Madhya Pradesh News: మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. కిడ్నాప్ కు గురైన ఓ వ్యక్తిని కాపాడేందుకు వెళ్లి అనంతరం జరిగిన మూక దాడిలో ఇద్దరు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. గిరిజనుల గుంపు ఒక్కసారిగా పోలీసు బృందంపై దాడి చేయడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
అసలేం జరిగింది?
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ కు సుమారు 600 కి.మీల దూరంలో ఉన్న మౌగంజ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. గాద్రా అనే గ్రామంలో కొంతమంది గిరిజనులు ఓ వ్యక్తిని అపహరించి అతనిపై దాడి చేసి చంపేశారు. ఆ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు వెళ్లగా వందల సంఖ్యలో ఉన్న గిరిజనులు పోలీసులు ఓ గదిలో బంధించారు. ఆ గది చుట్టుముట్టారు. దీంతో పోలీసులు వారిని నిగ్రహించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తీవ్ర ఘర్షణలు చెలరేగి ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఏఎస్ఐ రామ్ చరణ్ గౌతమ్ తో పాటు మరో పోలీస్ మరణించారు.
కిడ్నాప్.. రెస్క్యూ
గిరిజనులు కిడ్నాప్ చేసిన వ్యక్తి పేరు సందీప్ ద్వివేది. అతణ్ని పోలీసులు ఎందుకు కిడ్నాప్ చేసి చంపేశారంటే.. అతను కొద్ది నెలల ముందు అశోక్ కుమార్ అనే గిరిజనుణ్ని చంపేశాడని ఆరోపణలు వున్నాయి. కానీ పోలీసు రికార్డ్స్ లో మాత్రం అతను రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు ఉంది. కాగా, సందీప్ ద్వీవేది కిడ్నాప్ వార్త తెలుసుకున్న షాపూర్ పోలీసులు అతన్ని కాపాడేందుకు రెస్క్యూకు వెళ్లారు. ఆ క్రమంలోనే గిరిజనులు పెద్ద ఎత్తున పోలీసు చర్యలని ప్రతిఘటించారని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. దాడి చేసిన వారు కోల్ ట్రైబ్ కు చెందిన వారుగా తెలుస్తోంది.
విధి నిర్వహణలో భాగంగా వెళ్లిన పోలీస్ అధికారులు మరణిచండం తీవ్ర కలకలం రేపుతోంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రాథమికంగా జరిగిన విషయాలను పరిశీలిస్తే… కిడ్నాప్ చేసిన వ్యక్తి పట్ల గిరిజనులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అతను తమలో ఒకడ్ని చంపినట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి కోపం ఉండటం సహాజమే. కానీ ఆసక్తికర విషయం ఏంటంటే.. పోలీసుల రికార్డ్స్ లో అతను రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు ఉండటం అనుమానాలకు తావిస్తోంది. పోలీసుల పాత్రపై అనుమానం కలగక మానదు. బహుశా గిరిజనుల దాడిలో చనిపోయిన సందీప్ బాగా డబ్బున్న వ్యక్తి అయిన అయ్యుండాలి. లేదా రాజకీయ నేపథ్యం కలిగిన వాడైన అయి ఉండాలి.
Also Read: