Karnataka Crime: ఒకప్పుడు భార్య భర్తలంటే అనోన్య దాంపత్యానికి, బంధాలు, అనుబంధాలకు కేరాఫ్ గా కనిపించేవారు. జీవితంలో ఎన్ని కష్టాలు, అవరోధాలు ఎదురైన ఒకరికొకరు భరోసా కల్పించుకుంటూ ముందుకు సాగేవారు. అయితే ప్రస్తుత రోజుల్లో కొందరు చేస్తున్న పనులు.. వివాహ బంధానికి మాయన మచ్చలా మారిపోతున్నారు. అక్రమ సంబంధాల కారణంగా భర్తను భార్య.. భార్యను భర్త చంపుకుంటున్న ఘటనలు ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయాయి. ముఖ్యంగా భార్యలు కట్టుకున్న భర్తలను కడతేరుస్తున్నారు. మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ కేసు కొనసాగుతున్న క్రమంలోనే దేశంలో మరో సంచలనం చోటుచేసుకుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం.
వివరాల్లోకి వెళ్తే
కర్ణాటక రాజధాని బెంగళూరులో ఓ భార్య రెచ్చిపోయింది. అక్రమ సంబంధానికి కుటుంబం అడ్డుగా ఉందని భావించి వారిని అడ్డుతొలగించుకోవాలని అనుకుంది. బెలూర్ ప్రాంతంలో నివసిస్తున్న గజేంద్ర, చైత్ర భార్య భర్తలు. 11 ఏళ్ల క్రితం వారికి వివాహం కాగా.. ఇద్దరు కుమారులు. అయితే ఆమెకు స్థానికంగా ఉండే శివు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే వారి బంధానికి భర్త, పిల్లలు అడ్డుగా ఉన్నారని చైత్ర భావించింది.
ఆహారంలో విష మాత్రలు
ఈ క్రమంలో ప్రియుడు శివుతో కలిసి వారిని ఎలాగైన అడ్డు తొలగించుకోవాలని భావించింది. ఇందులో భాగంగా కుటుంబానికి పెట్టే ఆహారంలో తక్కువ డోసుతో విషపూరిత మాత్రలు కలపడం ప్రారంభించింది. అయితే ఇది గమనించిన భర్త గజేంద్ర.. అప్రమత్తమయ్యాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు.. చైత్రను అదుపులోకి తీసుకొని విచారించగా హత్యకు సంబంధించిన ప్లాన్ మెుత్తం బయటపడింది. అయితే గజేంద్ర – చైత్ర వైవాహిక బంధంలో గత మూడేళ్లుగా తరుచూ గొడవలు జరుగుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
తొలుత ఒకరు.. తర్వాత మరొకరు
గజేంద్రతో మనస్పర్థలు తలెత్తడంతో వారి వైవాహ బంధం కీణించిందని పోలీసులు తెలిపారు. దీంతో తొలుత ఆమె పునీత్ అనే వ్యక్తితో రిలేషన్ ఏర్పాటు చేసుకుందని స్పష్టం చేశారు. ఈ విషయం గజేంద్ర తెలుసుకొని తన అత్త, మామల దృష్టికి తీసుకెళ్లగా వారు చైత్రను మందలించారు. వారి మధ్య వివాదాన్ని పరిష్కరించే ప్రయత్నం చేశారు. అయితే ఆ తర్వాత ఆమె బేలూర్ నివాసి శివుతో మరో ప్రేమ బంధాన్ని ప్రారంభించిందని పోలీసుల విచారణలో తేలింది. శివుతో బంధం గురించి భర్తకు తెలుస్తుందన్న భయంతోనే గజేంద్రతో పాటు తన ఇద్దరు పిల్లలను అడ్డుతొలగించుకోవాలని ఆమె నిర్ణయించుకుంది. భార్య మాస్టర్ ప్లాన్ ను గజేంద్ర గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది.
Also Read: New Ministers Portfolios: కొత్త మంత్రులకు శాఖలు కేటాయింపు.. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
జాలీ జోసెఫ్ కేసు తరహాలోనే
కేరళలో జరిగిన సైనేడ్ కిల్లర్ కేసుకు.. ప్రస్తుతం కర్టాటకలో జరిగిన కేసుకు మధ్య సారుప్యతను గమనించవచ్చు. కోజీకోడ్ కు చెందిన నిందితురాలు జాలీ జోసెఫ్ 14 సంవత్సరాల వ్యవధిలో తన మెుదటి భర్త రాయ్ థామస్, ఆయన తల్లితండ్రులతో సహా అదే కుటుంబానికి చెందిన మొత్తం ఆరుగురిని సైనేడ్ ఉపయోగించి హత్యచేసిందని ఆరోపణలు ఉన్నాయి. మృతిచెందిన వారిలో రెండు సంవత్సరాల చిన్నారి కూడా ఉంది. కుటుంబానికి వడ్డించే ఆహారంలో సైనేడ్ కలిపి ఇవ్వడం ద్వారా ఆమె ఈ దారుణానికి ఒడిగట్టింది.