులపై సుంకాలను 25 శాతం నుంచి ఏకంగా 50 శాతానికి పెంచారు. అమెరికా విధించిన ఈ సుంకాలు అన్యాయమైనవని, అసంబద్ధమైనవని భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉక్రెయిన్ యుద్ధాన్ని చర్చల ద్వారా ముగించాలని భారత్ పదేపదే సూచన చేస్తున్నప్పటికీ, భారత్‌పై సుంకాలు విధించడం ద్వారా రష్యాను దారికి తెచ్చుకోవచ్చనే ఉద్దేశంతో డొనాల్డ్ ట్రంప్ వ్యూహంతో ఈ సుంకాలు విధించారు. అయితే, రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు చేస్తున్న ఇతర దేశాలపై ఎలాంటి సుంకాలూ విధించలేదు. యూరోపియన్ దేశాలు, స్వయంగా అమెరికా కూడా రష్యాతో వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తున్నాయి. ఆ దేశాలపై ఎలాంటి ఆంక్షలు విధించని ట్రంప్, కేవలం భారత వస్తువులపై సుంకాలను 50 శాతానికి పెంచారు. ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్‌ ఇటీవల ఒక మీడియా సమావేశంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో సంబంధాలు ఎప్పటికీ ప్రత్యేకమేనని, ఈ విషయంలో ఎలాంటి ఢోకా ఉండబోదని వ్యాఖ్యానించారు.

Just In

01

Wanaparthy Police: వనపర్తిలో పోలీస్ విభాగం ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ప్రారంభం

RBI Grade B Recruitment 2025: RBI‌ లో ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు..

Mana Shankara Vara Prasad Garu: చిరు, నయన్ పాటేసుకుంటున్నారు.. తాజా అప్డేట్ ఇదే!

Viral Video: ఏనుగులనే హడలెత్తించిన.. డాడీ లిటిల్ ప్రిన్సెస్.. మీకో దండం తల్లి!

Chris Gayle: పంజాబ్ కింగ్స్ జట్టుపై క్రిస్ గేల్ సంచలన ఆరోపణలు