Janaki’s Son Passes Away: ప్రముఖ గాయని ఎస్ జానకి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆమెకు ఉన్న ఒక్కగానోక్క కుమారుడు మరణించారు. తాజాగా దీనికి సంబంధించి ప్రముఖ సింగర్ కేఎస్ చిత్ర తన సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. అందులో ఏం ఉంది అంటే.. ప్రముఖ సీనియర్ గాయని ఎస్. జానకి (S. Janaki) ఏకైక కుమారుడు మురళీ కృష్ణ మరణించారు. ఆయన వృత్తిరీత్యా నటుడు, వ్యాపారవేత్త. సింగర్ చిత్ర ఎస్. జానకి ని తన సొంత తల్లిలా (జానకి అమ్మ) భావిస్తారు. ఈ క్రమంలో తన అన్న మురళి మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం ప్రకారం, ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఈ రోజు ఉదయం కన్నుమూసినట్లుగా తెలుస్తోంది. ఎస్. జానకి, చిత్ర గారి మధ్య గురు-శిష్యుల సంబంధం కంటే మిన్నగా ఒక తల్లి-కూతుళ్ల అనుబంధం ఉంది. అందుకే జానకి కుటుంబంలో జరిగిన ఈ పెద్ద నష్టాన్ని చిత్ర తన సొంత ఇంటిలో జరిగిన విషాదంగా భావిస్తూ నివాళులు అర్పించారు.
Read also-Allu Arjun: అల్లు అర్జున్ ‘AA23’లో పూజ హెగ్డే.. అలా వైకుంఠపురంలో రిపీట్ అవుతుందా..

