Minister Rajnath Singh (Image Source: Twitter)
జాతీయం

Minister Rajnath Singh: పాక్‌కు రక్షణ మంత్రి మాస్ వార్నింగ్.. గూస్ బంప్స్ రావాల్సిందే!

Minister Rajnath Singh: పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack) తర్వాత తొలిసారి జమ్ము కాశ్మీర్ లో పర్యటించారు. చినార్ కార్ప్స్ హెడ్ క్వార్టర్స్ ను సందర్శించిన ఆయన.. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అధికారులతో సమావేశమయ్యారు. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) సందర్భంగా వారు ప్రదర్శించిన ధైర్య సాహసాలను ప్రశంసించారు. అనంతరం శ్రీనగర్ బాదామీ కాంట్ లో జరిగిన కార్యక్రమంలో రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. అమాయక భారత ప్రజలను ముష్కరులు ధర్మం (ఆచరించే మతం) చూసి చంపారని.. సాయుధ దాళాలు వారి కర్మను చూసి అంతం చేశాయని అన్నారు.

పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత సాయుద దళాలు ఇచ్చిన సమాధానాన్ని యావత్ ప్రపంచం చూసిందని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ (Rajnath Singh)అన్నారు. ఉగ్ర శిబిరాలు ఎక్కడ ఉన్నా నాశనం చేస్తామని చెప్పారు. ఆపరేషన్ సిందూర్ ఒక పేరు మాత్రమే కాదన్న రాజ్ నాథ్.. అదొక కమిట్మెంట్ అని చెప్పుకొచ్చారు. భారత్ పై మరోమారు ఉగ్రదాడి జరిగితే దానిని యుద్ధ చర్యగానే భావిస్తామని తేల్చి చెప్పారు.

Also Read: Boycott Delhi Capitals: ఐపీఎల్‌ను తాకిన బాయ్ కాట్ సెగ.. ఆ జట్టును నిషేధించాలని డిమాండ్!

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేసిన ప్రతిజ్ఞ ఎంతో బలమైనదని రాజ్ నాథ్ సింగ్ అన్నారు. అణ్వాయుధాల బెదిరింపులను సైతం పట్టించుకోలేదని స్పష్టం చేశారు. పాక్ ఎంత బాధ్యతారాహిత్యంగా బెదిరించిందో ప్రపంచం మెుత్తం చూసిందని అన్నారు. బాధ్యతారాహిత్యంగా ఉండే దుష్టదేశం వద్ద అణ్వాయుధాలు భద్రంగా ఉన్నాయా? అంటూ రక్షణ మంత్రి ప్రశ్నించారు. పాకిస్థాన్ అణ్వాయుధాలను అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) పర్యవేక్షిస్తుందని తాను నమ్ముతున్నట్లు చెప్పారు.

Also Read This: Virat Kohli: కోహ్లీని బీసీసీఐ ఇబ్బంది పెట్టిందా? రిటైర్మెంట్ వెనక షాకింగ్ నిజాలు!

Just In

01

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?