Ranveer Allahbadia
జాతీయం

Ranveer Allahbadia: వివాదాస్పద యూట్యూబర్ కేసు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

Ranveer Allahbadia: ప్రముఖ యూట్యూబర్ రణ్ వీర్ అల్హాబాదియా (Ranveer Allahbadia) ఇటీవల తన వివాదస్పద మాటలతో దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. ‘ఇండియాస్ గాట్ లాటెండ్’ షోలో పాల్గొన్న అతడు.. తల్లిదండ్రులు, శృంగారంపై దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. దీనిపై పలు రాష్టాల్లో ఎఫ్ఐఆర్ లు సైతం దాఖలయ్యాయి. వాటన్నింటిని ఒకచోటుకు చేర్చిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. అల్హాబాదియా కేసుపై కొద్దిరోజుల క్రితమే విచారణ ప్రారంభించింది. ఈ క్రమంలో తాజాగా మరోమారు సుప్రీంకోర్టు విచారణకు రాగా.. యూట్యూబర్ అల్హాబాదియా భారీ ఊరట లభించింది.

పాడ్ కాస్ట్ ప్రసారాలకు అనుమతి

యూట్యూబర్ రణ్‌వీర్ అల్హాబాదియా (Ranveer Allahbadia) కేసుకు సంబంధించి భారత అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. సోషల్ మీడియాలో పాడ్‌కాస్ట్‌లు, షోలు పునఃప్రారంభించేందుకు అతడికి అనుమతి ఇచ్చింది. అయితే పాడ్ కాస్ట్ ప్రసారాలు నైతిక ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలని ధర్మసనం సూచించింది. అన్ని వయసుల వారు చూసే విధంగా ఉండాలని షరతులు విధించింది.

యూట్యూబర్ కు చురకలు

పాడ్ కాస్ట్ ప్రసారంలో ఊరట కల్పిస్తూనే యూట్యూబర్ అల్హాబాదియా మరోమారు సుప్రీంకోర్టు ముట్టికాయలు వేసింది. అసభ్య పదజాలం వినియోగించడం హాస్యం కిందకు రాదని మళ్లీ స్పష్టం చేసింది. భావ ప్రకటన స్వేచ్ఛకు సైతం పరిమితులు ఉంటాయని గుర్తు చేసింది. నైతికత – భావ ప్రకటనా స్వేచ్ఛను సమతూల్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని ధర్మాసనం నొక్కి చెప్పింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ కేసు విచారణను వాయిదా వేసింది.

Also Read: Kiss Emoji Murder: ఇద్దరి ప్రాణం తీసిన ‘కిస్ ఎమోజీ’.. అసలేం జరిగిందంటే?

అల్హాబాదియా చేసిన తప్పు ఇదే

‘ఇండియాస్ గాట్ లాటెండ్’ పాల్గొన్న ఓ వ్యక్తిని తల్లిదండ్రుల గురించి, శృంగారం పైన ప్రశ్నించడంతో ప్రముఖ యూట్యూబర్‌ రణ్‌వీర్‌ అల్హాబాదియాపై తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. అతడి వ్యాఖ్యలపై పలువురు పార్లమెంటు సభ్యులు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. దీనిపై దేశవ్యాప్తంగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదవడంతో అరెస్టు నుంచి రక్షణ కోరుతూ అల్హాబాదియా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రారంభ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం సైతం అతడిపై తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేసింది. యూట్యూబ్ లో అతడి పాడ్ కాస్ట్ ప్రసారాలను వెంటనే నిలిపివేయాలని ఆ సందర్భంలో తీర్పు వెలువరించింది. 280 మంది ఉద్యోగులకు ఆ షోనే ఉపాధి అని అల్హాబాదియా తరపు న్యాయవాది తాజాగా వాదించడంతో పాడ్ కాస్ట్ ప్రసారాలకు అనుమతి ఇచ్చింది.

 

 

 

Just In

01

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?