Rahul Gandhi: జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో కొద్ది రోజుల క్రితం ఉగ్ర మూకలు కాల్పులకు తెగబడగా 26 మంది టూరిస్టులు చనిపోయారు. దీనికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పీవోకేతో పాటు పాకిస్థాన్‌లోని ఉగ్రవాదుల స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది. దీంతో పాకిస్థాన్ రెచ్చిపోయింది. తమ చోటకు వచ్చి బాంబులు వేస్తారా అంటూ ప్రతి దాడికి పాల్పడింది. సరిహద్దు ప్రాంతాల్లో బాంబులు జార విడిచింది. భారత దళాలు వీటిని సమర్థవంతంగా తిప్పికొట్టాయి. అలాగే, సరిహద్దు వెంబడి పాకిస్థాన్ కాల్పులకు తెగబడింది. ఈ క్రమంలో పలువురు పౌరులు మరణించారు. వారి కుటుంబాలకు లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ అండగా నిలిచారు.
రాహుల్ గాంధీ సందర్శన
భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల సమయంలో జమ్ముకశ్మీర్ సరిహద్దు గ్రామాలను రాహుల్ గాంధీ సందర్శించారు. ఆ సమయంలో పూంఛ్ పరిధిలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల వివరాలను సేకరించాలని కాంగ్రెస్ పార్టీ నేతలకు తెలిపారు. దీంతో రంగంలోకి దిగిన స్థానిక నాయకులు జాబితాను తయారు చేశారు. సర్వే చేసి 22 మంది పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయినట్టు తేల్చారు.
Read Also- Aaraa Mastan: మెట్టుగూడ స్థలంలో నిర్మాణాల కూల్చివేత.. మీడియాపై ఆంక్షలు
22 మంది చిన్నారుల దత్తత
పూంఛ్ పరిధిలో తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకు అండగా రాహుల్ గాంధీ నిలవనున్నారు. ఈ మేరకు జమ్ముకశ్మీర్ కాంగ్రెస్ చీఫ్ హమీద్ ఈ విషయాన్ని వెల్లడించారు. 22 మంది చిన్నారులను రాహుల్ గాంధీ దత్తత తీసుకోనున్నట్టు తెలిపారు. వారి చదువు పూర్తయ్యే వరకు సాయం చేస్తారని, తర్వాత వారు స్థిరపడేందుకు కూడా ఖర్చులు భరిస్తారని వివరించారు. త్వరలోనే తొల విడుత సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు హమీద్ తెలియజేశారు.
క్రైస్ట్ స్కూల్‌ను సందర్శించిన రాహుల్
పూంఛ్ పాక్ సరిహద్దుల్లో ఉండడంతో కాల్పుల సమయంలో తీవ్రంగా దెబ్బతిన్నది. నేక పాఠశాలలపై కాల్పులు జరిగాయి. ఆదే సమయంలో చాలామంది తల్లిదండ్రులను కోల్పోయారు. తర్వాత రాహుల్ గాంధీ పూంఛ్ పరిధిలో పర్యటించారు. క్రైస్ట్ పబ్లిక్ స్కూల్‌ను సందర్శించి, విద్యార్థులకు భరోసానిచ్చారు. ఇప్పుడు తల్లిదండ్రులను కోల్పోయిన వారికి అండగా సాయం చేసేందుకు సిద్ధమయ్యారు.
Read Also- Weight Loss Tips: అలా ఉన్నవారు.. ఇలా అవ్వాలంటే.. ఈ 5 టిప్స్ ఫాలో కావాల్సిందే!