Tomato Virus: మధ్యప్రదేశ్‌లో టమాటా వైరస్(Tomato Virus) కలకలం సృష్టించింది. రాజధానిలోని భోపాల్‌లో పాఠశాల పిల్లల్లో ఈ వ్యాది వ్యాప్తి చెందుతుంది. ఆ వ్యాది సోకిన పిల్లలు తీవ్రంగా అనారోగ్యం పాలవుతున్నారు. దీంతో ఆరాష్ట్రంలో ప్రజలు భయాందోలనకు గురవుతున్నారు. పిల్లల చర్మంపై చిన్న చిన్న దద్దుర్లు ఏర్పడి ఓంటినిండా ఇవి ఎర్పడి అనంతరం ఒల్లు మోత్తం వ్యాపిస్తున్నాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం పిల్లల తల్లి తండ్రులను అలర్ట్ చేసింది. లక్షణాలు కనిపించిన పిల్లను గ్రహించి, వైద్యం చేయించాలని తెలిపింది.
లక్షణాలు..
ఈ టమాటా వైరెస్(Tomato Virus) ను హ్యండ్, ఫుట్, మౌత్ డిసీజ్(HFD) అని పిలుస్తారు. ఇది ఎంచినోకాకస్(Enchinococcus), కాక్సాకి(Coxsackie virus) వైరస్ వల్ల వ్యాప్తి చెందుతుందని, ఇ వ్యాది ఎక్కువగా 12 ఎల్లలోపు పిల్లలకు చిన్నారులకు సోకుతుందని డాక్టర్ రాజేష్ టిక్కాస్(Dr. Rajesh Tikkas) అనే పిల్లల వైద్యుడు తెలిపాడు. చిన్నారులు చర్మంపై పాదాలు, మెడ, చేతులు, కొన్ని ప్రదేశాల్లో దద్దుర్లు ఎర్పడి అనంతరం నోటిలో ఎర్రటి దద్దుర్లుగా ఎర్పడి, తర్వాత అవి బోబ్బులుగా మారుతాయి. చిన్నారుల్లో దురద, గొంతునొప్పి, జ్వరం వంటి చిన్న చిన్న లక్షణాలు కనిపిస్తాయని డాక్టర్లు తెలిపారు. ఈ వ్యాది ఓకరి నుండి మరొకరికి వ్యాప్తి చెందుతుందని తెలిపారు. ఈ లక్షణాలు కనిపించే వారి పిల్లను గుర్తించి వారిని సపరేటుగా ఉంచాలని డాక్టర్లు తెలిపారు. ఈ లక్షణాలతో బాధ పడే చిన్నారులను ఇంటి వద్దే ఉంచాలని అక్కడి అధికారులు పాఠశాలల యాజమాన్యాలను అప్రమత్తం చేశాయి.
Also Read: Mohsin Naqvi: బీసీసీఐకి భయపడ్డ మోహ్సిన్ నక్వీ.. ఆసియా కప్ ట్రోఫీని ఇచ్చేశాడు!
నివారణ చర్యలు..
ఈ వ్యాది ఎక్కువగా పిల్లల్లో వ్యాప్తిచెందుతుందని దీనివలన అంత ప్రాణాంతక మైన సమస్యలేవి లేవని అక్కడి వైద్య అధికారులు తెలిపారు. హెచ్ఎఫ్ఎండి(HFMD) మాములు సమస్యేనని, పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇ వ్యాది సోకిన పిల్లలకు వారం నుండి పదిరోజులలోనే ఇ లక్షణాలు భయట పడుతాయని వైద్యులు తెలిపారు. ఈ వ్యాది సోకడానికి ముఖ్యకారణం దీనికి కారణమైన వైరస్ చాలా వరకు మలవిసర్జన తరువాత చేతులు సరిగ్గా కడుక్కోక పోవడం, పరిశుభ్రత పాటించక పోవడం, తుమ్మినప్పుడు వెలువడే తుంపర్ల ద్యారా వ్యాప్తి చెందుతుందని తెలిపారు. కాబట్టి ఇలాంటి సమయంలో ఎక్కువగా జాగ్రతలు తీసుకుంటే చాలని డాక్టర్లు తెలిపారు. ఈ వ్యాది చిత్సకు ఇప్పటివరకు మదు లేదని, గుండె, ఉపిరితిత్తులు, కాలేయ సంభంద, జన్యుపరమైన లోపాలతో భాదపడుతున్న పిల్లలకు అత్యంత అప్రమత్తంతో ఉండి వెంటనే వైద్యులను సంప్రదించాలని వైద్యాదికారులు తెలిపారు.
Also Read: Pawan Kalyan weakness: తన వీక్‌నెస్ ఏంటో చెప్పిన పవన్ కళ్యాణ్.. అందుకేనా..
