Raihan – Aviva Marriage: కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ కుటుంబంలో పెళ్లి సందడి నెలకొనబోతోంది. కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ, వ్యాపారవేత్త రాబర్డ్ వాద్రా దంపతుల సుపుత్రుడు రైహాన్ వాద్రా (Raihan Vadra) త్వరలోనే పెళ్లి పీటలు (Raihan – Aviva Marriage) ఎక్కబోతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అవీవా బేగ్ (Aviva Baig) అనే యువతిని పెళ్లి చేసుకోబోతున్నట్టు సమాచారం. వీళ్లిద్దరూ గత ఏడేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారని, నిశ్చితార్థం కూడా చేసుకున్నారంటూ మంగళవారం నాడు జాతీయ మీడియాలో జోరుగా కథనాలు వెలువడుతున్నాయి. అవీవా బేగ్ కుటుంబం ఢిల్లీకి చెందినవారు. ఇరువురి కుటుంబాల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. అవీవా మూడు రోజుల క్రితం తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో రైహాన్‌తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసింది. అంతేకాదు, ఆ ఫొటోపై మూడు హార్ట్ ఎమోజీలను కూడా జోడించింది. దీంతో, పెళ్లి కన్ఫార్మ్ అయ్యినట్టేననే ప్రచారానికి బలం చేకూర్చినట్టయ్యింది.
Read Also- Crime Report 2025: విశాఖలో పెరిగిన హత్యలు.. తగ్గిన అత్యాచారాలు.. క్రైమ్ రిపోర్టులో సంచలన లెక్కలు
ఎవరీ అవీవా బేగ్?
రైహాన్ వాద్రా వివాహం చేసుకోబోయే అవీవా బేగ్ ప్రముఖ ఫోటోగ్రాఫర్‌గా ఢిల్లీలో పేరు తెచ్చుకున్నారు. ఫొటోగ్రఫీ, ఫ్యాషన్, కల్చరల్ ప్రాజెక్ట్స్‌లలో క్రియేటివ్ ప్రొఫెషనల్‌గా ఆమె పనిచేస్తున్నారు. గతంతో ఎడిటోరియల్, మార్కెటింగ్, ప్రొడక్షన్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ వంటి స్థానాల్లో పనిచేశారు. విజువల్ స్టోరీ క్రియేషన్, కల్చర్, సోషల్ థీమ్స్ ఆమె ప్రత్యేకతగా ఉన్నాయి. అవీవా బేగ్ ఢిల్లీలోని మోడ్రన్ స్కూల్‌లో హ్యుమానిటీస్‌లో స్కూల్ ఎడ్యుకేషన్, ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ కమ్యూనికేషన్‌లో డిగ్రీ చదివారు. డిగ్రీ పూర్తయ్యాక ‘అటెలియర్ 11’ (Atelier 11) అనే పేరిట భాగస్వామ్యంతో ఫొటోగ్రాఫిక్ స్టూడియో, ప్రొడక్షన్ కంపెనీ నెలకొల్పారు. ప్రస్తుతం ఈ సంస్థ దేశవ్యాప్తంగా పలువ బ్రాండ్లు, ఏజెన్సీలతో కలిసి పనిచేస్తోంది. ఇక, అవీవా బేగ్ తీసిన ఫోటోలను ‘యు కెనాట్ మిస్ దిస్’ (2023), ఇండియా ఆర్ట్ ఫెయిర్ వంటి పలు ప్రతిష్టాత్మక ఎగ్జిబిషన్లలో ప్రదర్శనకు ఉంచారు. వెర్వ్ మ్యాగజైన్ ఇండియా, క్రియేటివ్ ఇమేజ్ మ్యాగజైన్ వంటి సంస్థల్లో ఇంటర్న్‌గా, ప్లస్ రిమ్‌లో (PlusRymn) ఫ్రీలాన్స్ ప్రొడ్యూసర్‌గా పనిచేశారు.
Read Also- Prabhas Kindness: హీరోయిన్ రిద్ధి కుమార్ ప్రభాస్‌కు ఇచ్చిన గిఫ్ట్ ఇదే.. ఆమె ఏం తీసుకున్నారంటే?
రైహాన్ వాద్రా ఏం చేస్తారు?
ప్రియాంక గాంధీ కొడుకు రైహాన్ వాద్రా విజువల్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్నారు. పదేళ్ల వయస్సు నుంచే ఆయన ఫోటోగ్రఫీపై ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. వైల్డ్‌లైఫ్, స్ట్రీట్, కమర్షియల్ ఫోటోగ్రఫీలో పనిచేస్తున్నారు. తొలిసారి ఢిల్లీలోని బికనీర్ హౌస్‌లో రైహాన్ తీసిన ఫొటోలను ప్రదర్శించారు. స్కూల్ ఎడ్యుకేషన్ స్థాయిలో క్రికెట్ మ్యాచ్ ఆడుతుండగా, అతడి కంటికి గాయం అయ్యింది. అప్పటినుంచి ఆలత ఫోటోగ్రఫీ వైపు మళ్లారు.

