Indian Rice Imports: దాదాపు ఏడాది కాలంగా భారీ టారిఫ్‌లతో (Tariffs) భారత్‌ను ఇబ్బంది పెడుతున్న అమెరికా (USA) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరో షాకింగ్ ప్రకటన చేశారు. వ్యవసాయ ఉత్పత్తులపై కొత్త టారిఫ్‌లు విధిస్తామని ప్రకటించిన ఆయన, ముఖ్యంగా అమెరికాకు దిగుమతి అవుతున్న భారతీయ బియ్యంపై సుంకాలు ఉంటాయని (Indian Rice Imports) హెచ్చరించారు. అలాగే, కెనడా నుంచి ఫెర్టిలైజర్లపై కూడా సుంకాలు విధిస్తామని తెలిపారు. ఈ రెండు దేశాలతో వాణిజ్య చర్చలు పురోగతిలో ఉన్నాయని ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. భారత్‌తో పాటు ఆసియా దేశాల నుంచి అమెరికాకు దిగుమతి అవుతున్న వ్యవసాయోత్పత్తులపై ఆయన విమర్శలు గుప్పించారు. అమెరికా రైతుల కోసం కొన్ని బిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీ ప్రకటన సందర్భంగా, వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ట్రిలియన్ల డాలర్ల వాణిజ్యం అమెరికాతో నిర్వహిస్తున్నారని, ఏ దేశాన్ని దోచుకోనంతగా అమెరికాను అనేక దేశాలు దోచుకుంటున్నాయని ట్రంప్ ఈ సందర్భంగా ఘాటు వ్యాఖ్యలు చేశఆరు. ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడానికి ద్రవ్యోల్బణం తగ్గించాలని, ఆ తర్వాత రైతులకు సాయం చేయాల్సిన అవసరం చాలా ఉందని ఆయన పేర్కొన్నారు. రైతులు ఒక కచ్చితమైన జాతీయ సంపద అని, అమెరికా వెన్నెముకలో రైతులు ఒక భాగమని అమెరికా రైతులపై ప్రశంసల జల్లుకురిపించారు. దేశ వ్యవసాయాన్ని పునరుద్ధరించడానికి తన వ్యూహంలో సుంకాలు చాలా కీలకమని తనను తాను ట్రంప్ సమర్థించుకున్నారు.
Read Also- Indigo Crisis: ఇండిగో సంక్షోభంపై లోక్‌సభలో మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన
బియ్యం దిగుమతులపై సుదీర్ఘ చర్చ సందర్భంగా ఇండియా పేరు ఉదాహరణగా కనిపించిందని, భారత్ నుంచి బియ్యం దిగుమతి చేసుకోవడం, లూసియానా దక్షిణ ప్రాంత సాగుదారులకు విధ్వంసకరంగా ఉందని ట్రంప్ అభివర్ణించారు. అమెరికా రిటైల్ రైస్ మార్కెట్‌లో రెండు అతిపెద్ద బ్రాండ్‌లు భారతీయ కంపెనీల ఆధీనంలో ఉన్నాయంటూ తనతో ఉత్పత్తిదారులు చెప్పారని, సరే తాను చూసుకుంటామని హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఇది చేయడం చాలా సులభమని, టారిఫ్‌లే పరిష్కారం, సుంకాలు రెండు నిమిషాల్లో సమస్యను పరిష్కరిస్తాయని వ్యాఖ్యానించారు. అమెరికాలోకి వాళ్లు బియ్యాన్ని డంపింగ్’ చేయకూడదని, ఇలా జరుగుతోందని తనకు ఇతరులు చెప్పారని ట్రంప్ పేర్కొన్నారు.
Read Also- Hydraa: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో హైడ్రా పై ప్రశంల వర్షం
స్థానిక వ్యవసాయోత్పత్తులను ప్రోత్సహించేందుకు కెనడా నుంచి దిగుమతి అవుతున్న ఎరువులపై కూడా టారిఫ్ చర్యలు తీసుకునే అవకాశం ఉందని ట్రంప్ హెచ్చరించారు. కెనడా నుంచి పెద్ద ఎత్తున ఎరువులు వస్తున్నాయి కాబట్టి చాలా తీవ్రమైన టారిఫ్‌లను విధిస్తామని ట్రంప్ అన్నారు. కాగా, భారత్- అమెరికా మధ్య వ్యవసాయ వాణిజ్యం గత దశాబ్ద కాలంలో గణనీయంగా వృద్ధి చెందింది. భారతదేశం నుంచి బాస్మతి, ఇతర రకాల బియ్యం, సంబంధిత ఉత్పత్తులు, సుగంధ ద్రవ్యాలు, సముద్ర ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి.
అమెరికా రైతులకు సవాలు
ట్రంప్ ప్రాతినిధ్యం వమిస్తున్న రిపబ్లికన్ పార్టీ నాయకుడు ఒకరు కొత్త టారీఫ్ ప్రతిపాదనలపై స్పందిస్తూ, ఇతర దేశాల దిగుమతులు అమెరికా ఉత్పత్తిదారులు, రైతులకు సవాలుగా మారుతున్నాయని పేర్కొన్నారు. తమ దేశ ఉత్పత్తిదారులను కాపాడుకోవడానికి భారీ సుంకాలను ఉపయోగించుకుంటామని, తద్వారా ఈ సమస్యను పరిష్కరించాలనేది తమ ఉద్దేశమని స్పష్టం చేశారు. వాణిజ్య భాగస్వామ్య దేశాల నుంచి అమెరికా వసూలు చేస్తున్న టారిఫ్ ఆదాయ వనరులను స్థానిక రైతుల ప్రయోజనం కోసం ఉపయోగిస్తున్నామని పేర్కొంది. తాజాగా, 12 బిలియన్ల డాలర్ల ఆర్థిక సహాయాన్ని అమెరికన్ రైతులకు అందిస్తున్నట్టు సదరు నాయకుడు పేర్కొన్నారు.

