Akkineni Family ( Image Source Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Akkineni Family : కోడళ్ల రాకతో అక్కినేని ఇంట హిట్ ట్రాక్.. నాగ్, చై దాటిన గండాన్ని అఖిల్ గట్టెక్కుతాడా?

Akkineni Family : గత కొంత కాలం నుంచి అక్కినేని ఫ్యామిలీకి మంచిగానే ఉందని చెప్పుకోవాలి. తీసిన ప్రతి సినిమా సినిమా హిట్ అవుతుంది. అంతే కాదు, వీరి పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతున్నాయి. అయితే, నెటిజన్లు ఇదంతా పెద్ద కోడలు శోభిత వల్లనే అని కొందరు, ఇంకొందరు కాదు చిన్న కోడలు జైనబ్ వలనే అని కామెంట్స్ చేస్తున్నారు. సమంతకి విడాకులు ఇచ్చిన తర్వాత నాగ చైతన్య శోభితను పెళ్లి చేసుకుని అక్కినేని ఇంటికి పెద్ద కోడలిగా తీసుకొచ్చాడు. వీరి వివాహం డిసెంబర్ 4 న జరిగిన విషయం తెలిసిందే.

పెళ్లి తర్వాత నాగచైతన్యకు హిట్?

పెళ్లి తర్వాత నాగచైతన్య తండేల్ చిత్రంలో నటించగా.. ఈ మూవీ చైతూ కెరీర్ లోనే సూపర్ హిట్ గా నిలిచింది. అంతకు ముందు చైతు వరుస ఫ్లాప్స్ తో సతమతమయ్యాడు. పెళ్లి తర్వాత చైతు మొదటి హిట్ కొట్టాడని అక్కినేని అభిమానులు సంతోషపడ్డారు. రూ. 100 కోట్ల క్లబ్ లోకి కూడా చేరిపోయాడు. అయితే, ఇదంతా శోభిత వచ్చాకే ఇలా జరగడంతో ఆమెను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఫ్లాప్స్ తో మా హీరో ని గండం నుంచి బయటకు తీసుకొచ్చావని ఎన్నో వేల పోస్టులు పెట్టారు.

కొత్త కోడళ్ల రాకతో నాగ్ కూడా హిట్ కొట్టాడు

అలాగే నాగార్జున కూడా చాలా కాలం నుంచి సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. కోడళ్ళరాకతో ఆయన ఇటీవల కుబేర మూవీతో వచ్చి పెద్ద హిట్ కొట్టారు. హిట్ మాత్రమే కాకుండా నాగ్ చేసిన పాత్రకు అభినందనలు వస్తున్నాయి. ఇది మాత్రమే కాకుండా రజినీకాంత్ కూలి చిత్రంలో కూడా కీలక పాత్రలో నటించాడు. ఇది కూడా రిలీజ్ కు దగ్గర పడుతుండటంతో సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

నాగ్, చై దాటిన గండాన్ని అఖిల్ గట్టెక్కుతాడా?

చాలా కాలం నుంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్న అఖిల్ హిట్ కొడతాడా? లేదా అని చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే, నాగ చైతన్య, నాగార్జున హిట్ కొట్టి గండం నుంచి గట్టెక్కారు. ఇంత వరకు బాగానే ఉంది. మరి, ఇప్పుడు అఖిల్ కూడా తన తీయబోయే కొత్త సినిమాతో హిట్ కొట్టి గండం నుంచి గట్టెక్కుతాడో? లేదో చూడాల్సి ఉంది.

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ