Delhi Air Pollution (Image Source: Twitter)
జాతీయం

Air Pollution Protest: ఊపిరి పీల్చలేకపోతున్నాం, రక్షించండి.. రోడ్డెక్కిన దిల్లీ జనం.. పిల్లలు కూడా అరెస్ట్?

Air Pollution Protest: దేశ రాజధాని దిల్లీని వాయు కాలుష్యం తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. స్వచ్ఛమైన గాలి లభించకపోవడంతో గత కొన్ని రోజులుగా ప్రజలు అవస్థలు పడుతున్నారు. కాలుష్య నియంత్రణకు దిల్లీ ప్రభుత్వం.. మేఘమథనం వంటి ప్రయత్నాలు చేసినప్పటికీ అవి సత్ఫలితాలు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో దిల్లీ ప్రజలు రోడ్డెక్కారు. దిల్లీలోని ఇండియా గేట్ వద్ద ‘క్లీన్ ఎయిర్ ప్రొటెస్ట్’ (Clean-Air Protest) పేరుతో ఆందోళనకు దిగారు.

‘ఊపిరి పీల్చలేకపోతున్నాం’

దిల్లీకి చెందిన కొందరు మహిళలు తమ పిల్లలతో కలిసి నిరసనల్లో పాల్గొనడం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. నగరంలో నానాటికి పెరిగిపోతున్న కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వం కఠిన విధానాలు అమలు చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. చిన్నారులతో కలిసి నిరసనకు దిగిన మహిళల చేతిలో నెబ్యులైజర్లు, వైద్య పత్రాలు ఉండటం.. పరిస్థితి తీవ్రతను అద్దం పడుతోంది. ‘ఊపిరి పీల్చలేకపోతున్నాం.. రక్షించండి’ అంటూ చిన్నారులు ఫ్లకార్డులు ప్రదర్శించడం ప్రతీ ఒక్కరినీ కదిలించింది.

పోలీసుల అదుపులో చిన్నారులు

కాలుష్యానికి వ్యతిరేకంగా చేపట్టిన ఈ నిరసనలకు అనుమతి లేదంటూ ఆందోళనకారులను దిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. నిరసనకారులను బలవంతంగా పోలీసు వాహనాల్లోకి ఎక్కించారు. వారిలో చిన్నారులు సైతం ఉండటం తీవ్ర చర్చకు దారి చేసింది. పిల్లలను సైతం అదుపులోకి తీసుకున్నారని తల్లిదండ్రులు ఆరోపించగా.. దీనిని పోలీసులు ఖండించారు.

దిల్లీ డీసీపీ స్పందన

ఇండియా గేటు వద్ద చేపట్టిన నిరసనలపై దిల్లీ డీసీపీ దేవేష్ కుమార్ మహ్లా స్పందించారు. నిరసనలను జంతర్ మంతర్ ప్రాంతంలో తెలుపుకోవచ్చని సూచించినట్లు చెప్పారు. కానీ వారు అందుకు అంగీకరించలేదని పేర్కొన్నారు. ట్రాఫిక్ కు అంతరాయం కలిగించకూడదన్న ఉద్దేశంతో వారిని నిర్భందించినట్లు చెప్పారు. కొద్దిసేపటి తర్వాత వారిని విడిచిపెట్టినట్లు డీసీపీ స్పష్టం చేశారు.

నిరసనకారుల డిమాండ్లు

దిల్లీ ప్రభుత్వానికి నిరసనకారులు కొన్ని సూచనలు చేశారు. గాలి కాలుష్యాన్ని తగ్గించేందుకు తక్షణమే బాధ్యాతయుత, పారదర్శక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే స్వతంత్ర గాలి నియంత్రణ సంస్థ ఏర్పాటు, గాలి నాణ్యత డేటాను ప్రజలకు అందుబాటులో ఉంచడం, కాలుష్యం పెరిగిన సందర్భాల్లో ఆరోగ్య హెచ్చరికలు జారీ చేయడం, గాలి నాణ్యతను కాపాడే క్రమంలో ప్రజల బాధ్యతను నిర్దారించడం వంటి చర్యలు చేపట్టాలని దిల్లీ సర్కారుకు సూచించారు. శుభ్రమైన గాలిని పీల్చడం అనేది భారత రాజ్యాంగం కల్పించిన హక్కు అని పలువురు నిరసనకారులు గుర్తుచేశారు.

Also Read: D Mart Shopping Scam: డీమార్ట్‌‌ చేసే మోసాలు? బట్టబయలు చేసిన కస్టమర్లు.. ఫ్యూజులు ఎగరడం పక్కా!

దిల్లీలో గాలి కాలుష్యం

దిల్లీలో ఇవాళ కూడా గాలి నాణ్యత దారుణంగా ఉంది. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (CPCB) ఉదయం 6.05 గంటలకు విడుదల చేసిన డేటా ప్రకారం.. నగరంలోని మొత్తం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 346 వద్ద ఉంది. ప్రధాన ప్రాంతాల్లో ఆందోళనకర స్థాయిలో కాలుష్యం నమోదైంది. బవానా AQI 412, వజీర్‌పూర్ AQI 397, జహంగీర్‌పురి AQI 394, నెహ్రూ నగర్ AQI 386 గాలి నాణ్యత నమోదైనట్లు సీపీసీబీ తెలిపింది. గత నాలుగు రోజులుగా గాలి నాణ్యత దిగజారుతూ వస్తోందని పేర్కొంది.

Also Read: BRS Party: గులాబీ ఏజెంట్లతో రహస్య భేటీలు.. ఓటర్లను ఆకట్టుకునేలా వ్యూహాలు!

Just In

01

Mithra Mandali OTT: థియేటర్లలో మెప్పించలేకపోయింది కానీ.. ఓటీటీలో!

Terrorists Arrest: 12 సూట్ కేసులు.. 20 టైమర్స్.. ఒక రైఫిల్, లేడీ డాక్టర్ ఉగ్ర కుట్ర?

Bigg Boss Telugu 9: హౌస్‌లో ‘మండే’ మంటలు మొదలయ్యాయ్.. ఇంకెవరూ ఆపలేరు!

Swathi murder case: వీడిన స్వాతి మర్డర్ మిస్టరీ.. వెలుగులోకి సంచలన నిజాలు!

Air Pollution Protest: ఊపిరి పీల్చలేకపోతున్నాం, రక్షించండి.. రోడ్డెక్కిన దిల్లీ జనం.. పిల్లలు కూడా అరెస్ట్?