Republic Day - 2026: 'ఆపరేషన్ సింధూర్ శకటం'.. ఓ లుక్కేయండి!
Operation Sindoor Tableau Showcased at Republic Day 2026
జాతీయం

Republic Day – 2026: ‘ఆపరేషన్ సింధూర్ శకటం’.. దిల్లీ రిపబ్లిక్ డే వేడుకల్లో ఆసక్తికర దృశ్యాలు!

Republic Day – 2026: పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా ఆపరేషన్ సింధూర్ నిర్వహించి భారత సైన్యాలు.. దయాది దేశం పాకిస్థాన్ (Pakistan)ను చావుదెబ్బకొట్టిన సంగతి తెలిసిందే. ఉగ్ర స్థావరాలపై భారత వాయుసేన క్షిపణుల వర్షం కురిపించగా.. ఈ దాడిలో వందమందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్లు జాతీయ మీడియాలో వరుస కథనాలు వచ్చాయి. ఇదిలా ఉంటే దేశ రాజధాని దిల్లీలో రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా ఆపరేషన్ సిందూర్ శకటాన్ని (Operation Sindoor Tableau) కేంద్రం ప్రభుత్వం ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

జెండా వందనం చేసిన రాష్ట్రపతి

దేశ రాజధాని దిల్లీలోని కర్తవ్య పథ్ లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం 10.30 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జెండా వందనం చేయగా.. అనంతరం సైనిక కవాతు ప్రారంభమైంది. ఈ వేడుకల్లో ఐరోపా కౌన్సిల్ అధ్యక్షుడు ఆమటోనియో కోస్టా, ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ చీఫ్ గెస్ట్స్ గా హాజరయ్యారు. అలాగే వీరితో పాటు ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా పలువురు కేంద్రం మంత్రులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

ఆపరేషన్ సిందూర్ శకటం

రిపబ్లిక్ డే పరేడ్ సందర్భంగా సైన్యానికి సంబంధించిన పలు శకటాలను ప్రదర్శించారు. అయితే ఆపరేషన్ సిందూర్ కు సంబంధించిన శకటం ప్రధానంగా అందరి దృష్టిని ఆకర్షించింది. విక్టరీ త్రూ జాయింట్ నెస్’ (Victory Through Jointness) పేరుతో ప్రదర్శించిన ఈ శకటంపై ఆపరేషన్ సిందూర్ సందర్భంగా భారత సైన్యం చేసిన విరోచిత తెగువను ప్రదర్శించారు. భారత్ భూభాగం నుంచి నింగికేగిన యుద్ధ విమానం, క్షిపణుల దాటికి పాక్ లో ధ్వంసమైన ఉగ్రస్థావం, అలాగే ఎస్-400 క్షిపణి నిరోధక వ్యవస్థ తదితర ఆకృతులను ఈ శకటంపై ప్రదర్శించారు.

Also Read: Republic Day 2026: అబ్బురపరిచిన ఏపీ శకటాలు.. అమరావతిలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు!

ఆపరేషన్ సిందూర్ ఏంటంటే?

ఆపరేషన్ సిందూర్ ను మే 7వ తేదీ తెల్లవారు జామున భారత సైన్యాలు విజయవంతంగా నిర్వహించాయి. పాకిస్థాన్ తో పాటు పీఓకే (పాక్ ఆక్రమిత కాశ్మీర్)లోని ఉగ్ర స్థావరాలపై భారత వైమానిక దళం క్షిపణులతో విరుచుకుపడింది. గత ఏడాది పహల్గాంలో జరిగి ఉగ్రదాడికి ప్రతీకారంగా.. భారత సైన్యం ఈ ఆపరేషన్ చేపట్టింది. ఆపరేషన్ తర్వాత భారత్ – పాక్ మధ్య నాలుగు రోజుల పాటు ఉద్రిక్తతలు కొనసాగాయి. భారత నగరాలను టార్గెట్ చేస్తూ పాక్ క్షిపణులను ప్రయోగించగా.. ఎస్ – 400 క్షిపణి వ్యవస్థ వాటిని గాలిలోనే కూల్చివేసింది. అలాగే పాక్ ప్రయోగించిన డ్రోన్లను సైతం కుప్పకూల్చింది. ఆ తర్వాత భారత సైన్యం మరింత దూకుడు ప్రదర్శిస్తూ పాక్ లోని పలు ప్రధాన వైమానిక స్థావరాలపై విరుచుకుపడింది. దీంతో తోకముడిచిన పాక్ కమాండర్లు.. ఆపరేషన్ సిందూర్ కు బ్రేకులు వేయమని భారత్ ను అభ్యర్థించారు. దీంతో భారత్ – పాక్ ఉద్రిక్తతలకు బ్రేక్ పడింది.

Also Read: Republic Day 2026: పరేడ్ గ్రౌండ్‌లో గణతంత్ర వేడుకలు.. తెలంగాణ ఘనతలపై.. గవర్నర్ అదిరిపోయే స్పీచ్!

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?