Kolkata earthquake: బెంగాల్ లోని కోల్ కతా నగరంలో శుక్రవారం భూకంపం సంభవించింది. ఉ.10.08 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా భూమి కంపించింది. కొన్ని సెకన్ల పాటు భూమి కదిలిపోవడంతో ఒక్కసారిగా నగరవాసులు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. భూ ప్రకంపనలకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నగరవాసులు ఏమన్నారంటే..
కోల్ కతా నగరంలోని చాలా మంది ప్రజలు.. ఈ భూ ప్రకంపనలను ఫేస్ చేశారు. తమ ఇళ్లు ఒక్కసారిగా ఊగిపోయాయని, గోడకు తగిలించిన వస్తువులు జారీ కిందపడిపోయాయని పలువురు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. తలుపులు, కిటికీలు కొద్దిసేపు ఊగిపోవడం తాము గమనించామని పేర్కొన్నారు. ఏం జరుగుతుందో అర్థంకాక.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశామని స్పష్టం చేశారు. మెుత్తంగా ఈ ప్రకంపనల ధాటికి వేలాది మంది నగరవాసులు ఇళ్ల నుంచి బయటకు వచ్చేసినట్లు అధికారులు చెబుతున్నారు.
వీడియోలు వైరల్..
ఉదయం 10 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. అయితే అప్పటికే చాలా మంది ఆఫీసులకు వెళ్లిపోయారు. ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో ఉద్యోగులు బయటకు వచ్చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఐటీ క్యారిడార్ లో చాలా మంది ఉద్యోగులు ఏం జరుగుతుందో అర్థంకాక రోడ్లపైనా నిలబడిపోవడం చూడవచ్చు. అలాగే ఇంట్లోని ఫ్యాన్లు ఊగిపోతున్న దృశ్యాలను సైతం కొందరు నెట్టింట పంచుకున్నారు.
All employees were asked to step out as buildings shook due to earthquake tremors in Kolkata#Kolkata #earthquake pic.twitter.com/dEM8Lu0nyo
— Karl Marx2.O (@Marx2PointO) November 21, 2025
#Earthquake: People vacating offices in the IT sector of Saltlake city in #Kolkata following strong tremors felt in parts of #WestBengal. pic.twitter.com/omkIlB7Aqa
— Pooja Mehta (@pooja_news) November 21, 2025
Kolkata experienced earthquake tremors today.#Kolkata #EarthQuake pic.twitter.com/bvdRneDEaV
— Karl Marx2.O (@Marx2PointO) November 21, 2025
బంగ్లాదేశ్‌లో భూకంప కేంద్రం..
బంగ్లాదేశ్ లో సంభవించిన భారీ భూకంపం కారణంగానే కోల్‌కతాలో ప్రకంపనలు సంభవించాయి. కోల్‌కతాలోని వాతావరణ విభాగం ప్రకారం.. బంగ్లాదేశ్‌లోని నర్సింఘ్డి జిల్లాలో 10 కిలోమీటర్ల లోతులో 5.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని ప్రభావంతో బెంగాల్ లోని కోల్ కతా, దక్షిణ్, దినాజ్ పూర్, కూచ్ బెహార్ ప్రాంతాలతో పాటు మేఘాలయ, త్రిపుర, మిజోరం రాష్ట్రాలలోను ప్రకంపనలు సంభవించినట్లు తెలిపింది. అయితే బంగ్లాదేశ్ లో భూకంపం తీవ్రత ఎక్కువగా ఉన్నా ఇప్పటివరకూ ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించి ఎలాంటి నివేదికలు వెలువడలేదు. కాగా పాకిస్థాన్ లోని 3.9 తీవ్రతో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) ఓ ప్రకటనలో తెలిపింది.
Also Read: studios trade license issue: పన్నుల ఎగవేతపై టాలీవుడ్ బడా స్టూడియోలకు జీహెచ్ఎంసీ నోటీసులు..
బంగ్లాదేశ్ – ఐర్లాండ్ మ్యాచ్‌పై ప్రభావం..
ప్రస్తుతం బంగ్లాదేశ్ – ఐర్లాండ్ మధ్య ఢాకాలో టెస్టు సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఆటపైనా భూకంపం ప్రభావం కనిపించింది. మూడో రోజు ఆట సందర్భంగా మైదానంలో స్వల్ప ప్రకంపనలు సంభవించాయి. క్రికెట్ ఆడుతున్న క్రమంలో స్టేడియం కొన్ని సెకన్ల పాటు ఊగిపోయిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. స్టేడియంలోని ప్రేక్షకులు కొద్దిసేపు గందరగోళానికి గురయ్యారు. దీంతో మ్యాచ్ ను కొద్దిసేపు నిలిపివేశారు. కాసేపటి తర్వాత సాధారణ స్థితి ఏర్పడటంతో తరిగి మ్యాచ్ ను ప్రారంభించారు.
Strong earthquake in Bangladesh, hope everyone is safe. 🇧🇩 pic.twitter.com/VZ4QwbS9qm
— ICC Asia Cricket (@ICCAsiaCricket) November 21, 2025
