Indian Railways: భారతీయ రైల్వేల్లో పరిశుభ్రత గురించి ఇటీవల కాగ్ ఓ నివేదిక విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో ప్రయాణికులు ఎదుర్కొన్న ఓ ప్రధానమైన సమస్య గురించి కాగ్ ప్రస్తావించింది. కాగ్ నివేదిక ప్రకారం.. 2022-23లో రైల్వే బోగీలలో ఎలుకలు, బొద్దింకలు, కీటకాలు ఉన్నాయని 15,000కి పైగా ఫిర్యాదులు నమోదు అయ్యాయి. ఈ సమాచారం రైల్ మాదద్ (Rail Madad) ఫిర్యాదు పరిష్కార వ్యవస్థ ద్వారా సేకరించబడింది. ఏసీ కోచ్‌లు, సాధారణ ప్రయాణికుల బోగీలు రెండింటిలోనూ పరిశుభ్రత లోపాలు తీవ్రంగా ఉన్నాయని ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా ప్రీమియం ఏసీ కోచ్ లలో సేవా ప్రమాణాలు వాస్తవ పరిస్థితుల మధ్య పెద్ద తేడా ఉన్నట్లు కాగ్ పేర్కొంది.
ఆ జోన్లలో ఎక్కువ ఫిర్యాదులు
రైళ్లల్లో ఎలుకలు, పురుగులు ఉండటంపై మెుత్తంగా 15,028 ఫిర్యాదులు అందినట్లు కాగ్ రిపోర్ట్ పేర్కొంది. వాటిలో 79 శాతం ఏసీ కోచ్‌ల గురించి వచ్చినవేనని తెలిపింది. ఎక్కువ చార్జీలు చెల్లించే ప్రయాణికులు పరిశుభ్రతపై ఎక్కువ ఆశలు పెట్టుకుంటున్నారని దీన్ని బట్టి అర్థమవుతోంది. సౌత్ సెంట్రల్, వెస్ట్రన్, సదర్న్, నార్త్ ఈస్ట్రన్ రైల్వే జోన్లు అత్యధిక ఫిర్యాదులు అందినట్లు కాగ్ రిపోర్ట్ తెలిపింది. మరోవైపు నార్త్ సెంట్రల్, సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్లు తక్కువ ఫిర్యాదులు నమోదు చేశాయి.
Also Read: Vinayaka Chavithi Wishes: వినాయక చవితి స్పెషల్.. ఈ కోట్స్‌తో మీ మిత్రులకు విషెస్ చెప్పండిలా..
ఫిర్యాదుల్లో 229% వృద్ధి
పరిశుభ్రతకు సంబంధించి 2019-20తో పోలిస్తే 2022-23లో ఫిర్యాదులు మరింత పెరిగాయని కాగ్ రిపోర్ట్ తెలిపింది. 2019-20లో 69,950 ఫిర్యాదులు రాగా 2022-23లో ఇది 229% పెరిగి 2.42 లక్షలకు చేరుకుంది. ఎంపిక చేసిన రైళ్లలో నిర్వహించిన సర్వేల్లో మరుగుదొడ్లు మూసుకుపోవడం, వాష్‌బేసిన్లు పనిచేయకపోవడం, బొద్దింకలు, ఎలుకలు కనిపించడం వంటి సమస్యలు 1/4 వంతు ప్రయాణికులను ప్రభావితం చేసినట్లు కాగ్ నివేదికలో తేలింది.
Also Read: Mother kills daughter: రాష్ట్రంలో ఘోరం.. 3 ఏళ్ల కూతుర్ని చంపి తల్లి కూడా.. కారణం తెలిస్తే షాకే!
రైళ్లల్లో నీటి సమస్య
2022-23 ఆర్థిక సంవత్సరంలో మరుగుదొడ్లు, వాష్ బేసిన్లలో నీరు అందుబాటులో లేదని తెలియజేస్తూ మొత్తం 1,00,280 ఫిర్యాదులు అందాయని కాగ్ తన రిపోర్ట్ లో పేర్కొంది. వాటన్నింటిని భారతీయ రైల్వే పరిష్కరించిందని తెలిపింది. అయితే 33,937 (33.84%) ఫిర్యాదుల్లో సమస్య పరిష్కారానికి నిర్ధేశిత గడువు కంటే ఎక్కువ సమయం పట్టిందని కాగ్ తన రిపోర్ట్ లో తెలియజేసింది.వాటన్నింటిని భారతీయ రైల్వే పరిష్కరించిందని తెలిపింది. దూరప్రయాణ రైళ్లలో బయో-టాయిలెట్ల శుభ్రతపై సర్వే నిర్వహించినట్లు కాగ్ తాజా రిపోర్ట్ లో తెలిపింది. దీని ప్రకారం 96 రైళ్లలో 2,426 మంది ప్రయాణికులతో సర్వే నిర్వహించారు. ఇందులో ఐదు జోన్‌లలో 50% కంటే ఎక్కువ మంది ప్రయాణికులు సంతృప్తి వ్యక్తం చేయగా రెండు జోన్‌లలో 10% లోపు మాత్రమే సంతృప్తి వ్యక్తమైంది.