ts-car
జాతీయం

Ts Car Kumbamela: కుంభమేళాలో టీఎస్ కారు; అది నాదే … వైరల్ చేయకండి ప్లీజ్

Ts Car Kumbamela: యూపీలోని ప్రయాగ్ రాజ్ లో కుంభమేళాకు వచ్చే భక్తుల కోసం ఏర్పాటు చేసిన పార్కింగ్ ఏరియాలో తెలంగాణ నెంబర్ ప్లేట్ తో ఉన్న మహీంద్రా ఎక్స్ యూవీ 700 మోడల్ కు చెందిన కారు… నెంబరు “TS 15 FJ 2528” గత తొమ్మిది రోజులుగా అక్కడే ఉంటోందంటూ ఉదయం నుంచి సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ మారిన సంగతి తెలిసిందే. అయితే, కారును కావాలనే అక్కడ వదిలేశారా? లేదా పార్క్ చేసి పొరపాటున మర్చిపోయారా? అసలు మ్యాటరు ఏమై ఉంటుందా అని అందరూ తెగ ఆలోచించేస్తున్నారు. మరోవైపు యజమాని దృష్టికి వెళ్లేవరకు ప్రతీ ఒక్కరూ షేర్ చేయాలని కోరుతూ కారుకు సంబంధించిన దృశ్యాలను నెటిజన్లు తెగ వైరల్ చేసేశారు.

 

దీంతో… తెలంగాణకు చెందిన ఆ కారు ఓనర్ ఎవరై ఉంటారు? దాన్ని ఇన్ని రోజులుగా అక్కడ ఎందుకు వదిలేశారు? లాంటి ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. రిజిస్ట్రేషన్ నెంబరు ఆధారంగా వాహనం సంగారెడ్డికి చెందిన ఓ వ్యక్తిదని,  యజమాని పేరు సాకేత్ ప్రకాశ్ వాగ్ గా ప్రయాగ్ రాజ్ పోలీసులు గుర్తించారని వార్తలు వచ్చాయి. అంతేగాదు బండి మీద ఇటీవలే గచ్చిబౌలిలో ఓవర్ స్పీడ్ కారణంగా ఫైన్ పడినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే, ప్రస్తుతం ఆ మిస్టరీకి తెరపడింది.

ఆ కారు తనదేనని, అది తన వద్దే ఉన్నదని సదరు యజమాని సాకేత్ ప్రకాష్ వాగ్ తెలిపాడు. ఈ మేరకు వీడియో రిలీజ్ చేశాడు. నమ్మబుద్ది కావడం లేదా అంటూ… ఆ కారు తన ఇంటి వద్ద ఉన్న ఫోటోను కూడా షేర్ చేాశాడు. ఇక, తన కారు వీడియోను మరింత వైరల్ గా మార్చొద్దని, ఇంతటితో ఆపాలని ప్రాధేయ పడ్డాడు.

కుంభమేళా పుణ్యస్నానం కోసం కొన్ని రోజుల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాగ్‌రాజ్ వెళ్లి వచ్చినట్లు వివరించాడు.  కారు తన వద్దనే ఉందని, అనవసరంగా వీడియో వైరల్ చేయడంతో ఫోన్లు, మెసేజులు వస్తున్నాయని, ఇబ్బందికరంగా ఉందని వాపోయాడు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించాడు. తెల్లాపూర్‌లో నివాసం ఉంటున్నానని, హైదరాబాద్‌లోని ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నానని తెలిపాడు.

Also Read:

Abandoned Car: కుంభమేళా పార్కింగ్ ఏరియాలో మిస్టరీగా తెలంగాణ కారు

MLA Spits Assembly: ఇదేం వికృతం.. అసెంబ్లీలో గుట్కా ఉమ్మిన ఎమ్మెల్యే

 

 

 

Just In

01

Khammam District: ఆశ్రమ స్కూల్లో హెడ్ మాస్టర్ ఇష్టా రాజ్యం.. ఉద్యోగం ఒకరిది విధుల్లో మరొకరు.. ఎక్కడంటే.?

Bigg Boss 9 Telugu: అతనికి మాత్రమే సపోర్ట్ చేస్తూ.. బిగ్ బాస్ పై నాగబాబు సంచలన పోస్ట్

Local Body Elections: స్థానిక ఎన్నికలు ఎప్పుడు?.. ఎదురుచూస్తున్న ఆశావహులు..?

Srinivas Goud: స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ సత్తా చాటాల్సిందే: శ్రీనివాస్ గౌడ్

CM Revanth Reddy: నేడు కీలక ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన.. ఎక్కడంటే..?