India on Pak Ban (Image Source: Twitter)
జాతీయం

India on Pak Ban: పాక్‌లో హిందువుల ఊచకోత.. పార్లమెంటు వేదికగా కేంద్రం కీలక ప్రకటన!

India on Pak Ban: పాకిస్థాన్ లో మైనారిటీలైన హిందువులపై జరుగుతున్న దాడుల గురించి కేంద్రం స్పందించింది. పాక్ లో హిందువుల ఊరచకోత గురించి ఎదురైన ప్రశ్నకు కేంద్ర విదేశాంగ శాఖ సహాయమంత్రి (Minister of State for External Affairs) కీర్తి వర్ధన్ సింగ్ రాజ్యసభలో సమాధానం ఇచ్చారు. పాక్ (Pakisthan)తో పాటు బంగ్లాదేశ్ (Bangladesh), అఫ్గానిస్తాన్ (Afghanistan)లో మైనారిటీలపై జరుగుతున్న దాడులను ఎప్పటికప్పుడు భారత్ ఎండగడుతూనే ఉందని ఆయన స్పష్టం చేశారు. దాడి ఘటనలను జెనీవాలోని మానవ హక్కుల హై కమీషన్ కార్యాలయం దృష్టికి సైతం తీసుకెళ్లినట్లు చెప్పారు.

కేంద్ర మంత్రి ఏమన్నారంటే?
రాజ్యసభలో కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ (Kirti Vardhan Singh) మాట్లాడుతూ ‘భారత ప్రభుత్వం 2021 నుండి పాకిస్థాన్‌లో మైనారిటీలపై జరిగిన కనీసం 334 ప్రధాన హింసాత్మక సంఘటనలను ఖండించింది. పాక్ తో పాటు బంగ్లాదేశ్‌లో జరిగిన 3,582 హింసాత్మక ఘటనలపై ఆ దేశాలతో చర్చించింది. పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘానిస్తాన్‌లలో మతపరమైన మైనారిటీలపై జరిగే హింస, దారుణాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ కేంద్రం దానిపై స్పందిస్తూనే ఉంది’ అని రాజ్యసభలో కేంద్ర మంత్రి అన్నారు.

‘ఐరాస దృష్టికి తీసుకెళ్లాం’
పాక్ లోని మైనారిటీలకు అక్కడి చట్టాలు కల్పించిన హక్కులు అమలయ్యేలా చూడాలని కేంద్రం పలుమార్లు విజ్ఞప్తి చేసినట్లు కేంద్ర మంత్రి చెప్పారు. రాజ్యాంగబద్ధమైన బాధ్యతలను నిర్వర్తించాలని, మత అసహనం, మతపరమైన పక్షపాత భావాలు, వర్గపోరు హింసలను ఆపాలని కోరినట్లు చెప్పారు. అంతటితో ఆగకుండా పాకిస్థాన్‌లో మైనారిటీల పరిస్థితి, మానవ హక్కుల ఉల్లంఘనలను జెనీవాలోని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో భారత్ ప్రస్తావించిందని అన్నారు. దీనిపై జులైలో ఐరాస మానవ హక్కుల కమిషన్ ఓ ప్రకటన సైతం విడుదల చేసిందని గుర్తుచేశారు.

Also Read: Viral Video: డ్రగ్ మాఫియాను అడ్డంగా బుక్ చేసిన చిలుక.. ఎలాగో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

బంగ్లాదేశ్ లో దాడులపై..
‘2021 నుండి హిందువులు, ఇతర మైనారిటీలపై 3,582 హింసాత్మక సంఘటనలు నమోదయ్యాయి. ఈ విషయంపై బంగ్లాదేశ్ ప్రభుత్వంతో మా ఆందోళనలను పంచుకున్నాము. మైనారిటీల భద్రత సంక్షేమం కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించాం’ అని రాజ్యసభలో కేంద్ర మంత్రి అన్నారు. అక్కడి ప్రభుత్వం ఈ దాడులను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. కాగా బంగ్లాదేశ్ లో మాజీ ప్రధాని హసీనా పదవి నుంచి దిగిపోయిన దగ్గర నుంచి హిందువులపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో అక్కడి మైనారిటీ హిందువులు తమ హక్కుల కోసం రోడ్డెక్కి పోరాడుతున్నారు.

Also Read This: Income Tax Bill: కేంద్రం అనూహ్య నిర్ణయం.. ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లు-2025 ఉపసంహరణ 

Also Read This: Akhanda 2 Update: అఖండ 2: తాండవం- డబ్బింగ్ పూర్తి చేసిన బాలయ్య.. రిలీజ్ డేట్ విషయంలో తగ్గేదేలే..

 

Just In

01

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?