Boycott Delhi Capitals: భారత్ – పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో బాయ్ కాట్ నినాదం దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. భారత్ తో యుద్ధంలో పాక్ మద్దతుగా నిలిచిన టర్కీపై భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ దేశానికి చెందిన ఆపిల్స్, మార్బుల్స్, టూరిజంపై నిషేధం విధిస్తున్నారు. అయితే ఈ బాయ్ కాట్ ఉధ్యమం తాజాగా ఐపీఎల్ ను తాకింది. ఐపీఎల్ నుంచి ఢిల్లీ జట్టును బహిష్కరించాలంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. #BoycottDelhiCapitals హ్యాష్ ట్యాగ్ ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.
బాయ్ కాట్ ఎందుకంటే?
భారత్ – పాక్ యుద్ధం నేపథ్యంలో వాయిదా పడ్డ ఐపీఎల్.. తిరిగి పునఃప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. అయితే యుద్ధ భయంతో తమ దేశాలకు వెళ్లి ఫారెన్ ప్లేయర్స్ స్థానంలో ఐపీఎల్ జట్లు ప్రత్యామ్నాయాన్ని వెతుక్కుంటున్నాయి. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లిపోయిన క్రికెటర్ జాక్ ఫ్రేజర్ మెక్ గర్క్ (Jake Fraser-McGurk) స్థానంలో బంగ్లా పేసర్ ముస్తాఫిజర్ రెహమాన్ (Mustafizur Rahman)ను జట్టులోకి తీసుకున్నట్లు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తాజాగా ప్రకటించింది.
ఢిల్లీ జట్టుపై ఫైర్!
అయితే బంగ్లా ప్లేయర్ ను జట్టులోకి తీసుకోవడంపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. యుద్ధ సమయంలో పాక్ కు మద్దతుగా బంగ్లాదేశ్ నేతలు మాట్లాడరని నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. అయినప్పటికీ బంగ్లా ప్లేయర్ ను ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకోవడం దేశానికే అవమానమంటూ వ్యాఖ్యానిస్తున్నారు. పాక్ బాహాటంగానే మద్దతిస్తున్న బంగ్లాదేశ్ ప్లేయర్ ను జట్టులోకి తీసుకొని ఢిల్లీ జట్టు క్షమించరాని తప్పు చేసిందని అంటున్నారు. కాబట్టి ఐపీఎల్ నుంచి ఢిల్లీ జట్టును బహిష్కరించాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం #BoycottDelhiCapitals హ్యాష్ ట్యాగ్ ట్విటర్ లో తెగ ట్రెండ్ అవుతోంది.
YES Boycott 🔥🔥
Shame on Delhi Capitals!
How can they pick players from a country where anti-India voices are growing and open support for Pakistan exists?
Is the IPL running out of true patriots?
We stand against those who stand against India.#BoycottDelhiCapitals pic.twitter.com/jCC0HxkwSe— Shiva (@Shivak81) May 14, 2025