June 6th Holiday: కేంద్రం ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు దేశవ్యాప్తంగా ప్రచారం జరుగుతోంది. జూన్ 6న పబ్లిక్ హాలీడేగా మోదీ సర్కార్ ప్రకటించినట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ముస్లింలకు అత్యంత పవిత్రమైన బక్రీద్ సందర్భంగా ఈ హాలీడేను ప్రకటించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అయితే ప్రభుత్వ వర్గాల నుంచి మాత్రం దీని గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడం గమనార్హం.
ఆ రాష్ట్రాల్లో రేపు సెలవు?
బక్రీద్ సందర్భంగా జూన్ 6న పలు రాష్ట్రాలకు పబ్లిక్ హాలీడే కేంద్రం ప్రకటించినట్లు వార్తలు వస్తున్నాయి. ఫలితంగా దేశంలోని ఢిల్లీ, మహారాష్ట్ర, ఒడిశా, మధ్య ప్రదేశ్, ఛత్తీస్ గఢ్, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో రేపు ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు మూత పడతాయని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే కేంద్రంతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ధ్రువీకరించకపోవడం సందేహాలకు తావిస్తోంది.
The Government of India has announced that Friday, June 6, 2025, will be a national public holiday. This holiday applies to central government offices and most Indian states, including Delhi, Maharashtra, Odisha, Madhya Pradesh, Chhattisgarh, Punjab, Rajasthan, Telangana, Andhra pic.twitter.com/fFbVby7MBl
— The Media Times (@themediatimes_) June 5, 2025
సెలవుల్లో కన్ఫ్యూజన్!
వాస్తవానికి కేంద్రం సహా రెండు తెలుగు రాష్ట్రాలు జూన్ 7ను పబ్లిక్ హాలీడే కింద ప్రకటించాయి. అయితే తాజాగా జూన్ 6 కూడా సెలవు అని ప్రచారం జరుగుతుండటం గందరగోళానికి దారి తీస్తోంది. ఇందుకు ఓ బలమైన కారణమే ఉంది. నిజానికి కేరళలోని కొచ్చి, తిరువనంతపురం ప్రాంతాల్లో జూన్ 6ను సెలవు దినంగా ప్రకటించారు. అటు గుజరాత్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోనూ జూన్ 6న బ్యాంకులకు సెలవులు ఇచ్చారు. జూన్ 6 సాయంత్రం నుంచి పండగ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. స్థానిక సెలవులు ప్రాంతాలు, రాష్ట్రాన్ని బట్టి మారే ఛాన్స్ ఉంది.
Also Read: Gold Rate ( 05-06-2025) : గోల్డ్ ప్రియులకు షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్
వరుసగా 3 రోజులు సెలవు!
తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే మాత్రం జూన్ 7న బక్రీద్ హాలీడేను ప్రకటించారు. అయితే ఇక్కడి మస్లింలు ఈద్ పండుగలకు సౌదీ అరేబియా చంద్ర దర్శనాన్ని పరిగణలోకి తీసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆ ప్రకారం చూస్తే సౌదీలో జూన్ 6న చంద్ర దర్శనం జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన చూస్తే రెండు తెలుగు రాష్ట్రాలు తమ మనసు మార్చుకొని రేపు కూడా బక్రీద్ హాలీడే ప్రకటించే అవకాశం లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే వరుసగా మూడ్రోజులు (శుక్ర, శని, ఆది) సెలవులు రానున్నాయి.