Appache Helicopters (Image Source: Twitter)
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Appache Helicopters: టార్గెట్ పాకిస్థాన్.. సైన్యంలోకి గేమ్ ఛేంజింగ్ యుద్ధ హెలికాఫ్టర్లు.. ఇక చుక్కలే!

Appache Helicopters: భారత సైన్యం శక్తి సామర్థ్యాలను మరింత పెంచే పవర్ ఫుల్ అపాచీ హెలికాఫ్టర్లు రాబోతున్నాయి. అగ్రరాజ్యం అమెరికాతో చేసుకున్న ముందస్తు ఒప్పందం ప్రకారం జూలై 21 నాటికి మూడు మెుదటి బ్యాచ్ AH-64E అపాచీ హెలికాఫ్టర్లు భారత్ కు చేరనున్నాయి. యూపీలోని హిండన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ (Hindan Air Force Station)కు అపాచీ హెలికాఫ్టర్లు చేరుకోనున్నట్లు సైనిక వర్గాలు పేర్కొన్నాయి. మిగిలిన మూడు హెలికాఫ్టర్లు ఈ ఏడాది చివరి నాటికి దిగుమతి అవుతాయని స్పష్టం చేశాయి. పాకిస్థాన్ తో ఉద్రిక్తల నేపథ్యంలో సరిహద్దు వెంబడి ముఖ్యంగా జోద్ పూర్ సమీపంలోని ఎడారి సెక్టార్ లో వీటిని మోహరించనున్నట్లు తెలుస్తోంది.

అపాజీ హెలికాఫ్టర్ల సామర్థ్యాలు
ప్రస్తుతం భారత వైమానిక దళాలు.. ధ్రువ్, రుద్ర, లైట్ కంబాట్ హెలికాఫ్టర్లను వినియోగిస్తున్నాయి. అమెరికా నుండి వచ్చే AH-64E అపాచీ హెలికాప్టర్ల చేరికతో మన ఎయిర్ ఫోర్స్ దాడి సామర్థ్యాలు మరింత పెరుగుతాయని సైనిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ అపాచీ హెలికాఫ్టర్లను ‘గాలిలో ట్యాంకులు’ (Tanks in the air) అని కూడా పిలుస్తారు. నేలపైన యుద్ధ ట్యాంకులు ఏ విధంగా పనిచేస్తాయో.. ఇవి కూడా ఆకాశంలో అదే విధంగా వర్క్ చేస్తాయి. AGM-114 హెల్‌ఫైర్ క్షిపణులు, 70mm హైడ్రా రాకెట్లు, AIM-92 స్టింగర్ ఎయిర్-టు-ఎయిర్ క్షిపణులను ఇది మోసుకెళ్లగలవు. వీటితో పాటు 1200 రౌండ్లు కలిగిన 30mm చైన్ గన్, 360° కవరేజ్ ఉన్న ఫైర్ కంట్రోల్ రాడార్ ఈ హెలికాఫ్టర్ల శక్తిని మరింత పెంచేవిగా ఉన్నాయి.

365 కి.మీ వేగంతో రయ్ రయ్..
AH-64E అపాచీ అత్యాధునిక సాంకేతికతతో రూపొందిన యుద్ధ హెలికాఫ్టర్ (War Crafts). ఇందులో రెండు జనరల్ ఎలక్ట్రిక్ T700-GE-701D టర్బోషాఫ్ట్ ఇంజన్లు ఉంటాయి. ప్రతి ఒక్కటి 1,994 షాఫ్ట్ హార్స్‌పవర్ ఉత్పత్తి చేస్తాయి. ఫలితంగా గరిష్టంగా 365 కి.మీ/గం (227 మైళ్ల/గం), క్రూయిజ్ వేగం 279 కి.మీ/గం వేగంతో ఇది ప్రయాణించగలదు. ఆకాశంలో 20వేల అడుగుల ఎత్తువరకూ వెళ్లగలదు. ఇందులో టార్గెట్ ఎక్విజిషన్ అండ్ డెసిగ్నేషన్ సిస్టమ్ (TADS), నైట్ విజన్ సిస్టమ్స్, లాంగ్‌బో ఫైర్ కంట్రోల్ రాడార్, లింక్-16 డేటా లింక్ వంటి అత్యాధునిక సాంకేతికతను అమర్చారు.

Also Read: Viral Video: ఏం గుండెరా అది.. భారీ అనకొండను భలే పట్టేశాడు!

2020లోనే ఒప్పందం
2015లో అమెరికాతో కుదిరిన ఒప్పందం ప్రకారం.. ఇప్పటికే 22 అపాచీ హెలికాఫ్టర్లు భారత్ వద్ద ఉన్నాయి. పఠాన్‌కోట్, జోర్హాట్‌ ప్రాంతాల్లో ఇవి చురుగ్గా ఉన్నాయి. అయితే 2020లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత పర్యటన సందర్భంగా మరో ఆరు అపాచీ హెలికాఫ్టర్లు అందించేందుకు గాను ఒప్పందం కుదిరింది. ఇందులో 600 మిలియన్ డాలర్ల అగ్రిమెంట్ జరిగింది. ఇందులో భాగంగా తొలి బ్యాచ్ హెలికాఫ్టర్లు జులై 21న.. మిగిలిన మూడు ఈ ఏడాది ఆఖరిలో భారత్ కు సరఫరా కానున్నాయి.

Also Read This: Immunity Boosting Tips: శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే 7 చిట్కాలు.. ఇవి పాటిస్తే డాక్టర్‌తో పని లేనట్లే!

Just In

01

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు