IndiGo flight Bomb Threat: ఇండిగో విమానంలో బాంబు?
IndiGo flight Bomb Threat(image credit:X)
జాతీయం

IndiGo flight Bomb Threat: ఇండిగో విమానంలో బాంబు? అప్రమత్తమైన అధికారులు!

IndiGo flight Bomb Threat: ముంబైలోని సహార్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది, ఇండిగో విమానంలో బాంబు పెట్టామని ఓ అజ్ఞాత వ్యక్తి కాల్ చేసి హెచ్చరించాడు.

వెంటనే అప్రమత్తమైన అధికారులు తనిఖీలు చేపట్టారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ పేరుతో 9 ఉగ్రస్థావరాలను మిస్సైళ్లతో పేల్చి వేసిన విషయం తెలిసిందే. ఈ మెరుపుదాడుల్లో 100కి పైగా ఉగ్రవాదులు మరణించినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో ముంబై విమానాశ్రయ హాట్‌లైన్‌కు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ రావడం కలకలం రేపింది. భారత్ మెరుపు దాడులపై ప్రతీకారం తీర్చుకుంటామని పాక్ ఓపెన్ గా చెప్పగా.. ఏ క్షణం ఏం జరుగుతుందోనని సర్వత్రా ఆందోళన నెలకొంది.

Also read: Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ పై బీఆర్ఎస్ రియాక్షన్!

బాంబు బెదిరింపు కాల్ నేపథ్యంలో విమానాశ్రయ సిబ్బంది, భద్రతా అధికారులు అప్రమత్తమయ్యారు. విమానాశ్రయం మొత్తం బాంబ్ స్క్వాడ్ తో తనిఖీలు చేస్తున్నారు. ప్రయాణికుల సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని భద్రతా సంస్థలు.. విమానాలు, పరిసర ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నాయి. ఇప్పటి వరకూ అనుమానాస్పద వస్తువులు కనిపించలేదని అధికారులు తెలిపారు.

 

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..