Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ పైన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. పాకిస్తాన్ లోని తీవ్రవాద శిబిరాలపై విజయవంతంగా దాడులు నిర్వహించిన భారత ఆర్మీకి సెల్యూట్ అని కేటీఆర్ అన్నారు. తీవ్రవాద శిబిరాలను పూర్తిగా తుడిచిపెట్టే శక్తి ఆర్మీ కి ఉందని జై హింద్ అంటూ తన x కాతాలో పోస్ట్ చేశారు. పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలపై జరిపిన వైమానిక దాడులను స్వాగతిస్తున్నామని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రవాదులు చేసిన దాష్టికానికి గట్టిగా సమాధానం ఇచ్చిన భారత సైన్యం తన సత్తాను చాటిందని అన్నారు. భారత సైన్యం చర్యలు అభినందనీయమని, ఇలాంటి సమయంలో పార్టీలకు అతీతంగా ఐక్యతను చాటాల్సిన అవసరం ఎంతైన ఉందని కవిత పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు భారత సైన్యానికి అండగా నిలబడి వారి ధైర్యాన్ని మెచ్చుకోవాలని కవిత అన్నారు. తీవ్రవాద శిబిరాలు తుదముట్టించాలి.
Also Read: Ibrahimpatnam: వాట్సప్‌లో వైద్యం.. వికటించి కవలలు మృతి!
అమాయకులను కాల్చిచంపిన ఉగ్ర మూకల పై భారత సైన్యం చేపట్టిన చర్యలకు సెల్యూట్ అంటూ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఈ దేశం మొత్తం మీ వెంట ఉందని, పార్టీలకు అతీతంగా ఈ దేశమంతా మీ వెనక నడుస్తుందని అన్నారు. భారతీయులందరం ఏకమై ఐక్యత చాటాల్సిన సమయ సందర్భం ఇదని, ఆపరేషన్ సింధూర్ తో ఉగ్రవాద మూకల నిర్మూలన కార్యక్రమం విజయవంతం కావాలని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.