Kolkata Case
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Law Student: లా విద్యార్థినిపై అఘాయిత్యానికి ముందు ఏం జరిగిందో బయటకొచ్చింది!

Law Student: కోల్‌కతా నగరంలోని ‘సౌత్ కోల్‌కతా లా కాలేజీ’లో న్యాయశాస్త్రం మొదటి సంవత్సరం చదువుతున్న 24 ఏళ్ల విద్యార్థినిపై ఇటీవల అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. మనోజిత్ మిశ్రా అనే పూర్వ విద్యార్థి, ఇద్దరు ప్రస్తుత విద్యార్థులతో కలిసి సామూహిక అత్యాచారానికి ఒడిగట్టాడు. అయితే, ఈ అఘాయిత్యానికి ముందు ఏం జరిగిందో పోలీసులకు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదులో పూసగుచ్చినట్టు వివరించింది. తొలుత తనపై దాడికి పాల్పడ్డారని ఆమె తెలిపింది.

మీటింగ్ కోసం ఆగి..
ఆ రోజు ఒక రాజకీయ సమావేశం కోసం ఇతర విద్యార్థులతో కలిసి తాను కూడా క్యాంపస్‌లో ఉన్నానని, వెళ్లిపోయే సమయంలో అక్కడే ఉండాలంటూ మనోజిత్ కోరాడని, ఆ తర్వాత బలవంతంగా లొంగదీసుకునే ప్రయత్నం చేశాడని బాధితురాలు వాపోయింది. ‘‘మనోజిత్‌ ప్రవర్తనపై అభ్యంతరం చెప్పాను. అతడు నన్ను ఏమీ చేయనివ్వకుండా వెనక్కి నెట్టేశాను. అన్ని చర్యలను ప్రతిఘటించాను. ఎంత ఏడ్చినా, కాళ్లు పట్టుకొని బతిమాలినా అక్కడి నుంచి నన్ను వెళ్లనివ్వలేదు. నాకు ఒక బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడని చెప్పాను. అతడినే ప్రేమిస్తున్నానంటూ వేడుకున్నా వదలలేదు. ఈ క్రమంలో నాపై దాడికి పాల్పడ్డాడు’’ అని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.

Read also- Captain Cool: ‘కెప్టెన్ కూల్’పై ధోనీకి కేంద్రం గ్రీన్‌సిగ్నల్..

దాడి చేసి.. ఇన్హేలర్ ఇచ్చి
‘‘వద్దని నేను ఎంత బతిమాలినా వినలేదు. మనోజిత్ నన్ను బలవంతం చేస్తూనే ఉన్నాడు. అఘాయిత్యం సమయంలో నాకు బాగా భయంవేసింది. ఊపిరాడలేదు. నన్ను రూబీ జనరల్ హాస్పిటల్‌కు తీసుకెళ్లాలని నిందితుల్ని కోరాను. ప్రధాన నిందితుడు మనోజిత్ మిశ్రా సహ నిందితుల్లోని జైబ్‌ను ఇన్హేలర్ తీసుకురమ్మని చెప్పాడు. అతడు తెచ్చి ఇచ్చాడు. ఒకసారి పీల్చుకున్నాక కాస్త రిలీఫ్ అనిపించింది. అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాను. నా వస్తువులన్నీ సర్దుకున్నాను. బయటకు వెళ్లి తప్పించుకోవాలని భావించాను. అయితే, అప్పటికే వాళ్లు మెయిన్ గేట్‌ను లాక్ చేశారు. గార్డు కూడా ఏమీ చేయలేకపోయాడు. నాకు ఎలాంటి సాయం చేయలేదు’’ అని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.

Read also- Actress Pakeezah: కన్నీళ్లు పెట్టిన పాకీజా.. స్వేచ్ఛ కథనంపై పవన్ కళ్యాణ్ స్పందన

రూమ్‌లోకి లాక్కెళ్లారు
తాను బయటకు పారిపోయే అవకాశం లేకపోవడంతో సహ నిందితులు జైబ్, ప్రమిత్ ఇద్దరూ తనను బలవంతంగా సెక్యూరిటీ రూమ్‌లోకి లాక్కెళ్లారని బాధితురాలు వాపోయింది. తనను వదిలిపెట్టాలంటూ మనోజిత్ కాళ్లు పట్టుకున్నానని, తనను బయటకు వెళ్లనివ్వాలని వేడుకున్నానని చెప్పింది. ఈ క్రమంలో గార్డును తీసుకెళ్లి బయట కూర్చోబెట్టాలంటూ సహ నిందితులకు మనోజిత్ సూచించారు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డు అయ్యాయి. ఆ తర్వాత మనోజిత్ నా దుస్తులు విప్పి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ప్రతిఘటిస్తు్న్న సమయంలో నన్ను బ్లాక్ మెయిల్ చేశాడు. బెదిరించాడు. నా బాయ్‌ఫ్రెండ్‌ని చంపేస్తానన్నాడు. నా తల్లిదండ్రులను అరెస్టు చేయిస్తానని నన్ను బెదిరించాడు’’ అని బాధితురాలు పూర్తి వివరాలు తెలిపింది. మనోజిత్ అఘాయిత్యానికి ఒడిగడుతుండగా సహ నిందితులు జైబ్ అహ్మద్, ప్రమిత్ ముఖోపాధ్యాయ సెల్‌ఫోన్లలో వీడియో తీశారని చెప్పింది. అత్యాచారం చేసిన తర్వాత తాను నగ్నంగా ఉన్న రెండు వీడియోలను మనోజిత్ చూపించాడని, ఇకపై సహకరించాలని, పిలిచినప్పుడల్లా రాకపోతే ఈ వీడియోలను అందరికీ చూపిస్తానంటూ బెదిరించాడని వాపోయింది.

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు