Niharika Second Marriage: మెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika Konidela)గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం, టాలీవుడ్ లో హీరోయిన్ గా, నిర్మాతగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటూ దూసుకెళ్తుంది. 2024 లో కమిటీ కుర్రాళ్లతో పాటు, వెబ్ సిరీస్ లు కూడా తీస్తూ నిహారిక హిట్స్ అందుకుంది. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన గద్దర్ అవార్డును కూడా మెగా డాటర్ అందుకుంది. నిహారిక కొణిదెల పర్సనల్ లైఫ్ గురించి మొదటిసారి ఆమె తండ్రి నాగబాబు (Nagababu) కామెంట్స్ చేశారు.
నా కూతురు విషయంలో ఆ తప్పు చేశాను. మొదటి పెళ్లి విడాకుల విషయంలో “మేమూ సరిగా జడ్జ్ చేయలేకపోయాం” అంటూ ఆయనే స్వయంగా చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు.
2020లో చైతన్య జొన్నలగడ్డతో పెద్దల సమక్షంలో పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. అయితే, చిన్న చిన్న మనస్పర్ధాల కారణంగా ఇద్దరూ విడిపోయారు. అయితే, ఇప్పటి వరకు ఈ విషయంపై మెగా కుటుంబం నుంచి స్పదించింది లేదు. నాగబాబు ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో దీని పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నిహారిక రెండో పెళ్లి గురించి మాట్లాడుతూ “ నా కూతురు ఎవరి సపోర్ట్ లేకుండా తన కష్టంతో ముందుకు వెళ్తుంది. సరైన వ్యక్తిని తనే చూసుకుంటాది. ఇప్పటి నుంచి వారి జీవితాల్లో నేను ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వాలనుకోవడం లేదు ” అంటూ నిహరికాకు సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు.
Also Read: Naga Chaitanya: సమంతను కలిసిన రోజు హగ్ ఇచ్చి అలా చేస్తానంటూ చైతూ షాకింగ్ కామెంట్స్.. వీడియో వైరల్