గుట్కా మరకలు చూసి షాకైన స్పీకర్
ప్రస్తుతం ఉత్తర్ ప్రదేశ్ లో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. 9వ రోజు సెషన్ లో పాల్గొనేందుకు స్పీకర్ సతీష్ మహానా అసెంబ్లీకి వచ్చారు. లోపలికి వెళ్తున్న క్రమంలో ఆయనకు కార్పెట్ పై గుట్కా నమిలి ఉమ్మిన మరకలు కనిపించాయి. దీంతో స్పీకర్ తీవ్ర అసహనానికి గురయ్యారు. వెంటనే అసెంబ్లీ సిబ్బందిని పిలిపించి నేలపై ఉన్న గుట్కా మరకలను శుభ్రం చేయించారు.
#WATCH | Uttar Pradesh Assembly Speaker Satish Mahana raised the issue of some MLA spitting in the House after consuming pan masala. He said that he got the stains cleaned, urged other MLA to stop others from indulging in such acts and also appealed to the MLA to step forward and… pic.twitter.com/VLp32qXlU8
— ANI (@ANI) March 4, 2025
స్పీకర్ చురకలు
అనంతరం సభలోకి ప్రవేశించిన స్పీకర్.. సభ్యులపై అసహనం వ్యక్తం చేశారు. సభను గౌరవప్రదంగా ఉంచడం మనందరి బాధ్యత అని స్పష్టం చేశారు. గుట్కా ఊసిన ఎమ్మెల్యే ఎవరో స్వచ్ఛందంగా తన తప్పును ఒప్పుకోవాలని సూచించారు. లేని పక్షంలో సీసీటీవీ ఆధారంగా అతనెవరో గుర్తించి తానే స్వయంగా ఫోన్ చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఉమ్మివేసిన ఎమ్మెల్యే పేరును ప్రస్తావించకుండా స్పీకర్ ఈ చురకలు అంటించారు. మరోసారి ఇలాంటి తప్పు పునరావృతం కావద్దని సభ్యులకు సూచించారు.
#WATCH | Uttar Pradesh Assembly Speaker Satish Mahana says, "This morning I received information that in this hall of our Vidhan Sabha, some Member has spit after consuming pan masala. So, I came here and got it cleaned. I have seen the MLA in the video. But I do not want to… pic.twitter.com/znh8Oxyekp
— ANI (@ANI) March 4, 2025
Also Read: Abandoned Car: కుంభమేళా పార్కింగ్ ఏరియాలో మిస్టరీగా తెలంగాణ కారు