Akhanda 2 Update: గాడ్ ఆఫ్ మాస్ బాలయ్య క్రేజీ ప్రాజెక్ట్ ‘అఖండ 2: తాండవం’. ఈ సినిమాకు నందమూరి బాలకృష్ణ డబ్బింగ్ పూర్తి చేసినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ చిత్రాన్ని మాస్ యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్నారు. ఇది బాలకృష్ణతో ఆయన నాల్గవ సినిమా. 2021లో విడుదలైన ‘అఖండ’ బ్లాక్‌బస్టర్‌కు సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ చిత్రం, సెప్టెంబర్ 25, 2025న దసరా సందర్భంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఎం. తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన టీజర్, ఆయన శివభక్తుడి పాత్రలో త్రిశూలంతో శత్రువులను సంహరించే దృశ్యాలు అభిమానులను ఆకట్టుకున్నాయి. దీంతో ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
‘అఖండ 2’లో బాలకృష్ణ పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తారు. సంయుక్త మీనన్ కథానాయికగా, ఆది పినిశెట్టి విలన్‌గా నటిస్తున్నారు. హర్షలి మల్హోత్రా తెలుగు సినిమాల్లో అడుగుపెడుతోంది. సినిమాటోగ్రఫీని సి. రాంప్రసాద్, సంతోష్ డి. డిటేక్, ఎడిటింగ్‌ను తమ్మిరాజు, ఆర్ట్ డైరెక్షన్‌ను ఎ.ఎస్. ప్రకాశ్, యాక్షన్ సన్నివేశాలను రామ్-లక్ష్మణ్ చేపట్టారు. ఎస్. థమన్ సంగీతం ఈ చిత్రానికి మరింత బలం చేకూరుస్తోంది. పోస్ట్-ప్రొడక్షన్ పనులు శరవేగంతో సాగుతున్నాయి. సిజి వర్క్, రీ-రికార్డింగ్, ఇతర ఫైనల్ టచ్‌లు ఈ నెలాఖరులో పూర్తవుతాయని, మూడు వారాల్లో మొదటి కాపీ సిద్ధమవుతుందని నిర్మాతలు ప్రకటించారు. జార్జియాలోని సుందరమైన లొకేషన్‌లలో, ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహా కుంభమేళాలో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.
సెప్టెంబర్ 25న పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’తో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఢీకొననుంది, ఇది తెలుగు సినిమా పరిశ్రమలో భారీ పోటీ నెలకొంది. అభిమానులు ‘అఖండ 2’ను ‘జాతర’లా థియేటర్లలో జరుపుకుంటారని, బాలకృష్ణ శివ తాండవం రూపంలో మరో బ్లాక్‌బస్టర్ అందిస్తారని ఆశిస్తున్నారు. అయితే ‘ఓజీ’ హైప్ కూడా ఓ రేంజ్ లో ఉంది. ఇప్పటికే విడుదలైన ‘ఓజీ’ టైటిల్ సాంగ్ సంచలనాలు సృష్టిస్తోంది. అయితే ఈ రెండు సినిమాలు ఓకే రోజు రావడంతో తెలుగు ప్రేక్షకులు దేనిని ఆదరిస్తారో చూడాలి మరి. ‘అఖండా 2’, ‘ఓజీ’ సినిమాలు పాన్ ఇండియా లెవల్‌లో విడుదల కానున్నాయి.