New Ministers Portfolios: తెలంగాణలో కొద్ది రోజులుగా సాగుతున్న ఉత్కంఠ వీడింది. కొత్త మంత్రుల శాఖలు ఏంటో తెలిసిపోయింది. ఢిల్లీ స్థాయిలో చర్చల తర్వాత ఎట్టకేలకు కొత్త మంత్రులకు ప్రభుత్వం శాఖలను కేటాయించింది. ఈ మేరకు సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు ఇచ్చారు. గడ్డం వివేక్‌కు కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారం, మైనింగ్ అండ్ జియాలజీ, అడ్లూరి లక్ష్మణ్‌కు ఎస్సీ డెవలప్ మెంట్, ట్రైబల్ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్‌తో పాటు దివ్యాంగులు, వయో వృద్ధుల శాఖలను కేటాయించింది. ఇక, వాకిటి శ్రీహరికి పశు సంవర్ధక శాఖ, డెయిరీ డెవలప్‌మెంట్, ఫిషరీస్, స్పోర్ట్స్ అండ్ యూత్ సర్వీసెస్ శాఖలను కేటాయించారు. వీళ్లంతా ఫస్ట్ టైమ్ మంత్రులు కావడంతో సీఎం వద్ద ఉన్న కీలక శాఖలేవీ కేటాయించలేదు.
Also Read: Niharika Konidela: బిగ్ షాక్.. గోరింటాకు, మల్లె పూలతో నిహారిక స్టోరీ.. సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకుందా?
అయితే, ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా తన దగ్గర ఉన్న శాఖలనే కొత్త మంత్రులకు ఇస్తామని రేవంత్ అన్నారు. హైదరాబాద్ వెళ్లగానే అందరితో సంప్రదించి కేటాయింపు ప్రకటన ఉంటుందని చెప్పారు. మంత్రుల శాఖల మార్పులు, చేర్పులపై తాను ఒక్కడినే అధిష్టానంతో చర్చించి నిర్ణయం తీసుకోలేనని, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ లేకుండా నిర్ణయం ఎలా తీసుకుంటామని వ్యాఖ్యానించారు. కానీ, సీఎం చెప్పినట్టుగా కొత్త మంత్రులకు ఆయన దగ్గర ఉన్న శాఖలను కేటాయించలేదు.