Drishyam Style Murder: దేశంలో దారుణం చోటుచేసుకుంది. మరో భార్య ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేసింది. మహారాష్ట్రలో జరిగిన ఈ ఉదంతం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాశంగా మారింది. దృశ్యం సినిమాలో చూపించిన విధంగా భర్తను చంపి ఇంట్లోనే భార్య పాతేసింది. ఆపై ఎవరికీ అనుమానం రాకుండే దానిపై టైల్స్ వేసి కప్పేసింది. సమాచారం అందుకున్న పోలీసులు.. భార్యతో పాటు ఆమె ప్రియుడ్ని సైతం అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళ్తే..
మహారాష్ట్ర (Maharashtra) పాల్ఘర్ జిల్లా (Palghar district) నలసోపారా (Nallasopara)లోని గంగ్నీపాడలో నివసించే విజయ్ చవాన్ (34), చమన్ దేవి (28) భార్య భర్తలు. అయితే పొరిగింట్లో ఉండే మోను శర్మ (20)తో చమన్ దేవికి వివాహేతర బంధం ఏర్పడింది. ఈ క్రమంలో రెండు వారాలుగా భర్త విజయ్ చవాన్ కనిపించకుండా పోయారు. అదే సమయంలో భార్య (Chaman Devi), ఆమె ప్రియుడు (Monu Sharma) సైతం అదృశ్యం కావడంతో.. విజయ్ చవాన్ సోదరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
భార్య, ఆమె ప్రియుడు అరెస్ట్
దీంతో రంగంలోకి దిగిన పాల్ఘర్ పోలీసులు.. విజయ్ చవాన్ (Vijay Chavan) ఆచూకి కోసం గాలించడం ప్రారంభించారు. ఈ క్రమంలో వారు ఉంటున్న ఇంటిని పరిశీలించగా ఇంటి నేలపైన ఓ ప్రాంతంలో టైల్స్ రంగు మారి ఉండటాన్ని పోలీసులు గమనించారు. అక్కడ తవ్వి చూడగా విజయ్ చవాన్ మృతదేహం బయటపడింది. అదే సమయంలో భార్యకు ఎదురుంటి వ్యక్తితో సంబంధం ఉండటాన్ని గుర్తించిన పోలీసులు.. వారిద్దరి ఆచూకి కోసం ముమ్మరంగా గాలించారు. ఈ క్రమంలో పుణెలోని హడప్సర్ ప్రాంతంలో చమాన్ దేవి, మోను శర్మలను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఇద్దరి ఫోన్లు స్విచ్ ఆఫ్
నిందితుల అరెస్ట్ అనంతరం ఏసీపీ బజరంగ్ దేశాయ్ (ACP Bajrang Desai).. మీడియాతో మాట్లాడారు. ‘కొత్త ఇల్లు కొనడానికి డబ్బు కోసం జులై 10న విజయ్ చవాన్ సోదరులు అతడ్ని సంప్రదించేందుకు యత్నించారు. కానీ అతడి ఫోన్ కలవలేదు.. స్విచ్ ఆఫ్ చేసి ఉంది. భార్యకు చేయగా భర్త పనిమీద బయటకు వెళ్లాడని బదులిచ్చింది. జులై 19న భర్త ఇంటికి తిరిగి వచ్చాడో లేదో తెలుసుకోవడానికి వారు ఆమెకు మళ్లీ ఫోన్ చేశారు. అప్పుడు ఆమె ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో చవాన్ సోదరులు నేరుగా ఇంటికి చూడగా ఇంట్లో ఎవరు కనిపించలేదు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు’ అంటూ ఏసీపీ వివరించారు.
Also Read: Sub-inspector Stolen 2 cr: బాధితుల సొమ్ముతో లేచిపోయిన పోలీసు జంట.. రూ.2 కోట్లతో గోవా, మనాలీలో షికార్లు.. చివరికి!
ఈ సెక్షన్ల కింద కేసు నమోదు
ఇంట్లో దుర్వాసన వస్తుందని మృతుడి సోదరులు చెప్పడంతో పోలీసులు ఇల్లు అంతా తనిఖీ చేశారని ఏసీపీ తెలిపారు. ఈ క్రమంలో టైల్స్ కొత్తగా ఉండటాన్ని గమనించి అక్కడి తవ్వి చూడగా విజయ్ చవాన్ డెడ్ బాడీ బయటపడినట్లు పేర్కొన్నారు. దీంతో చమాన్ దేవి, ఆమె ప్రియుడు మోను శర్మపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 103 (హత్య), 238 (సాక్ష్యాల విధ్వంసం), 3(5) (సాధారణ ఉద్దేశ్యం) కింద ఇద్దరు వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు వివరించారు.