Captain Cool: టీమిండియా దిగ్గజ మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనీని (MS Dhoni) ఆయన ఫ్యాన్స్ ప్రేమగా ‘మిస్టర్ కూల్’ అనే పిలుస్తుంటారు. అభిమానుల నుంచి మాజీ క్రికెటర్ల వరకు అందరూ ఈ పేరుతోనే అభివర్ణిస్తున్నారు. ఒక్క ఇండియాలోనే కాదు, ప్రపంచ దేశాలలో కూడా ‘మిస్టర్ కూల్’ అంటే ధోనీయే గుర్తుకొచ్చేలా బలమైన ముద్రపడిపోయింది. అందుకే, ‘మిస్టర్ కూల్’ పేరుని తన ట్రేడ్‌మార్క్‌గా ధోనీ రిజిస్టర్ చేయించుకున్నాడు. అయితే, ధోనీ కంటే ముందు ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖ క్రీడాకారులు తమ పాపులర్ పేర్లను ట్రేడ్‌మార్క్ రిజిస్టర్ చేయించుకున్నారు. వివిధ వ్యాపారాలలో ఈ ట్రేడ్ మార్క్ ఉపయోగించి పెద్ద మొత్తంలో డబ్బు సంపాదిస్తున్నారు. ఆ క్రీడాకారులు ఎవరో తెలుసుకుందాం.
1. ఎంఎస్ ధోని
‘కెప్టెన్ కూల్’ పదానికి టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ పర్యాయపదంగా మారిపోయాడు. మైదానంలో ప్రశాంతత, ఆత్మవిశ్వాసంతో కూడిన ప్రదర్శన కారణంగా ఈ పేరు వచ్చింది. అందుకే, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఫ్యాన్స్ ధోనీని ‘కెప్టెన్ కూల్’ పిలుచుకుంటున్నారు. ‘కెప్టెన్ కూల్’ తనకు మారుపేరుగా మారిపోవడంతో ట్రేడ్‌మార్క్‌గా రిజిస్టర్ చేసుకుంటూ ధోనీ దరఖాస్తు చేసుకున్నాడు. ధోని విజ్ఞప్తికి జూన్ 30న ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రీ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది.
Read this- Actress Pakeezah: కన్నీళ్లు పెట్టిన పాకీజా.. స్వేచ్ఛ ఎఫెక్ట్‌తో పవన్ కళ్యాణ్ స్పందన
2. క్రిస్టియానోరొనాల్డో
పోర్చుగల్‌కు చెందిన ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డోకు ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లెక్కలేనంతమంది అభిమానులు ఆయన సొంతం. ఫుట్‌బాల్‌కు చేసిన కృషి మాత్రమే కాదు, అతడి హేయిర్ స్టైల్, ధరించే దుస్తులు ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుంటాయి. అయితే, రోనాల్డోను అభిమానులు ‘సీఆర్7’ (CR7) అని కూడా పిలుస్తుంటారు. ఎంతో పాపులర్ అయిన ఈ పేరును ట్రేడ్‌మార్క్‌గా రిజిస్టర్ చేయించుకున్నాడు. దీని పేరిట పెర్ఫ్యూమ్‌లు, షర్టులు, షార్ట్‌లు, రిస్ట్‌బ్యాండ్‌లు వంటి అనేక క్రీడా రంగానికి చెందిన దుస్తులు, ఉత్పత్తులను రొనాల్డో కొనుగోలు చేశాడు. సీఆర్7 బ్రాండ్ పేరిట ప్రస్తుతం 53 ఉత్పత్తులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయంటే ఎంత పాపులరో అర్థం చేసుకోవచ్చు.
3. లియోనెల్ మెస్సీ
ఫిఫా ప్రపంచ కప్-2022 విజేతగా నిలిచిన అర్జెంటీనా జట్టు ఫుల్‌బాల్ దిగ్గజం, స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీకి కూడా ఒక ట్రేడ్‌మార్క్ ఉంది. తన ఇంటిపేరు అయిన ‘మెస్సీ’ (MESSI) ట్రేడ్‌మార్క్‌గా రిజిస్టర్ అయింది. స్పానిష్ సైక్లింగ్ బ్రాండ్ ‘మస్సీ’తో (MASSI) సుదీర్ఘ న్యాయ పోరాటం చేసి ట్రేడ్‌మార్క్‌ను సొంతం చేసుకున్నాడు. ఈయూలో (యూరోపియన్ యూనియన్) రిజిస్టర్ చేయించుకున్నాడు. 2022లో తన ట్రేడ్‌మార్క్‌ను మెస్సీ దక్కించుకున్నాడు.
Read this- Chiranjeevi: మెగాస్టార్ ‘విశ్వంభర’ మేకర్స్ నుంచి కీలక ప్రకటన
4. లెబ్రాన్ జేమ్స్
లెబ్రాన్ జేమ్స్ బాస్కెట్‌బాల్ దిగ్గజ ఆటగాడు. అతడి పేరు మీద వేర్వేరు ట్రేడ్‌మార్క్‌లు రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. ఎల్‌బీజే, ఎల్ఎల్‌సీ, ‘మోర్ దెన్ యాన్ అథ్లెట్(2018), ‘స్ట్రైవ్ 4 గ్రేట్‌నెస్’(2022) వంటి అతడి నినాదాలు పేరిట పాపులర్ ట్రేడ్‌మార్క్‌లు రిజిస్టర్ అయ్యాయి.
5. మైఖేల్ జోర్డాన్
లెబ్రాన్ జేమ్స్ మాదిరిగానే మైఖేల్ జోర్డాన్ కూడా బాస్కెట్‌బాల్ లెజెండ్. ‘జంప్‌మ్యాన్’ కింద తన పేరిట ట్రేడ్‌మార్క్ రిజిస్టర్ చేయించుకున్నాడు. ఈ బ్రాండ్ల ద్వారా భారీ ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు. ఈ బ్రాండ్లకు అభిమానుల్లో బాగా క్రేజ్ ఉంది.
6. రోజర్ ఫెదరర్
ప్రముఖ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ పేరిట ‘ఆర్ఎఫ్’ (RF) ట్రేడ్‌మార్క్ ఉంది. అయితే, దీనిపై నైక్ కంపెనీతో 2008లో వివాదం జరిగింది. న్యాయపోరాటం చేసిన ఫెదరర్ 2018లో హక్కులను తిరిగి పొందాడు. 2020లో ఈ ట్రేడ్‌మార్క్‌పై అతడు పూర్తి నియంత్రణ పొందాడు.
7. సెరెనా విలియమ్స్
టెన్నిస్ లెజెండ్ సెరెనా విలియమ్స్ కూడా 2016లో ‘అనెరెస్’ అనే టైటిల్‌ను ‘ట్రేడ్‌మార్క్’ రిజిస్టర్ చేయించుకున్నారు. సెరెనా పేరు ఇంగ్లిష్ స్పెల్లింగ్‌ను వెనకనుంచి రాస్తే ‘అనెరెస్’ పదం వస్తుంది. ఈ ట్రేడ్‌మార్క్‌పై కాస్మెటిక్ బ్రాండ్లు ఉత్పత్తి అవుతున్నాయి. అంతేకాదు, ఎస్‌డబ్ల్యూజే, సెరెనా వెంచర్స్, ఎస్ వరల్డ్, సెరెన్స్ వరల్డ్‌తో పాటు మరికొన్ని వ్యాపారాలలో కూడా ట్రేడ్‌మార్క్స్‌ను ఆమె నమోదు చేసుకున్నారు.