Army Vehicle Accident: జమ్మూ కశ్మీర్‌లోని (Jammu Kashmir) డోడా జిల్లాలో తీవ్ర విషాదకరమైన ప్రమాదం (Army Vehicle Accident) జరిగింది. భారత సైనికులతో (Indian Army) వెళుతున్న వ్యాన్ ప్రమాదవశాత్తూ, అదుపు తప్పి లోయలో పడిపోయింది. గురువారం జరిగిన ఈ దుర్ఘటనలో ఏకంగా 10 మంది సైనికులు దుర్మరణం చెందారు. మరో 10 మంది సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. ఆర్మీకి చెందినబుల్లెట్‌ప్రూఫ్ వెహికల్ (కాస్పిర్) ఒక ఆపరేషన్ నిమిత్తం వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగిందని అధికారులు వెల్లడించారు. భదర్వాహ్-చంబా అంతర్రాష్ట్ర రోడ్డుపై ఖన్నీ టాప్ అనే ఏరియాలో వెహికల్ అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లిందని వివరించారు.
Read Also- Singareni: సింగరేణి టెండర్లతో అసలు లబ్ధి పొందింది ఎవరు?.. దాచి పెట్టినా దాగని వాస్తవాలు ఏంటి..?
డోడాలో జరిగిన దురదృష్టకర రోడ్డు ప్రమాదంలో 10 మంది పరాక్రమవంతులైన జవాన్లను కోల్పోవడం చాలా బాధాకరమని జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. ప్రాణాలు గోల్పోయిన ఆ సైనికుల గొప్ప సేవలను, వారి అత్యున్నత త్యాగాన్ని ఎల్లప్పుడూ స్మరించుకుంటామని చెప్పారు. ఈ దు:ఖ సమయంలో బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. ఈ విషాద సమయంలో దేశమంతా బాధిత కుటుంబాల పక్షాన నిలుస్తుందని, ఐక్యతంగా మద్దతు ఇస్తుందని మనోజ్ సిన్హా విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక, గాయపడిన 10 మంది సైనికులను హెలికాప్టర్ల ద్వారా ఆసుపత్రికి తరలించినట్టు వెల్లడించారు. గాయపడిన సైనికులకు అత్యుత్తమైన ట్రీట్‌మెంట్ అందేలా చూడాలని సీనియర్ అధికారులను ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు.
Read Also- Janaki’s Son Passes Away: ప్రముఖ గాయని ఎస్ జానకి కుమారుడు ఇక లేరు.. ఏం జరిగిందంటే?

