PM Modi
జాతీయం

PM Modi: 3 కోట్ల మంది యువతకి నైపుణ్య శిక్షణ: ప్రధాని మోదీ

PM Modi: దేశంలో ఉద్యోగ కల్పనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజల్లో నైపుణ్యం, ప్రతిభను పెంపొందించడం వంటి చర్యలతో కొత్త అవకాశాలు సృష్టించవని అన్నారు. తద్వారా ఉద్యోగ కల్పన లభించడంతో పాటు ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

3 కోట్ల మందికి శిక్షణ

ప్రధాని నరేంద్ర మోదీ.. పోస్ట్ బడ్జెట్ సమావేశాలపై నిర్వహించిన వెబినార్ లో వర్చువల్ గా పాల్గొన్నారు. ఉద్యోగ కల్పన ఇతివృత్తంతో నిర్వహించిన ఈ వెబినార్ లో ఆయన మాట్లాడారు. తాము కేంద్రంలో అధికారం చేపట్టిన 2014 నుంచి ఇప్పటివరకూ 3 కోట్ల మందికి యువతకు నైపుణ్య శిక్షణ అందించినట్లు ప్రధాని తెలిపారు. 1000 ఐటీఐలను అప్‌గ్రేడ్‌ చేయడంతో పాటు, 5 సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ కేంద్రాలను నెలకొల్పాలని భావిస్తున్నట్లు చెప్పారు.

Also Read: India Rich List: దేశంలో అంత మంది కోటీశ్వరులా? చూస్తే మతిపోవాల్సిందే!

అవి దేశానికి మూల స్థంభాలు: ప్రధాని

దేశ అభివృద్ధికి ప్రతిభ, నైపుణ్యాల పెంపు మూల స్థంభాలని ప్రధాని మోదీ వెబినార్ లో అన్నారు. ఏఐ సామర్థ్యం బలోపేతానికి త్వరలో నేషనల్ లార్జ్ లాంగ్వేజీ మోడల్ ను ఏర్పాటు చేయనునట్లు పేర్కొన్నారు. అటు దేశంలోని విద్యావిధానంపైనా మాట్లాడిన ప్రధాని.. ప్రస్తుతం అది పరివర్తన దశలో సాగుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ 3.8 ట్రిలియన్‌ డాలర్లుగా ఉందని తెలిపారు. భారత్ త్వరలో 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నట్లు చెప్పారు.

 

Just In

01

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు