Upasana: ఏంటి ఉపాసన రెండో పెళ్లి చేసుకోబోతుందా అని అనుకుంటున్నారా? అవును మీరు వింటున్నది నిజమే. ఉపాసన రెండో పెళ్లికి రెడీ అవుతోంది. ఈ వార్త రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అంతేకాదు మెగా ఫ్యాన్స్ అయితే.. షాక్ అవుతున్నారు. ఉపాసన రెండో పెళ్లి చేసుకోవడం ఏంటని? అయితే, రామ్ చరణ్ ఉపాసన అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే.
రెండో పెళ్లి చేసుకోబోతున్న ఉపాసన?
ఉపాసన అంటే రామ్ చరణ్ సతీమణి కాదు.. సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్, డైరెక్టర్ అనీష్ ఉపాసన. ఇతను అంజలి అనే నటిని మొదటి వివాహం చేసుకుని, ఆ తర్వాత చిన్న చిన్న మనస్పర్ధాల కారణంగా ఇద్దరూ విడిపోయారు. అయితే, వీరిద్దరి కలిసి మ్యాట్నీ అనే చిత్రంలో నటించారు. ఆ సమయంలో వీరి స్నేహం ప్రేమగా మారి, పెళ్లి వరకు వెళ్లింది.
Also Read: Star Comedian: స్నానం చేయక చేతికి గజ్జి వచ్చిందంటూ.. ఎమోషనల్ అయిన స్టార్ కమెడియన్
ఆ నటితో అనీష్ ఉపాసన పెళ్లి ?
అలా ఈ చిత్రంలో అంజలి కథానాయికగా చేయడంతో డైరెక్టర్ గా వర్క్ చేసిన అనీష్ ఉపాసన, అంజలికి మధ్య స్నేహం బంధాన్ని పెళ్లి బంధంగా మార్చారు. అయితే, వీరు ఎక్కువ కాలం కలిసి కాపురం చేయలేదు. ఇద్దరి మధ్య గొడవలు రావడంతో డివోర్స్ తీసుకుని విడిపోయారు. అంజలి వెంటనే వేరే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంది. కానీ, అనీష్ ఉపాసన మాత్రం ఇంకా సింగిల్ గానే ఉన్నాడు.
తాజాగా నటి తుషార కమలాక్షితో దిగిన ఫోటోను షేర్ చేస్తూ హార్ట్ సింబల్ తో న్యూ లైఫ్ పార్ట్నర్ అంటూ పోస్ట్ చేశాడు.
Also Read: Niharika Konidela: ఆ హీరోతో నా రిలేషన్ ఐదేళ్లు.. లవ్ సింబల్ తో హింట్ ఇచ్చిన నిహారిక కొణిదెల?