Ahmedabad Plane Crash (Image Source: Twitter)
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Ahmedabad Plane Crash: విమాన ప్రమాద స్థలిని పరిశీలించిన ప్రధాని.. బాధితులకు భరోసా

Ahmedabad Plane Crash: అహ్మదాబాద్‌ నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిరిండియా (Air India) విమానం గురువారం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే (Air India Flight Crash). ఈ దుర్ఘటనలో 265 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై గురువారమే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ.. శుక్రవారం ఢిల్లీ నుంచి అహ్మాదాబాద్ కు వచ్చారు. ఘటనా స్థలికి వెళ్లి స్వయంగా పరిస్థితులను సమీక్షించారు. ప్రమాదానికి గల కారణాలను మోదీ అడిగి తెలుసుకున్నారు. మోదీ గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, కేంద్ర పౌరవిమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడు, మరో కేంద్ర మంత్రి మురళీధర్ మోహుల్, గుజరాత్ హోంమంత్రి హర్ష్ సంఘ్వీ ఉన్నారు.

బాధితులను పరామర్శించిన ప్రధాని
ఘటనా స్థలి పరిశీలన అనంతరం ప్రధాని మోదీ (PM Modi) అక్కడి నుంచి నేరుగా అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రికి వెళ్లారు. ప్రమాదంలో గాయపడ్డ బాధితులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పి ఆత్మస్థైర్యం నింపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా అండగా ఉంటాయని హామీ ఇచ్చారు. మరోవైపు బాధితులకు అందిస్తున్న చికిత్స గురించి వైద్యులు.. ప్రధానికి వివరించారు. ఇదిలా ఉంటే ఎయిర్ ఇండియా ఎండీ, సీఈఓ క్యాంప్ బెల్ విల్సన్ (Campbell Wilson) సైతం ప్రమాద స్థలిని పరిశీలించారు. అలాగే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని కలిసి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఎయిర్ ఇండియా (Air India) తరపున అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Also Read: Plane Crashes In India: దేశాన్ని కుదిపేసిన ఘోర విమాన ప్రమాదాలు.. ప్రతీ ఘటన తీవ్ర విషాదమే!

ఆ కారణంతో పెరిగిన మరణాలు
ప్రమాద సమయంలో ఎయిర్ ఇండియా విమానంలో 242 ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో 241 మంది ప్రాణాలు కోల్పోగా ఒక వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. విమానంలో 169 మంది భారత పౌరులు, 55 మంది బ్రిటన్ కు చెందిన వారు ఉన్నారు. మృతుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాణీ ఉండటం మరింత వేదనను మరింత పెంచుతోంది. అయితే విమానం బీజే వైద్య కళాశాల మెడికోల వసతి గృహంపై కుప్పకూలడంతో మరణాలు సంఖ్య మరింత పెరిగింది. హాస్టల్ లోని 24 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు.

మాజీ సీఎం మృతిపై కీలక ప్రకటన
అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ (Vijay Rupani) కన్నుమూశారు. ఈ విషయాన్ని గుజరాత్ (Gujarat) బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్ అధికారికంగా ప్రకటించారు. విమాన ప్రమాదంలో విషాదకర రీతిలో విజయ్ రూపానీ కన్నుమూశారని అన్నారు. ఆయన మరణం కలచివేస్తోందని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘‘మాజీ సీఎం విజయ్ రూపానీ ఇక లేరు. బీజేపీ కుటుంబం తీవ్ర విచారంలో ఉంది. విమాన ప్రమాదంలో చనిపోయినవారందరి ఆత్మలకు శాంతిని కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నాం. కష్టకాలంలో మృతుల కుటుంబాలకు ధైర్యం కలగజేయాలని కోరుకుంటున్నాం’’ అని పాటిల్ పేర్కొన్నారు.

Also Read This: Bhopal Bridge: బుద్ధి ఉందా.. ఇలాగేనా నిర్మించేది.. కొత్త వంతెనపై వాహనదారులు ఫైర్!

Just In

01

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?