Delhi Blast - Umar: బాంబర్ ఉమర్ సీక్రెట్ సూట్‌కేస్ గుర్తింపు
Delhi-Blast-Case (Image source X)
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Delhi Blast – Umar: ఢిల్లీ పేలుడు కేసు.. బాంబర్ ఉమర్ సీక్రెట్ సూట్‌కేస్ గుర్తింపు.. నమ్మలేని నిజాలు వెలుగులోకి

Delhi Blast – Umar: ఢిల్లీలోని ఎర్రకోట వద్ద నవంబర్ 10న బాంబు పేలుడుకు పాల్పడ్డ బాంబర్, అనుమానిత ఉగ్రవాది మొహమ్మద్ ఉమర్ నబీకి (Delhi Blast – Umar) సంబంధించిన కొత్త విషయాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. అతడు వాడిన ఒక సీక్రెట్ సూట్‌కేస్‌ను దర్యాప్తు అధికారులు తాజాగా గుర్తించారు. ఈ సూట్‌కేస్‌ను ఒక రహస్య ‘మొబైల్ వర్క్ స్టేషన్‌’గా ఉపయోగించేవాడని, అందులో తన ఉగ్రవాద పనిముట్లు, పేలుడుకు వాడే సామగ్రిని ఉంచేవాడని తేల్చారు. ప్రస్తుతం విచారణలో ఉన్న అనుమానిత ఉగ్రవాది ముజామిల్ షకీల్ ఈ విషయాలను దర్యాప్తు అధికారులకు వెల్లడించాడు. ఈ మొబైల్ వర్క్‌స్టేషన్‌ను ఉమర్ ఎక్కడికి వెళ్లినా తనవెంట తీసుకువెళ్లేవాడని, అదొక పెద్ద సూట్‌కేస్ అని దర్యాప్తు వర్గాలు వివరించాయి. అందులో రసాయన సమ్మేళనాలు, వాటిని నిల్వ చేయడానికి కంటైనర్ల వంటి బాంబు తయారీ సామాగ్రి ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.

క్యాంపస్‌లోనే చిన్న పరీక్ష

ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీలో పనిచేసిన బాంబర్ ఉమర్ ఉన్ నబీ, క్యాంపస్‌లోని తన గదిలోనే ఒక చిన్న పరీక్ష నిర్వహించాడని ముజామ్మిల్ షకీల్ చెప్పాడు. ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (IED) తయారీలో ఉపయోగించిన రసాయన సమ్మేళనంపై ఈ పరీక్ష జరిపాడని దర్యాప్తు అధికారులకు వెల్లడించాడు. అరెస్టైన ఉగ్రవాద అనుమానిత డాక్టర్లు అందరూ ఉమర్ తన గదిలో పేలుడు పదార్థాలు, రసాయన ప్రతిచర్యలను టెస్ట్ చేశాడని పేర్కొన్నారు. పోలీసులు సూట్‌కేస్‌లో గుర్తించిన బాంబు తయారీ వస్తువులు కూడా ఈ విషయాలను ధృవీకరించాయి.

కాగా, హ్యుందాయ్ ఐ20 కారు పేలుడుకు ఉమర్ ఉన్ నబీ ఉపయోగించినది సగం పూర్తి చేసిన ఐఈడీని తీసుకువెళ్లాడని దర్యాప్తు అధికారులు తెలిపారు. బాంబు తయారీలో అసిటోన్, లేదా నెయిల్ పాలిష్ రిమూవర్, పొడి చక్కెరను ఉపయోగించినట్టుగా దర్యాప్తు వర్గాలు వివరించాయి. హర్యానాలో దాచిన పేలుడు పదార్థాలను జమ్మూ కశ్మీర్‌కు తీసుకెళ్లాలని తొలుత అనుకున్నారని, ఉమర్ అక్కడేదో పెద్ ప్లాన్ చేశాడని వర్గాలు చెప్పాయి. ఆ ప్రణాళిక అమలు చేయలేకపోవడంతో ఐఈడీ తయారీలో ఉపయోగించే యూరియాను నుహ్-మేవాట్ ప్రాంతం నుంచి కొనుగోలు చేయడం మొదలుపెట్టారని గుర్తించారు.

Read Also- T20 World Cup Schedule: భారత్-పాకిస్థాన్ మధ్య మరో మ్యాచ్.. తేదీ ఖరారు.. టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల

నాయకుడిగా భావించుకునేవాడు

ఉమర్ ఉన్ నబీ తనను తాను ఉగ్రవాద మాడ్యూల్‌కు నాయకుడిగా (ఎమిర్) అని పిలుచుకునేవాడని విచారణలో ఉన్న ముజామిల్ షకీల్ వెల్లడించారు. ఉమర్ ఏకంగా 9 భాషలు మాట్లాడగలడని, ఉగ్రవాద మాడ్యూల్‌లో అత్యంత విద్యావంతుడు అతడేనని, తెలివిగా ఉండేవాడంటూ ముజామ్మిల్ చెప్పినట్టుగా దర్యాప్తు అధికారులు వివరించారు. ఉమర్ ఈజీగా అణుశాస్త్రవేత్త అయ్యేవాడని ముజామిల్ షకీల్ అభివర్ణించాడని తెలిపారు. ‘‘మేము ఉమర్ ఉన్ నబీని ఎదిరించలేకపోయాం. అతడి మాటలు వాస్తవాలు. పరిశోధనలతో నిండి ఉండేవి. తనను తాను ఎమిర్‌గా పిలుచుకునేవాడు. ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. ఇదంతా మతం గురించే తప్ప, మరి దేనికోసమూ కాదు అంటూ చివరి వరకు చెప్పేవాడు’’ అని ముజామిల్ షకీల్ చెప్పాడని పేర్కొన్నారు.చేర్చుకున్నాడు.

కాగా, ఢిల్లీలోని చాందినీ చౌక్‌ వద్ద జరిగిన కారు బాంబు పేలుడులో 15 మంది చనిపోయారు. 20 మందికిపైగా గాయపడ్డారు. హర్యానాలోని ఫరీదాబాద్‌లో వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ బయటపడడం, తన సహచర అనుమానిత ఉగ్రవాదులను పట్టుకున్న రెండు రోజుల్లోనే బాంబర్ ఉమర్ ఈ పేలుడుకు పాల్పడ్డాడు.

Read Also- AP New Districts: ఏపీలో కొత్తగా మూడు జిల్లాలు.. 5 రెవెన్యూ డివిజన్లు.. సీఎం చంద్రబాబు పచ్చజెండా

Just In

01

Dharma Mahesh: మరో స్టేట్‌లోనూ మొదలెట్టిన ధర్మ మహేష్..

Kerala Local Polls: కేరళ రాజకీయాల్లో కీలక పరిణామం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం?

Drug Seizure: 70 లక్షల విలువైన మాదక ద్రవ్యాలు సీజ్.. ఎలా పట్టుకున్నారంటే?​

AIIMS Bibinagar: తెలంగాణ ప్రజల డీఎన్ఏలో డేంజర్ బెల్స్.. రీసెర్చ్‌లో బయటపడ్డ సంచలన విషయాలు?

Messi In Hyderabad: హైదరాబాద్‌లో క్రేజ్ చూసి మెస్సీ ఫిదా.. కీలక వ్యాఖ్యలు