G7 Summit PM Narendra Modi
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Modi-G7 Summit: ఊహించని పరిణామం!.. కెనడా రమ్మంటూ మోదీకి పిలుపు

Modi-G7 Summit: కెనడా మాజీ ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో (Justin Truedo) హయాంలో భారత్-కెనడా (India – Canada) సంబంధాలు ఎప్పుడూ లేనంత అథమ స్థాయికి క్షీణించాయి. అయితే, మార్క్ కార్నీ (Mark Carney) ఆ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు తిరిగి చిగురిస్తున్నాయని తెలియజేసే కీలక పరిణామం ఒకటి చోటుచేసుకుంది. ఈ నెల ద్వితియార్థంలో కెనడా వేదికగా జరగనున్న జీ7 (G7 Summit) శిఖరాగ్ర సదస్సుకు రావాలంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని (Narendra Modi) ఆ దేశ ప్రధాని మార్క్ కార్నీ (Mark Carney ఆహ్వానించారు.

Read this- Arrest Virat Kohli: విరాట్ కోహ్లీకి ఊహించని పరిణామం.. అల్లు అర్జున్ ఫొటోలు వైరల్

ఈ విషయాన్ని ప్రధాని మోదీ స్వయంగా ఎక్స్ (Twitter) వేదికగా వెల్లడించారు. జీ7 సదస్సుకు తాను హాజరవుతానంటూ ప్రకటించారు. జూన్ 15 నుంచి 17 వరకు జరిగే ఈ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని కార్నీని కలిసేందుకు ఎదురుచూస్తున్నానని చెప్పారు. సదస్సుకు హాజరవ్వాలంటూ కెనడా ప్రధాన మంత్రి నుంచి పిలుపు అందిందని, పునరుత్తేజ శక్తితో ఇరు దేశాలు పరస్పర గౌరవంతో కలిసి పనిచేస్తాయని మోదీ ధీమా వ్యక్తం చేశారు. సదస్సుకు హాజరు కావాలంటూ మార్క్ కార్నీ నుంచి పిలుపు అందడం పట్ల సంతోషంగా ఉందని ఆయన చెప్పారు. ఇటీవలే ఎన్నికల్లో విజయం సాధించిన ఆయనకు అభినందనలు తెలిపానని గుర్తుచేసుకున్నారు.

Read this- Unusual Ola Ride: పక్కవీధిలోకి ఓలా బైక్ బుకింగ్.. కారణం విని షాకైన రైడర్

నిజ్జర్ హత్యతో చెడిన సంబంధాలు

కెనడాలోని కననాస్కిస్‌లో జరిగే జీ7 శిఖరాగ్ర సదస్సుకు ఆహ్వానం పంపినందుకు కార్నీకి ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. ఇరుదేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాలతో, శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశాలుగా భారత్, కెనడా ఉన్నాయన్నారు. ఇరుదేశాల పరస్పర గౌరవం, ఉమ్మడి ఆసక్తుల ద్వారా నూతన శక్తితో కలిసి పనిచేస్తాయని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. శిఖరాగ్ర సదస్సులో భాగంగా కార్నీతో భేటీలో ఎదురు చూస్తుంటానని మోదీ చెప్పారు. కాగా, 2023లో ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత భారత్, కెనడా సంబంధాలు దెబ్బతిన్నాయి. నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రభుత్వం ప్రత్యక్ష ఆరోపణలు చేసింది. ఆ పరిణామంతో ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో జరగనున్న జీ7 సదస్సుకు ప్రధాని మోదీకి ఆహ్వానం అందుతుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. 2019 తర్వాత తొలిసారి జీ7 శిఖరాగ్ర సదస్సుకు హాజరుకాబోరంటూ ఊహాగానాలు కూడా వెలువడ్డాయి. ఆహ్వానం అందినా వెళ్లకపోవచ్చనే ఊహాగానాలు కూడా వచ్చాయి. మొత్తానికి వాటన్నింటికీ చెక్ పెడుతూ జీ7 సదస్సుకు వెళ్లబోతున్నట్టు ప్రధాని మోదీ నిర్ధారించడంతో ఊహాగానాలకు తెరపడింది.

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?