Dhananjay Munde
జాతీయం

Dhananjay Munde: సర్పంచ్ దారుణ హత్యలో ఆరోపణలు.. మంత్రి రాజీనామా

Dhananjay Munde: మహారాష్ట్ర బడ్ జిల్లాలో సర్పంచ్ దారుణ హత్య ఘటనలో కీలక పరిణామాం చోటుచేసుంది. ఈ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పౌర సరఫరాల శాఖ మంత్రి ధనుంజయ్ ముండే (Dhananjay Munde) తన పదవికి రాజీనామా చేశారు. సర్పంచ్ సంతోష్ దేశ్ ముఖ్ హత్య కేసులో మంత్రి అనుచరుడు ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. దానికి తోడు మంత్రి సొంత జిల్లాకు చెందిన సర్పంచ్ కావడంతో ధనుంజయ్ ముండేపై సైతం పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ధనుంజయ్ తన పదవికి రాజీనామా చేయడం మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.

సీఎం ఒత్తిడితోనే రాజీనామా

బీడ్‌ గ్రామానికి చెందిన సర్పంచ్‌ సంతోష్ దేశ్‌ముఖ్‌ (Santhosh Deshmukh)ను గతేడాది డిసెంబర్ 9న కొందరు దుండగులు కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన అప్పట్లోనే మహారాష్ట్ర రాజకీయాలను పెద్ద ఎత్తున కుదిపేశాయి. బాధితులు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ముమ్మర దర్యాప్తు తర్వాత మంత్రి ధనుంజయ్ ముండే అనుచరుడైన వాల్మిక్ కరాడ్ ను అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే జైలులో ఉన్న కరాడ్ ను మంత్రికి అత్యంత సన్నిహితుడైన బాలాజీ తండే కలవడం మరింత వివాదస్పదమైంది. చనిపోయిన సర్పంచ్.. ఎన్సీపీ శరద్ పవార్ వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఆ పార్టీ నేతలు మంత్రిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ధనుంజయ్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వివాదం రోజు రోజుకు ముదురుతుండటంతో సీఎం ఫడ్నవీస్ రంగంలోకి దిగారని తెలుస్తోంది. ఆయన సూచన మేరకే ధనుంజయ్ ముండే తన మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం.

Also Read: MLA Spits Assembly: ఇదేం వికృతం.. అసెంబ్లీలో గుట్కా ఉమ్మిన ఎమ్మెల్యే

‘ప్రభుత్వాన్ని రద్దు చేయాలి’

మరోవైపు మంత్రి ధనంజయ్ ముండే రాజీనామాపై శివసేన (యూబీటీ) ఎమ్మెల్యే, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే తీవ్రస్థాయిలో స్పందించారు. రాజీనామా ఒక్కటే సరిపోదని మెుత్తం ప్రభుత్వాన్నే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గత మూడేళ్లుగా రాష్ట్రంలో శాంతి భద్రతలు దారుణంగా పతనమయ్యాయని ఆయన మండిపడ్డారు. మహారాష్ట్రలో పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే పెట్టుబడలు ఎలా వస్తాయని ప్రశ్నించారు.

 

Just In

01

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు