NEET PG 2025 (Image Source: Twitter)
జాతీయం

NEET PG 2025: నీట్ పరీక్షపై బిగ్ అప్‌డేట్.. సుప్రీం కోర్టు కీలక ఉత్తర్వులు

NEET PG 2025: నీట్ పరీక్షలకు సంబంధించి దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. నీట్‌ పీజీ-25 (NEET-PG 2025) ప్రవేశ పరీక్షను ఆగస్టు 3న నిర్వహించేందుకు అనుమతించింది. నేషనల్ ఎగ్జామినేషన్ బోర్డ్ (NEB) చేసిన అభ్యర్థన మేరకు జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. దీంతో నీట్ కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు రెండు నెలల సమయం దొరకనుంది.

వైద్య విద్యలో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల ప్రవేశాలకు కోసం జాతీయ స్థాయిలో నీట్ పరీక్షను ఏటా నిర్వహిస్తుంటారు. ఈ ఏడాదికి గాను జూన్ 15న రెండు షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహించాలని ఎన్ఈబీ నిర్ణయించింది. అయితే సింగిల్ సిట్టింగ్ లో పరీక్షలను నిర్వహించాలని మే 30న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. రెండు విడతలుగా పరీక్ష నిర్వహించడానికి నిరాకరించింది. రెండు రకాల ప్రశ్నాపత్రాలు ఎప్పటికీ ఒకే విధమైన ప్రభావాన్ని అభ్యర్థులపై చూపలేవని అభిప్రాయపడింది.

Also Read: Etela Rajender: కేసీఆర్ చెప్పినట్లే చేశా.. కాళేశ్వరంలో నా ప్రమేయం లేదు.. ఈటల

అయితే జూన్ 15న డబుల్ షిఫ్ట్ లో పరీక్షలు నిర్వహించేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను నేషనల్ ఎగ్జామినేషన్ బోర్డ్ పూర్తి చేసింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఒకేసారి నిర్వహించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. దీంతో మరిన్ని ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడింది. జూన్ 15వ తేదీకి ఎక్కువ దూరం లేకపోవడంతో.. పరీక్ష నిర్వహణకు మరింత సమయం ఇవ్వాలని సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని తాజాగా NEB కోరింది. వారి కోరికను మన్నించిన కోర్టు.. ఆగస్టు 3న నిర్వహించుకునేందుకు అనుమతిచ్చింది. ఆగస్టు 3 తర్వాత వాయిదాకు ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని పేర్కొంది.

Also Read This: Hari Hara Veera Mallu: అఫీషియల్.. హరి హర వీరమల్లు మరోసారి వాయిదా!

 

Just In

01

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?