Indigo flight
జాతీయం, లేటెస్ట్ న్యూస్

IndiGo: వెళ్లి చెప్పులు కుట్టుకో.. ఇండిగో ట్రైనీ పైలట్‌పై కులవివక్ష!

IndiGo: దేశీయ విమానయాన సంస్థ ‘ఇండిగో’కు (Indigo) చెందిన ట్రైనీ పైలట్‌కు కుల వివక్ష ఎదురైంది. తనను అవమానకరమైన పేర్లతో పిలుస్తూ, కాక్‌పిట్‌లో కూర్చోవడానికి, విమానం నడిపేందుకు అర్హత లేదంటూ కుల వివక్ష చూపిస్తున్నారని శరణ్ కుమార్ అనే ట్రైనీ పైలట్ ఆరోపించాడు. ఇంటికెళ్లి చెప్పులు కుట్టుకో అంటూ తనను ఎగతాళి చేస్తున్నారని ఫిర్యాదులో వివరించాడు. ‘‘ఇతరుల ముందు నాపై ఈ వివక్ష వ్యాఖ్యలు చేశారు. చట్టం ప్రకారం ఈ తరహా వ్యాఖ్యలు తీవ్రమైన నేరం. వెనక్కి వెళ్లి చెప్పులు కుట్టుకోవాలంటూ నా పూర్వీకుల కుల వృత్తిని ప్రస్తావిస్తూ మాట్లాడారు. మా బూట్లు నాకే అర్హుత కూడా నీకు లేదన్నారు’’ అని శరణ్ తండ్రి అశోక్ కుమార్ చెప్పారు. ఈ మేరకు పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. నిందితుల పేర్లు తపస్, మనీష్ సహాని, రాహుల్ పాటిల్‌‌గా పేర్కొన్నారు.

Read this- Upasana: రెండో పెళ్లికి రెడీ అవుతోన్న ఉపాసన.. సోషల్ మీడియాను ఊపేస్తున్న న్యూస్?

‘‘నా ముందు కూర్చొని నన్ను వివరణ అడిగే ధైర్యం ఉందా నీకు?. ఈ బిల్డింగ్‌లో వాచ్‌మెన్‌గా ఉండే అర్హత కూడా నీకు లేదు. నువ్వు నన్ను వివరణ అడుగుతున్నావా?’’ అని శరణ్ కుమార్ వివరించాడు. శరణ్ కుమార్ తండ్రి అశోక్ కుమార్ ఫిర్యాదు ఆధారంగా, ముగ్గురు నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం, భారతీయ న్యాయ సంహితలోని (BNS) పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తన సహోద్యోగుల చేతుల్లో నిరంతరం వేధింపులు, వివక్షకు గురవుతున్నానని శరణ్ కుమార్ చెప్పాడు. తనను అవమానించే ఉద్దేశ్యంతో కులం పేరిట దూషించారని చెప్పాడు. వృత్తిపరంగా ఇబ్బందులకు గురిచేశారని, డ్యూటీ చేసినా అనధికారికంగా శాలరీలో కోతలు, ఆమోదయోగ్యం కాని కారణాలు చూపించి సిక్ లీవ్స్ తగ్గించడం వంటివి చేశారని పేర్కొన్నాడు. ఎలాంటి తప్పులు చేయకపోయినా తప్పులు సరిదిద్దుకునే శిక్షణకు పదేపదే పంపించేవారని వివరించాడు. ఎలాంటి కారణం లేకుండా ఉద్యోగానికి రాజీనామా చేయాలంటూ ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేయడం, తనపై వివక్ష చూపించేందుకు అధికారాన్ని దుర్వినియోగపరిచారని ఆయన పేర్కొన్నారు.

Read this- Trisha – Vijay: సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న విజయ్, త్రిష జంట.. పెళ్లి ఫిక్స్ అయినట్లేనా?

శరణ్ కుమార్ తండ్రి అశోక్ కుమార్ కుల వివక్ష వ్యవహారాన్ని ఇండిగో ఎయిర్‌లైన్స్ సీఈవో, ఎథిక్స్ కమిటీ దృష్టకి కూడా తీసుకెళ్లారు. అయితే, ఫిర్యాదు చేసినప్పటికీ, నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని వివరించారు. ‘‘నాకు జరిగిన అన్యాయానికి, నా హక్కులు కాపాడేందుకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు’’ అని చెప్పారు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

పని ప్రదేశంలో కుల వివక్ష అంశం మన దేశంలో చాలామందిని ప్రభావితం చేస్తోంది. ఇదొక సామాజిక సమస్యగా మారింది. ఉద్యోగ అవకాశాలు, పదోన్నతులు, వ్యక్తిగత గౌరవంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కులం ఆధారంగా చులకనగా చూడడం, అవమానించటం, అవహేళన చేయడం కుల వివక్షగా పరిగణిస్తారు. మాటలు, చర్యలు ఏవిధంగా కులవివక్ష చూపకూడదు. పేరుతో కాకుండా కులం పేరిట పిలవడం నేరం అవుతుంది. కులం ఆధారంగా ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తిని కూడా తక్కువగా చూడడం, ప్రతికూల వాతావరణం సృష్టించడం కూడా కులవివక్ష కిందకే వస్తుంది.

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ